STOCKS

News


భారత్‌.. ‘డిజిటల్‌’ లీడర్‌: అంబానీ

Thursday 20th December 2018
news_main1545283765.png-23102

న్యూఢిల్లీ: వచ్చే రెండు దశాబ్దాల్లో డిజిటల్‌ అనుసంధానం దిశగా ప్రపంచాన్ని భారత్‌ ముందుండి నడిపిస్తుందని రిలయన్స్‌ అధినేత ముకేశ్‌ అంబానీ అంచనా వేశారు. 130 కోట్ల మంది భారతీయుల భాగస్వామ్యంతో డేటా ఆధారిత నాలుగో పారిశ్రామిక విప్లవం వస్తుందని, దీంతో మానవాళి ఎదుర్కొంటున్న పలు సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని అన్నారు. ఇప్పటికే భారత్‌ గణనీయమైన డేటాను ఉత్పత్తి చేస్తోందన్నారు. రిపబ్లిక్‌ సమ్మిట్‌లో ఆయన మాట్లాడారు. దేశ జనాభాలో మెజార్టీవాటా యువతదేనని, వీరంతా కలిసి డేటాఆధారిత విప్లవాన్ని సృష్టిస్తారని చెప్పారు. రాబోయే రోజుల్లో మానవాళికి చెందిన ప్రతి చిన్న అంశం విపరీతమార్పులకు గురికానుందన్నారు. ఈ మార్పును ముందుగా అందిపుచ్చుకున్నవాళ్లు మనుగడ సాధిస్తారన్నారు. ప్రజాస్వామ్యానికి డిజిటల్‌ నిజమైన దోస్తీ అన్నారు. దేశీయ ప్రజలకు సంబంధించిన డేటా దేశీయ సంస్థల అధీనంలోనే ఉండాలి కానీ బడా అంతర్జాతీయ కార్పొరేట్‌ సంస్థల గుప్పిట్లోకి పోగూడదని అభిలషించారు. 



You may be interested

20 ఏళ్లలో 2,300 విమానాలు..

Thursday 20th December 2018

న్యూఢిల్లీ: భారత్‌లో విమాన ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో దేశీ ఎయిర్‌లైన్స్‌కు వచ్చే 20 ఏళ్లలో దాదాపు 2,300 విమానాలు అవసరం కానున్నాయి. వీటి కొనుగోలుకు సుమారు 320 బిలియన్ డాలర్లు (దాదాపు రూ. 22 లక్షల కోట్లు) వెచ్చించాల్సి ఉండనుంది. 2018-2037 మధ్య కాలానికి సంబంధించి ఈ మేరకు అంచనాలు ఉన్నట్లు విమానాల తయారీ సంస్థ బోయింగ్ సీనియర్ వైస్‌ ప్రెసిడెంట్‌ (ఆసియా పసిఫిక్‌, ఇండియా సేల్స్

ఆర్‌ఐఎల్ గ్యాస్ ప్రాజెక్టు వ్యయాలపై పీఏసీ దృష్టి

Thursday 20th December 2018

న్యూఢిల్లీ: కేజీ-డీ6 బ్లాక్‌లో నాలుగు అనుబంధ గ్యాస్ నిక్షేపాలను అభివృద్ధి చేసేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ 1.52 బిలియన్ డాలర్ల పెట్టుబడి ప్రణాళికలకు డీజీహెచ్‌ కమిటీ ఆమోదముద్ర వేయడాన్ని పార్లమెంటు ప్రజాపద్దుల కమిటీ (పీఏసీ) తప్పుపట్టింది. స్వతంత్ర థర్డ్ పార్టీ ధృవీకరణ లేకుండా ఆమోదం తెలపడంపై విచారణ జరపాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. అలాగే దీనికి బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు కూడా తీసుకోవాలని పేర్కొంది. ఈ మేరకు బుధవారం రెండో

Most from this category