STOCKS

News


డబ్ల్యూఈఎఫ్‌ ఇంధన పరివర్తన సూచీలో 76

Tuesday 26th March 2019
news_main1553584721.png-24800

రెండు స్థానాలు మెరుగుపడిన భారత్‌
టాప్‌-3లో స్వీడన్‌, స్విట్జర్లాండ్‌, నార్వే

న్యూఢిల్లీ: ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్‌) రూపొందించే అంతర్జాతీయ ఇంధన పరివర్తన సూచీలో భారత్‌ ఈ ఏడాది రెండు స్థానాలు పైకి ఎగబాకి 76కు చేరుకుంది. ఇందన భద్రత, పర్యావరణ స్థిరత్వం, ఇంధన అందుబాటు వంటి అంశాలను ఏ విధంగా సమతుల్యం చేసుకుంటున్నాయన్న దాని ఆధారంగా 115 దేశాలకు ఈ ర్యాంకులను డబ్ల్యూఈఎఫ్‌ కేటాయిస్తుంటుంది. ఈ జాబితాలో స్వీడన్‌ మరోసారి అగ్ర స్థానంలో నిలిచింది. స్విట్జర్లాండ్‌, నార్వే మొదటి మూడు స్థానాల్లో ఉన్నట్టు సోమవారం విడుదలైన డబ్ల్యూఈఎఫ్‌ నివేదిక పేర్కొంది. ఇంధన అనుసంధానత పెరిగినప్పటికీ... ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ 100 కోట్ల మంది విద్యుత్‌ వినియోగానికి దూరంగా ఉన్నట్టు వెల్లడించింది. అధిక జనాభాతోపాటు ఇంధన వ్యవస్థలో కార్బన్‌ డై ఆక్సైడ్‌ తీవ్రత అధికంగా ఉన్న దేశాల్లో భారత్‌ కూడా ఒకటని తెలిపింది. ‘‘అయినప్పటికీ భారత్‌ ఇటీవలి సంవత్సరాల్లో ఇంధన అందుబాటును పెంచేందుకు పెద్ద ముందడుగు వేసింది. ఇంధన పరివర్తన విషయంలో నియంత్రణ, రాజకీయ కట్టుబాటు విభాగాల్లో స్కోరు మెరుగ్గా ఉంది’’ అని నివేదిక పేర్కొంది. కాలం చెల్లిన ఇంధన వ్యవస్థలు భారత్‌లో ఉన్పప్పటికీ పరివర్తన దిశగా ఆశావహ పరిస్థితులు ఉన్నట్టు తెలిపింది. సిస్టమ్‌ల పనితీరులో భారత్‌ కాస్తంత వెనుకనే ఉన్నప్పటికీ, సన్నద్ధత విషయంలో మెరుగ్గా ఉంది. మొత్తం మీద భారత్‌ ఈ సూచీలో రెండు స్థానాలు మెరుగుపరుచుకుని 78 నుంచి 76కు చేరుకుంది. ఇక పొరుగు దేశం చైనా మన కంటే ఆరు స్థానాలు దిగువన 82లో ఉంది.



You may be interested

వంట నూనెల మార్కెట్లో బ్రాండ్స్‌ హవా

Tuesday 26th March 2019

వంట నూనెల మార్కెట్లో బ్రాండ్స్‌ హవా వ్యవస్థీకృత రంగానిదే 70 శాతం వాటా  సగటు వినియోగం 18 కిలోలకు చేరిక   హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: వంట నూనెల మార్కెట్లో బ్రాండెడ్‌ కంపెనీల హవా నడుస్తోంది. రెండు దశాబ్దాల క్రితం దేశంలో మొత్తం అమ్మకాల్లో విడినూనెల వాటా 70 శాతం ఉండేది. ప్రస్తుతం సీన్‌ రివర్స్‌ అయింది. ఇప్పుడీ వాటాను ప్యాక్డ్‌ విభాగం కైవసం చేసుకుంది. వ్యవస్థీకృత బ్రాండ్లు క్రమంగా మార్కెట్‌ను చేజిక్కించుకుంటున్నాయి. ఫుడ్‌ సేఫ్టీ

12,000 దివాలా కేసులు దాఖలు

Tuesday 26th March 2019

12,000 దివాలా కేసులు దాఖలు -4,500 కేసులు పరిష్కారం -రూ.2 లక్షల కోట్లు రికవరీ  -కంపెనీ వ్యవహారాల కార్యదర్శి శ్రీనివాస్‌ వెల్లడి  న్యూఢిల్లీ: దివాలా చట్టం అమలు, నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యునల్‌(ఎన్‌సీఎల్‌టీ) ఏర్పాటు చేసిన తర్వాత దాదాపు 12,000 కేసులు దాఖలయ్యాయని కంపెనీ వ్యవహారాల కార్యదర్శి ఇంజేటి శ్రీనివాస్‌  తెలిపారు. వీటిల్లో రూ.2 లక్షల కోట్ల సొమ్ములతో ముడిపడిన 4,500 కేసులు పరిష్కారమయ్యాయని పేర్కొన్నారు. 1500 కేసులను విచారించనున్నారని, మరో 6,000 కేసులు విచారణ

Most from this category