STOCKS

News


పోస్ట్‌ పేమెంట్స్‌ బ్యాంకు నుంచి రుణాలు

Thursday 9th August 2018
news_main1533791449.png-19066

న్యూఢిల్లీ: ఇండియా పోస్ట్‌ పేమెంట్స్‌ బ్యాంకు పలు బ్యాంకులు, ఆర్థిక సంస్థలతో జట్టు కట్టడం ద్వారా రుణాలు, మ్యూచువల్‌ ఫండ్లు, బీమా పాలసీలు తదితర ఆర్థిక ఉత్పత్తులను అందించేందుకు సన్నద్ధమవుతోంది. థర్డ్‌ పార్టీ టై అప్‌ ద్వారా పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు తరఫున రుణాలును ఆఫర్‌ చేయనుంది. అలాగే, బీమా ఉత్పత్తులను అందించేందుకు బజాజ్‌ అలియంజ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్టు అధికార వర్గాలు తెలియజేశాయి. ఈ నెల 21న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పోస్ట్‌ పేమెంట్స్‌ బ్యాంకు సేవలను ప్రారంభించనున్నారు. దేశవ్యాప్తంగా 650 శాఖల్లో ప్రస్తుతం ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ‘‘1.55 లక్షల తపాలా శాఖలు ఇండియా పోస్ట్‌ పేమెంట్స్‌ బ్యాంకుతో (ఐపీపీబీ) అనుసంధానం అవుతాయి. గ్రామీణ ప్రాంతాల్లో 1.3 లక్షల తపాలా కార్యాలయాలున్నాయి. వీటి ద్వారా దేశవ్యాప్తంగా అన్ని గ్రామాల్లోనూ ఇండియా పోస్ట్‌ పేమెంట్స్‌ బ్యాంకు సేవలు అందుతాయి’’ అని ఆ వర్గాలు తెలియజేశాయి. రాయ్‌పూర్‌, రాంచిలో రెండు శాఖలు ఇప్పటికే ప్రయోగాత్మకంగా పనిచేస్తున్నట్టు ఆ వర్గాలు చెప్పాయి. పేమెంట్స్‌ బ్యాంకులు రూ.లక్ష వరకు డిపాజిట్లను సేకరించొచ్చు. ఇతర బ్యాంకుల ఖాతాలకు నగదు బదిలీ సేవలను అందించవచ్చు. కానీ రుణాలు, క్రెడిట్‌ కార్డు సేవలను అందించేందుకు అనుమతి లేదు. మూడో పక్షంతో ఒప్పందం చేసుకుని వాటి తరఫున ఇతర ఆర్థిక సేవలను అందించొచ్చు. రూ.లక్ష  డిపాజిట్‌ పరిమితిని అధిగమించేందుకు 17 కోట్ల పోస్టాఫీసు సేవింగ్స్‌ బ్యాంకు ఖాతాలను ఇండియా పోస్ట్‌ పేమెంట్స్‌ బ్యాంకుతో అనుసంధానించేందుకు అనుమతి తీసుకుంది. రూ.లక్ష దాటితే ఆయా ఖాతాలను పోస్టాఫీసు సేవింగ్స్‌ బ్యాంకు ఖాతాల కింద మార్చేస్తారు. ప్రారంభంలో 11,000 మంది పోస్ట్‌మ్యాన్లు ఇంటి వద్దకే వచ్చి బ్యాంకింగ్‌ సేవల్ని అందించనున్నారు. 
పోస్ట్‌మ్యాన్‌ పేరు ‘పోస్ట్‌ పర్సన్‌’
పోస్ట్‌మ్యాన్‌ను పోస్ట్‌ పర్సన్‌గా మార్చే ప్రతిపాదను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. లింగపరమైన సమానత్వం కోసం పోస్ట్‌మ్యాన్‌కు బదులుగా పోస్ట్‌పర్సన్‌ అని పిలవాలని ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీకి సంబంధించిన పార్లమెంటరీ ప్యానల్‌ చేసిన సిఫారసే ఇందుకు మూలం. పోస్ట్‌ ఉమన్‌ కూడా పనిచేస్తున్నందున పోస్ట్‌ పర్సన్‌ అని పిలవడమే సముచితమని పేర్కొంది.You may be interested

పాత కార్యాలయం అమ్మకంపై పీఎన్‌బీ కసరత్తు

Thursday 9th August 2018

ముంబై: నష్టాలు, మొండిబాకీల భారం నుంచి కోలుకునే దిశగా ప్రభుత్వ రంగ పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) వివిధ ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా న్యూఢిల్లీలోని భికాజీ కామా ప్లేస్‌లోని తమ పాత ప్రధాన కార్యాలయ భవంతిని విక్రయించడంపై కసరత్తు చేస్తోంది. ఆదాయ పన్ను, సెంట్రల్ ఎక్సయిజ్ వంటి పలు ప్రభుత్వ విభాగాలతో చర్చలు జరుపుతోంది. భారీ డిమాండ్ నెలకొనడంతో ప్రాపర్టీ విలువను రెండోసారి మదింపు చేస్తున్నట్లు పీఎన్‌బీ ఎండీ

వెల్‌కమ్‌ టు ఐకియా..

Thursday 9th August 2018

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: స్వీడన్‌కు చెందిన అంతర్జాతీయ ఫర్నిచర్‌ దిగ్గజం ఐకియా... ఇండియాలో తన తొలి స్టోర్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిసింది. గురువారం ఈ స్టోర్‌ ప్రారంభం కానుంది. హైటెక్‌ సిటీకి చేరువలో మైండ్‌స్పేస్‌కు ఎదురుగా రూ.1,000 కోట్ల వ్యయంతో 4,00,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో దీనిని ఏర్పాటు చేశారు. ఒకేసారి వెయ్యి మంది కూర్చునే సామర్థ్యం ఉన్న రెస్టారెంట్‌ను కూడా ఐకియా ఈ స్టోర్‌లో ఏర్పాటు చేసింది. 7,500

Most from this category