STOCKS

News


మెరుగైన రవాణాతోనే ఆర్థిక వృద్ధి

Saturday 8th September 2018
news_main1536380575.png-20072

న్యూఢిల్లీ: మెరుగైన రవాణాతో ఆర్థిక వ్యవస్థ వృద్ధి పెరుగుతుందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ, బ్యాటరీలు, స్మార్ట్‌ చార్జింగ్‌ సదుపాయాలు సహా ఎలక్ట్రిక్‌ వాహనాలకు సంబంధించి అన్ని విభాగాల్లో (చైన్‌) పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామిక వేత్తలకు పిలుపునిచ్చారు. పర్యావరణంపై పోరుకు శుద్ధ ఇంధన ఆధారిత రవాణా మన చేతుల్లో ఉన్న శక్తిమంతమైన ఆయుధంగా పేర్కొన్నారు. కార్లపైనే కాకుండా స్కూటర్లు, ఆటో రిక్షాల తయారీపైనా దృష్టి సారించాలన్నారు. ఢిల్లీలో శుక్రవారం గ్లోబల్‌ మొబిలిటీ సమ్మిట్‌ (ప్రపంచ రవాణా సదస్సు) ‘మూవ్‌’ను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ప్రపంచ ఆటోమొబైల్‌ సంస్థల సీఈవోలు, పలు దేశాల నుంచి వచ్చిన వివిధ రంగాల ప్రముఖులు పాల్గొన్నారు. రద్దీ కారణంగా పర్యావరణంపై పడే ప్రభావాన్ని నిరోధించేందుకు రద్దీ రహిత రవాణా కీలకమని ప్రధాని అభిప్రాయపడ్డారు. ‘‘మెరుగైన రవాణా సదుపాయాల వల్ల ప్రయాణ, రవాణా వ్యయాలు తగ్గుతాయి. ఆర్థికాభివృద్ధికి ఊతం లభిస్తుంది. ఇప్పటికే ఎక్కువ ఉ‍ద్యోగాలను ఇస్తున్న రవాణా రంగం, తదుపరి తరం ఉద్యోగాలను కూడా సృష్టించగలదు. కాలుష్య ఉద్గారాల నియంత్రణకు, శిలాజ ఇంధనాలపై ఆధారపడడాన్ని తగ్గించేందుకు, వచ్చే ఐదేళ్లలో మొత్తం వాహన విక్రయాల్లో ఎలక్ట్రిక్‌ వాహనాల వాటా 15 శాతం ఉండాలనే లక్ష్యాన్ని విధించుకున్నాం’’ అని ప్రధాని వ్యాఖ్యానించారు.
ప్రజా రవాణాతో రద్దీకి చెక్‌
భారత్‌లో భవిష్యత్తు రవాణాపై తన విజన్‌... సాధారణ, అనుసంధాన, సౌకర్యవంతమైన, రద్దీ రహిత, శుద్ధ ఇంధన తదితర ఏడు ‘సీ’ల (కామన్‌, కనెక్టెడ్‌, కన్వీనియెంట్‌, కంజెషన్‌ ఫ్రీ, ఛార్జ్‌డ్‌, క్లీన్‌, కటింగ్‌ ఎడ్జ్‌) ఆధారంగా ఉంటుందని ప్రధాని మోదీ చెప్పారు. వ్యక్తిగత వాహనాలకు బదులు ప్రజారవాణాను వినియోగించుకోవడం వల్ల ట్రాఫిక్‌ జామ్‌లు తగ్గి, ప్రయాణించే వారిపై ఒత్తిడి తగ్గుతుందని సూచించారు. బ్యాటరీ టెక్నాలజీ ఆవిష్కరణల పట్ల భారత ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, తయారీదారులు సిద్ధంగా ఉన్నట్టు ప్రధాని చెప్పారు. తమ హయాంలో హైవేల నిర్మాణాన్ని రెట్టింపు చేశామని, గ్రామీణ రోడ్ల నిర్మాణ కార్యక్రమాన్ని తిరిగి పునరుజ్జీవింప చేశామని, శుద్ధ ఇంధన ఆధారిత వాహనాలకు ప్రోత్సాహం తదితర చర్యలు తీసుకుంటున్నామని ప్రధాని వివరించారు. 
భవిష్యత్తుకు ప్రాధాన్యం ఇవ్వాలి: గడ్కరీ
ఆటోమొబైల్‌ కంపెనీలు తమ ఆలోచన తీరును (మైండ్‌ సెట్‌) కొంత మార్చుకుని, భవిష్యత్తు కోసం మరింత ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ కోరారు. ఇందుకు విధానాల పరంగా ప్రభుత్వం వైపు నుంచి సహకారం ఉంటుందని భరోసా ఇచ్చారు. మూవ్‌ సదస్సును ఉద్దేశించి గడ్కరీ మాట్లాడుతూ... చుమరు దిగుమతులను తగ్గించడంతో పాటు, కాలుష్యానికి అంతం పలకాలనే విషయంలో ప్రభుత్వ విధానం స్పష్టంగా ఉందన్నారు. అందుకే ప్రత్యామ్నాయ ఇంధనాలైన ఇథనాల్‌, మెథనాల్‌, ఎలక్ట్రిక్‌ వాహనాలను ప్రోత్సహిస్తున్నట్టు చెప్పారు. భవిష్యత్తు రవాణాపై స్పష్టమైన విధానాల అవసరమనే వ్యాఖ్యలు పరిశ్రమకు చెందిన వారి నుంచి వ్యక్తం కావడంతో గడ్కరీ వారి సందేహాలు తీర్చే ప్రయత్నం చేశారు. ఇథనాల్‌కు మంచి భవిష్యత్తు ఉందని, ఎలక్ట్రిక్‌ వాహనాలకు ప్రజా రవాణా రంగంలో ఎన్నో అవకాశాలున్నాయని చెప్పారు.



