STOCKS

News


బీమా రంగంలోకి ఇండియాపోస్ట్‌..

Friday 21st September 2018
news_main1537503803.png-20422

న్యూఢిల్లీ: ప్రత్యేకంగా బీమా సర్వీసుల వ్యాపార విభాగం ఏర్పాటుపై ఇండియా పోస్ట్ దృష్టి సారించింది. దీనికి సంబంధించి తగు సలహాలు ఇచ్చేందుకు కన్సల్టెంట్‌ల నుంచి బిడ్లను ఆహ్వానించింది. ఎంపికైన కన్సల్టెంటు.. వ్యూహాత్మక వ్యాపార విభాగంగా పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ (పీఎల్‌ఐ) ఏర్పాటు, ప్రభావాలు, పోస్టల్ విభాగం పరిధిలోనే ప్రభుత్వ రంగ స్పతంత్ర సంస్థగా మార్చడం తదితర అంశాలను అధ్యయనం చేసి, ప్రాజెక్టు రిపోర్ట్ తయారు చేయాల్సి ఉంటుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. దీనిపై ప్రీ-బిడ్ సమావేశం సెప్టెంబర్ 18న జరిగినట్లు వివరించాయి. బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్‌, ప్రైస్‌వాటర్‌హౌస్‌కూపర్స్‌, ఎర్న్‌స్ట్‌ అండ్ యంగ్‌, కేపీఎంజీ, డెలాయిట్ ఇండియా వంటి పేరొందిన కన్సల్టెన్సీ సంస్థలు దీనికి హాజరైనట్లు పేర్కొన్నాయి. రెండేళ్ల కాలంలో పోస్టల్‌ విభాగం ప్రత్యేక బీమా సంస్థ ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు కేంద్ర కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి మనోజ్ సిన్హా ఇటీవలే వెల్లడించారు. ప్రస్తుతం పోస్టల్ విభాగం.. ప్రభుత్వ, సెమీ - గవర్నమెంట్ ఉద్యోగులకు పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ (పీఎల్‌ఐ) కింద జీవిత బీమా పథకాలు అందిస్తోంది. ఈ స్కీమ్స్‌ 1884లో ప్రారంభమయ్యాయి. మరోవైపు, గ్రామీణ ప్రాంతాల్లోని బలహీన వర్గాలు, మహిళలకు బీమా కవరేజీ అందించే ఉద్దేశంతో 1995 మార్చిలో రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్‌ (ఆర్‌పీఎల్‌ఐ) పథకాలను కూడా ప్రవేశపెట్టింది. 2017 మార్చి 31నాటికి మొత్తం 46.8 లక్షల పీఎల్‌ఐ, 1.46 కోట్ల ఆర్‌పీఎల్‌ఐ పాలసీలు ఉన్నాయి. పోస్టల్ విభాగం ఇటీవలే ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్‌ను కూడా ప్రారంభించిన సంగతి తెలిసిందే. ప్రైవేట్ రంగ బీమా సంస్థ బజాజ్ అలయంజ్‌ పాలసీలను విక్రయించేందుకు అయిదేళ్ల పాటు కార్పొరేట్ ఏజంటుగా వ్యవహరించే ఒప్పందం కుదుర్చుకుంది. ముందుగా 3,250 పోస్టాఫీసుల్లో వీటి విక్రయాన్ని ప్రారంభించి.. తర్వాత దేశవ్యాప్తంగా 1.5 లక్షల పోస్టాఫీసులకు విస్తరించనుంది. 



You may be interested

దీర్ఘకాలంలో మంచిదే .. కానీ..

Friday 21st September 2018

ముంబై: బ్యాంక్ ఆఫ్ బరోడా, విజయా బ్యాంక్, దేనా బ్యాంక్‌ల విలీనంతో స్వల్పకాలికంగా మొండిబాకీలు ఎగియడం వంటి సవాళ్లు ఉంటాయని ఇండియా రేటింగ్స్ ఒక నివేదికలో పేర్కొంది. అయితే, దీర్ఘకాలంలో మాత్రం ఈ విలీనంతో ప్రయోజనాలు ఉండగలవని వివరించింది. ప్రతిపాదిత విలీనానికి లాంఛనంగా ఆమోదముద్ర వచ్చిన తర్వాత.. రేటింగ్‌ను మదింపు చేస్తామని ఇండియా రేటింగ్స్ తెలిపింది. దేనా బ్యాంక్‌కు తక్కువ మూలధన నిల్వలు ఉన్నప్పటికీ.. విజయా బ్యాంక్‌ వద్ద అధిక

రూపీ మరింత రివకరీ

Friday 21st September 2018

అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్‌ రూపాయి శుక్రవారం బలపడింది. అమెరికా-చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు పెరగకపోవచ్చనే అంచనాలు, వర్ధమాన కరెన్సీలు లాభాల్లో ఉండటం వంటి అంశాలు సానుకూల ప్రభావం చూపాయి. ఉదయం 9:10 సమయంలో అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి 71.93 వద్ద ట్రేడ్‌ అవుతోంది. తన బుధవారం ముగింపు 72.38తో పోలిస్తే 0.70 శాతంమేర లాభపడింది. ఇక డాలర్‌తో పోలిస్తే రూపాయి శుక్రవారం 71.86 వద్ద ప్రారంభమైంది.  భారత్‌లో పదేళ్ల

Most from this category