News


చమురు డిమాండ్‌లో రెండవస్థానానికి భారత్‌

Wednesday 23rd January 2019
Markets_main1548222347.png-23750

- 2019పై ఉడ్‌ మెకెన్‌జీ నివేదిక
న్యూఢిల్లీ: చమురు డిమాండ్‌ విషయంలో చైనాను ఈ ఏడాది భారత్‌ అధిగమించనుందని రిసెర్చ్‌ అండ్‌ కన్సల్టెన్సీ గ్రూప్‌ ఉడ్‌ మెకెన్‌జీ మంగళవారం విడుదల చేసిన తన నివేదికలో పేర్కొంది. ప్రస్తుతం చమురు డిమాండ్‌ విషయంలో వరుస మూడు స్థానాల్లో అమెరికా, చైనా, భారత్‌ ఉన్నాయి. భారత్‌లో ఈ ఏడాది ఆటో ఫ్యూయెల్‌, ఎల్‌పీజీ వినియోగం గణనీయంగా పెరుగుతున్నట్లు పేర్కొన్న నివేదిక, ఈ కారణంగా చమురు డిమాండ్‌లో చైనాను భారత్‌ అధిగమించనున్నట్లు విశ్లేషించింది. నివేదికలో కొన్ని ముఖ్యాంశాలు చూస్తే...
- 2018లో భారత్‌ చమురు డిమాండ్‌ భారీగా పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా చమురు డిమాండ్‌ రోజూ వారీగా 2,45,000 బ్యారెళ్లు పెరుగుతుంటే, అందులో ఒక్క భారత్‌ వాటా 14 శాతంగా ఉంది. 2019లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతుందని భావిస్తున్నాం.
- అమెరికా ఇంధన సమాచార నిర్వహణ (ఈఐఏ) విభాగం గణాంకాల ప్రకారం- 2017-18లో భారత్‌ చమురు డిమాండ్‌ 206.2 మిలియన్‌ టన్నులు. అంటే రోజుకు 4 మిలియన్‌ బ్యారెళ్లు.
- 2040 నాటికి భారత్‌ చమురు డిమాండ్‌ రోజుకు 5.8 మిలియన్‌ బ్యారెళ్లకు చేరుతుందని గత ఏడాది ఆగస్టులో చమురు ఉత్పత్తి దేశాల సమాఖ్య- ఒపెక్‌ పేర్కొంది.
- దేశంలో కార్ల కొనుగోలుదారుల సంఖ్య పెరుగుతోంది. పెరుగుతున్న ఆదాయాలు దీనికి కారణం. దీనితో​ ప్రపంచవ్యాప్తంగా పలు ఆటోమొబైల్‌ కంపెనీలు భారత్‌ ఆటోమార్కెట్‌వైపు చూస్తున్నాయి. అదే సమయంలో ద్విచక్ర వాహనాల విక్రయాలూ గణనీయంగా పెరుగుతున్నాయి.You may be interested

క్యు3లో ఫండ్‌ మేనేజర్లు ఏం చేశారు?

Wednesday 23rd January 2019

డిసెంబర్‌ త్రైమాసికంలో వివిధ మ్యూచువల్‌ ఫండ్‌ మేనేజర్లు సరాసరి 194 కంపెనీల్లో వాటాలు పెంచుకున్నారు. గతేడాది భారీగా పతనమైన పలు స్టాకుల్లో ఎంఎఫ్‌లు కొనుగోళ్లు జరిపాయి. ఎక్కువ ఫండ్‌ మేనేజర్లు కాంట్రాబయింగ్‌ జరిపారు. నాణ్యమైన స్టాకులు బహిర్గత కారణాలతో పతనమైతుంటే వాటిలో పొజిషన్లు తీసుకోవచ్చని నిపుణులు సూచిస్తుంటారు. ఫండ్‌ మేనేజర్లు ఈ విధానాన్ని పాటించి అశోక్‌ బుల్డ్‌కాన్‌, ఎన్‌సీసీ, కేఎన్‌ఆర్‌ కనస్ట్రక‌్షన్స్‌, ఒరియంట్‌ సిమెంట్‌, డిక్సన్‌ టెక్నాలజీ, అపోలోటైర్స్‌, ఎంఎం

వ్యవస్థలోకి రూ.10వేల కోట్లు: ఆర్‌బీఐ

Wednesday 23rd January 2019

ముంబై: వ్యవస్థలో ద్రవ్య లభ్యత (లిక్విడిటీ) సమస్యలు రాకుండా చూస్తామన్న తమ హామీకి అనుగుణంగా రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) చర్యలు తీసుకుంటోంది. తన ఓపెన్‌ మార్కెట్‌ ఆపరేషన్స్‌ (ఓఎంఓ) ద్వారా గురువారం రూ.10,000 కోట్ల బాండ్లను బైబ్యాక్‌ చేయనున్నట్లు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ విధానం ద్వారా జనవరిలో రూ.50,000 కోట్లను వ్యవస్థలోకి పంప్‌ చేస్తామని ఆర్‌బీఐ ఇప్పటికే ప్రకటించింది. ఇందులో రూ.30,000 కోట్ల బాండ్‌

Most from this category