STOCKS

News


సంసన్న దేశాల్లో అగ్రగామిగా భారత్‌

Wednesday 31st October 2018
news_main1540971224.png-21607

న్యూఢిల్లీ: తొలి మూడు పారిశ్రామిక విప్లవాల విషయంలో వెనుకబడినప్పటికీ.. టెక్నాలజీని విరివిగా ఉపయోగించే భారీ యువ జనాభా ఊతంతో నాలుగో పారిశ్రామిక విప్లవానికి సారథ్యం వహించే స్థాయిలో భారత్‌ ఉందని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చైర్మన్‌ ముకేశ్‌ అంబానీ చెప్పారు. అత్యంత సంపన్నమైన టాప్‌ 3 దేశాల జాబితాలో ఒకటిగా ఎదిగే దిశగా దూసుకుపోతోందని ఆయన పేర్కొన్నారు. 24వ మొబికామ్‌ సదస్సులో పాల్గొన్న సందర్భంగా అంబానీ ఈ విషయాలు చెప్పారు. దేశీయంగా గతంలో ఎన్నడూ చూడని విధంగా డిజిటల్‌ విప్లవం చోటు చేసుకుంటోందని ఆయన పేర్కొన్నారు. "1990లలో రిలయన్స్‌  చమురు రిఫైనరీ, పెట్రోకెమికల్స్‌ ప్రాజెక్టులను నిర్మిస్తున్నప్పుడు దేశ జీడీపీ 350 బిలియన్‌ డాలర్లుగా ఉండేది. ఇప్పుడు ఇది 3 ట్రిలియన్‌ డాలర్లకు చేరువగా ఉంది. భారత్‌ ఈ స్థాయికి చేరుకోగలదని ఊహించినవారు చాలా తక్కువ మందే ఉంటారు. ప్రస్తుతం టాప్‌ 3 సంపన్న దేశాల్లో ఒకటిగా ఎదిగే క్రమంలో ముందుకు దూసుకుపోతోంది" అని అంబానీ చెప్పారు.     మొబైల్‌ కంప్యూటింగ్‌ ఊతంతో భారీ స్థాయిలో డేటా వినియోగం జరుగుతోందని, యువ భారతీయులు వినూత్న ఐడియాలు ఆవిష్కరించేందుకు తోడ్పడుతోందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం అత్యధిక టెక్నాలజీ ఆధారిత స్టార్టప్స్‌ కేంద్రంగా భారత్‌ మూడో స్థానంలో ఉందని తెలిపారు. వచ్చే రెండు దశాబ్దాల కాలంలో ప్రపంచానికి భారత్‌ సారథ్యం వహించగలదని, తదుపరి తరం ప్రపంచ ఆర్థిక వృద్ధికి తోడ్పాటు అందించగలదని అంబానీ ధీమా వ్యక్తం చేశారు.



You may be interested

1న వ్యవస్థలోకి రూ.12వేల కోట్లు

Wednesday 31st October 2018

ముంబై: దీపావళి నేపథ్యంలో వ్యవస్థలో ద్రవ్య లభ్యత (లిక్విడిటీ) పెంచాలని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా నవంబర్‌1వ తేదీన ప్రభుత్వ బాండ్ల కొనుగోలు ద్వారా బ్యాంకింగ్‌ వ్యవస్థలోకి రూ.12,000 కోట్లు విడుదల చేయనుంది.  పండుగల సీజన్‌ ఫండ్స్‌ డిమాండ్స్‌ను ఎదుర్కొనడానికి నవంబర్‌ నెలలో మొత్తం రూ.40,000 కోట్లను బ్యాంకింగ్‌ వ్యవస్థలోకి విడుదల చేయనున్నట్లు గత వారం ఆర్‌బీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే.

అడ్డగోలు రుణాల పాపం ఆర్‌బీఐదే

Wednesday 31st October 2018

 కట్టడి చేయడంలో విఫలమైంది - అందుకే మొండిబాకీలు పెరిగిపోయాయి - రిజర్వ్‌ బ్యాంక్‌పై జైట్లీ విమర్శలు ముంబై: రిజర్వ్‌ బ్యాంక్, కేంద్ర ప్రభుత్వం మధ్య విభేదాలు ముదురుతున్నాయి. ఆర్‌బీఐ  స్వయం ప్రతిపత్తిని కాపాడకపోతే పెను విపత్తు తప్పదంటూ రిజర్వ్‌ బ్యాంక్‌ డెప్యూటీ గవర్నర్‌ విరాల్‌ అచార్య వ్యాఖ్యానించిన నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ ఘాటుగా స్పందించారు. 2008 - 2014 మధ్య కాలంలో బ్యాంకులు విచక్షణారహితంగా రుణాలిచ్చేస్తుంటే కట్టడి చేయకుండా సెంట్రల్‌

Most from this category