STOCKS

News


ఆగస్ట్‌లో తగ్గిన వాణిజ్య లోటు

Wednesday 12th September 2018
news_main1536745758.png-20202

న్యూఢిల్లీ:- ఆగస్ట్‌లో వాణిజ్య లోటు స్వల్పంగా తగ్గింది. ఈ నెలలో వాణిజ్య లోటు 17.4 బిలియన్‌ డాలర్లగా నమోదైంది. వాణిజ్య మంత్రిత్వశాఖ బుధవారం విడుదల చేసిన గణాంకాల్లో ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి...
-    ఆగస్ట్‌లో ఎగుమతులు 19.21శాతం పెరిగి 27.84 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. పెట్రోలియం, ఇతర ఉత్పత్తులకు విదేశాల నుంచి ఆర్డర్లు పెరగడం ఎగుమతుల పెరుగుదలకు దోహదపడింది. పెట్రోలియం ఉత్పత్తులను ఎగుమతులను మినహాయించినప్పటికీ వృద్ధి 17.43శాతంగా ఉన్నట్లు కేంద్ర వాణిజ్య శాఖ వెల్లడించింది.
-    ఇక దిగుమతులు సైతం 25.41శాతం పెరిగి 45.24 బిలియన్‌ డాలర్లకు చేరుకున్నాయి. ఆగస్ట్‌లో పెరిగిన ముడిచమురు ధరలు ఇందుకు కారణమయ్యాయి.
-    ఫలితంగా ఆగస్ట్‌లో వాణిజ్యలోటు 17.4 కోట్ల బిలియన్‌ డాలర్లకు చేరుకుంది.
-    జూలైలో వాణిజ్యలోటు 18.02 బిలియన్‌ డాలర్ల నమోదై ఐదేళ్ల గరిష్టస్థాయిని తాకిన సంగతి తెలిసిందే.
-    2018లో ఏప్రిల్‌–ఆగస్ట్‌లో మధ్య ఎగుమతులు 16.13శాతం పెరగ్గా, దిగుమతులు 17.34శాతం పెరిగాయి.



You may be interested

టాప్‌ మిడ్‌క్యాప్‌ సిఫార్సులు..

Wednesday 12th September 2018

వచ్చే రెండేళ్ల కాలంలో గ్రామీణ ప్రాంతంలో ఎక్కువగా వ్యాపార కార్యకలాపాలు కలిగిన కంపెనీలు మంచి పనితీరు కనబర్చవని ఇన్వెస్ట్‌మెంట్‌ అడ్వైజర్‌ వివేక్‌ మవాని తెలిపారు. అందువల్ల మహీంద్రా ఫైనాన్స్‌ను ఎంచుకోవచ్చని పేర్కొన్నారు. మిడ్‌క్యాప్స్‌లో గ్యాస్‌ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీలు, వాహన విడిభాగాల కంపెనీలకు ప్రాధ్యానమివ్వొచ్చని తెలిపారు. ఆయన ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు వెల్లడించారు. రూపాయి మరింత బలహీనపడితే ఈక్విటీ మార్కెట్లు కూడా నష్టపోతాయని తెలిపారు. సమీప

స్టాక్స్‌ ఎంపికలో జాగ్రత్త!!

Wednesday 12th September 2018

అమెరికా డాలర్‌తో పోలిస్తే దేశీ కరెన్సీ కొత్త కనిష్ట స్థాయిలకు పతనమౌతోందని 5నాన్స్‌.కామ్‌ ఫౌండర్‌ దినేశ్‌ రొహిరా తెలిపారు. కరెంట్‌ అకౌంట్‌ లోటు పెరిగిందన్నారు. ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్లు సోమవారం కీలక స్థాయిల దిగువకు వచ్చేశాయని పేర్కొన్నారు. అమెరికా-చైనా వాణిజ్య ఉద్రిక్తతలు మళ్లీ ఆజ్యం పోసుకోవడం మార్కెట్‌ సెంటిమెంట్‌ను దెబ్బతీస్తోందని తెలిపారు.  ఈ వారంలో నిఫ్టీ ఇండెక్స్‌ తొలిగా 11,500 స్థాయి కిందకు, తర్వాత 1,300 స్థాయి దిగువకు వచ్చిందని పేర్కొన్నారు.

Most from this category