You may be interested

8 నిమిషాల చార్జింగ్‌తో 200 కిలోమీటర్లు

Saturday 8th September 2018

న్యూఢిల్లీ: ‘టెర్రా హెచ్‌పీ ఫాస్ట్‌ చార్జింగ్‌ సిస్టమ్‌’ను ఏబీబీ భారత మార్కెట్‌ కోసం ఆవిష్కరించింది. ఇందుకు ప్రపంచ రవాణా సదస్సు వేదికగా నిలిచింది. కేవలం 8 నిమిషాల చార్జింగ్‌తో ఓ కారు 200 కిలోమీటర్లు ప్రయాణించడం ఈ వ్యవస్థ ప్రత్యేకత అని కంపెనీ తెలిపింది. రవాణా వ్యవస్థను ఎలక్ట్రిక్‌ ఆధారితంగా మార్చే విషయంలో భారత ప్రభుత్వ ఆకాంక్షలు, చర్యల్ని ఏబీబీ సీఈవో ఉల్‌రిచ్‌ స్పీసోఫర్‌ ప్రశంసించారు. మూవ్‌ సదస్సులో పాల్గొన్న

న్యూమెటల్ రెండో బిడ్ పరిశీలించండి

Saturday 8th September 2018

న్యూఢిల్లీ: వేలంలో ఎస్సార్‌ స్టీల్‌ కొనుగోలు కోసం రెండో రౌండులో న్యూమెటల్ వేసిన బిడ్ దాఖలు చేసిన బిడ్‌ చెల్లుబాటు అవుతుందని నేషనల్ కంపెనీ లా అపీలేట్ ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌ఏటీ) స్పష్టం చేసింది. వేదాంత సంస్థ బిడ్‌తో పాటు దీన్ని కూడా పరిశీలించాలని రుణ దాతల కమిటీకి  (సీవోసీ) సూచించింది. గత అనుబంధ సంస్థలు (ఉత్తమ్ గాల్వా, కేఎస్‌ఎస్ పెట్రోన్‌) కట్టాల్సిన రూ.7,000 కోట్ల రుణబాకీలను సెప్టెంబర్‌ 11లోగా చెల్లించేస్తే

Most from this category