STOCKS

News


టెల్కోల ఆదాయం 10% డౌన్‌

Thursday 4th October 2018
news_main1538627015.png-20843

న్యూఢిల్లీ: టెలికం సర్వీసుల ద్వారా ఆపరేటర్ల స్థూల ఆదాయం (జీఆర్) ఈ ఏడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో 10 శాతం తగ్గుదలతో రూ.58,401 కోట్లకు క్షీణించింది. సర్దుబాటు స్థూల ఆదాయం (ఏజీఆర్‌) 8.11 శాతం తగ్గి రూ.36,552 కోట్లుగా నమోదైనట్లు టెలికం రెగ్యులేటర్‌ ట్రాయ్‌ తన తాజా నివేదికలో పేర్కొంది. త్రైమాసికం పరంగా జీఆర్ 6.10 శాతం, ఏజీఆర్‌ 2.40 శాతం తగ్గినట్లు వెల్లడించింది. ఏజీఆర్‌లో ప్రధాన భాగమైన సర్వీసుల విక్రయ ఆదాయం.. ప్రభుత్వాని చెల్లించాల్సిన లైసెన్స్‌ ఫీజు కారణంగా తగ్గిందని, ఆదాయంలో 10 శాతం వాటా ఇదే ఉంటుందని ట్రాయ్‌ వివరించింది. You may be interested

సంస్కరణలను కొనసాగించాల్సిందే

Thursday 4th October 2018

వాషింగ్టన్‌: సంస్కరణల మార్గం తప్పుతున్న దేశాలను అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్‌) బుధవారం హెచ్చరించింది. దీనివల్ల అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో భద్రత తగ్గుతుందని, స్థిరత్వం అపాయంలో పడుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. అంతర్జాతీయంగా దేశాలు పరస్పర సహకారంతో సంస్కరణలను తప్పనిసరిగా కొనసాగించాల్సిన అవసరాన్ని గుర్తు చేసింది. అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం తర్వాత పదేళ్ల కాలంలో సంస్కరణల తీరు, భవిష్యత్తుకు సంబంధించి ఓ నివేదికను ఐఎంఎఫ్‌ విడుదల చేసింది. అంతర్జాతీయ

ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ రూ. 21 కోట్ల డిఫాల్ట్‌

Thursday 4th October 2018

ముంబై: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ గ్రూప్‌లో భాగమైన ఐఎల్అ౾ండ్‌ఎఫ్‌ఎస్‌ ట్రాన్స్‌పోర్టేషన్ నెట్‌వర్క్‌ (ఐటీఎన్‌ఎల్‌) దాదాపు రూ. 21 కోట్లు డిఫాల్ట్‌ అయింది. మూడు నాన్‌ కన్వర్టబుల్ డిబెంచర్స్‌ (ఎన్‌సీడీ)పై వడ్డీ చెల్లింపులు జరపలేకపోయినట్లు సంస్థ తెలిపింది. జూన్‌ 30 నుంచి సెప్టెంబర్ 29 మధ్యలో వీటిని చెల్లించాల్సి ఉన్నట్లు స్టాక్‌ ఎక్స్చేంజీలకు తెలియజేసింది. 19 సిరీస్ బీ కింద రూ. 10.58 కోట్లు, 19ఎం సిరీస్ ఏపై రూ.

Most from this category