STOCKS

News


ప్రైవేట్ పెట్టుబడులకు తోడ్పాటునివ్వాలి

Saturday 16th February 2019
news_main1550314040.png-24227

  • విధానపరమైన చర్యలు, పన్నుపరమైన ప్రయోజనాలు ఉండాలి
  • అప్పుడే అధిక వృద్ధి సాధ్యం
  • కోటక్ మహీంద్రా బ్యాంక్ ఎండీ ఉదయ్ కోటక్‌

ముంబై: వృద్ధి రేటును మరింత మెరుగుపర్చుకోవాలనుకుంటే ప్రైవేట్ పెట్టుబడులకు ఉతమిచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని కోటక్ మహీంద్రా బ్యాంక్‌ ఎండీ ఉదయ్ కోటక్ అభిప్రాయపడ్డారు. ఇందుకోసం విధానపరమైన చర్యలు లేదా పన్నుపరమైన ప్రయోజనాలను పరిశీలించవచ్చని ఆయన చెప్పారు. తద్వారా 7 శాతం వృద్ధి దగ్గరే చిక్కుబడిపోకుండా మరింత మెరుగ్గా రాణించేందుకు అవకాశాలు ఉంటాయన్నారు. ఏప్రిల్‌-సెప్టెంబర్ మధ్యకాలంలో వృద్ధి అంచనాలను రిజర్వ్ బ్యాంక్‌ 7.2-7.4 శాతానికి పరిమితం చేసిన నేపథ్యంలో కోటక్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో స్థూల దేశీయోత్పత్తి వృద్ధి 7.1 శాతం మాత‍్రమే నమోదైంది. 2016 నవంబర్‌లో అకస్మాత్తుగా పెద్ద నోట్లను రద్దు చేయడం, ఆ తర్వాత ఆరు నెలలకు వస్తు, సేవల పన్నుల విధానం అమల్లోకి తేవడం వంటి అంశాలు వ్యాపారాలను దెబ్బతీశాయన్న విమర్శలు ఉన్నాయి. మరోవైపు, వ్యవస్థలో ద్రవ్యకొరత కారణంగా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగ కార్యకలాపాలు దాదాపు స్తంభించిపోయిన నేపథ్యంలో ద్రవ్య లభ్యత మెరుగుపర్చేందుకు కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సి ఉందని ఉదయ్ కోటక్ చెప్పారు. ఇన్‌ఫ్రా రుణాల సంస్థ ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ సంక్షోభం కారణంగా ప్రస్తుతం పరిస్థితులు మరింత దిగజారాయని.. అయితే ఈ సమస్య వ్యవస్థాగతమైనది కాదని, ఇన్వెస్టర్లు తీవ్ర భయాందోళనలకు గురికావడమే దీనికి కారణమని ఆయన విశ్లేషించారు. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన ఐఎల్‌౾అండ్‌ఎఫ్ఎస్ దెబ్బకి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలకు నిధుల లభ్యత దాదాపు నిల్చిపోయింది. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ సమస్య పరిష్కారానికి ఉదయ్ కోటక్ సారథ్యంలో ప్రభుత్వం కొత్త బోర్డును నియమించింది.You may be interested

ఆభరణాల మార్కెట్‌లో రెట్టింపు వాటా

Saturday 16th February 2019

3-4 ఏళ్లలో టైటాన్ లక్ష్యం 2018-19లో కొత్తగా 40 తనిష్క్ స్టోర్స్ ప్రారంభం వివాహ, వజ్రాభరణాలపై ఎక్కువ దృష్టి బెంగళూరు: వచ్చే మూడు, నాలుగేళ్లలో ఆభరణాల మార్కెట్లో వాటాను రెట్టింపు స్థాయికి పెంచుకోవాలని టైటాన్ సంస్థ నిర్దేశించుకుంది. ఈ విభాగంలో కంపెనీ మార్కెట్ వాటా ప్రస్తుతం 5 శాతంగా ఉంది. తాజా లక్ష్యాన్ని చేరుకునేందుకు వెడ్డింగ్ విభాగం, అధిక విలువ వజ్రాభరణాలు, గోల్డెన్ హార్వెస్ట్ కొనుగోలు స్కీమ్‌, కస్టమర్లకు ఎక్స్చేంజ్ ప్రోగ్రాం తోడ్పడగలవని కొత్త

భారత్‌ బయోటెక్‌ చేతికి చిరోన్‌ బెహరింగ్‌ వ్యాక్సిన్స్‌

Saturday 16th February 2019

భారత్‌ బయోటెక్‌ చేతికి చిరోన్‌ బెహరింగ్‌ వ్యాక్సిన్స్‌ రేబిస్‌ వ్యాక్సిన్లలో కంపెనీ స్థానం మరింత బలోపేతం హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: హైదరాబాద్‌కు చెందిన వ్యాక్సిన్‌ తయారీ కంపెనీ భారత్‌ బయోటెక్‌.. యూకేకు చెందిన గ్లాక్సోస్మిత్‌క్లిన్‌ (జీఎస్‌కే) ఏషియాకు చెందిన చిరోన్‌ బెహరింగ్‌ వ్యాక్సిన్స్‌ను కొనుగోలు చేయనుంది.  పూర్తిగా నగదు రూపంలో 100 శాతం వాటాను దక్కించుకోనుంది. ఇందుకు సంబంధించిన ఒప్పందంపై శుక్రవారం ఇక్కడ ఒప్పందం జరిగింది. డీల్‌ విలువ ఎంతనేది మాత్రం స్పష్టం

Most from this category