STOCKS

News


చైనా స్టీల్‌పై యాంటీ డంపింగ్‌ సుంకం

Monday 10th September 2018
news_main1536557014.png-20117

న్యూఢిల్లీ: చైనా నుంచి చౌకగా వచ్చి పడుతున్న స్టీల్‌ ఉత్పత్తుల నుంచి దేశీయ కంపెనీలను కాపాడేందుకు కేంద్రం యాంటీ డంపింగ్‌ సుంకం విధించే అవకాశాలు ఉన్నాయి. కొన్ని రకాల చైనా స్టీల్‌పై ఒక్కోటన్నుకు 185.51 డాలర్ల వరకు ఈ యాంటీ డంపింగ్‌ సుంకాన్ని ఐదేళ్ల పాటు విధించనుంది. జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, సన్‌ఫ్లాగ్‌ ఐరన్‌ అండ్‌ స్టీల్‌, ఉషా మార్టిన్‌, గెర్డావ్‌ స్టీల్‌ ఇండియా, వర్ధమాన్‌ స్పెషల్‌ స్టీల్స్‌, జయస్వాల్‌ నెకో ఇండస్ట్రీస్‌ సంయుక్తంగా యాంటీ డంపింగ్‌ సుంకం విధించాలని కోరుతూ పిటిషన్‌ వేశాయి. చైనా దిగుమతులపై విచారణ జరపాలని కూడా కోరాయి. దీంతో డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ ట్రేడ్‌ రెమిడీస్‌ (డీజీటీఆర్‌) 2016-17 కాలానికి సంబంధించి విచారణ నిర్వహించగా, స్ట్రయిట్‌లెంత్‌ బార్స్‌, అలాయ్‌ స్టీల్‌ రాడ్స్‌ దిగుమతులు పెరిగినట్టు తేలింది. ఈ దిగుమతుల కారణంగా దేశీయ ఉత్పత్తుల ధరలు తగ్గడం, ఇక్కడి కంపెనీల లాభాలు క్షీణించినట్టు గుర్తించింది. దీంతో చైనా స్టీల్‌ దిగుమతులపై ఐదేళ్ల పాటు యాంటీ డంపింగ్‌ సుంకం విధించాలని డీజీటీఆర్‌ కేంద్రానికి సిఫారసు చేసింది. ఒక్కో టన్నుపై 44.89-185.51 డాలర్ల మధ్య సుంకాన్ని విధించాలంటూ ప్రతిపాదించింది. 



You may be interested

జెనెసిస్‌ కలర్స్‌లో రిలయన్స్‌ రిటైల్‌ పెట్టుబడులు

Monday 10th September 2018

న్యూఢిల్లీ: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అనుబంధ రిలయన్స్‌ రిటైల్‌ వెంచర్స్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఆర్‌వీఎల్‌) తన వ్యాపార ప్రయోజనాలను విస్తృతం చేసే క్రమంలో పలు  కంపెనీల్లో పెట్టుబడుల ద్వారా వాటాలు సొంతం చేసుకుంది. రెడీమేడ్‌ వస్త్రాల రిటైల్‌, హోల్‌సేల్‌ కంపెనీ జెనెసిస్‌ కలర్స్‌ లిమిటెడ్‌ (జీసీఎల్‌)లో 16.31 శాతం వాటాను కొనుగోలు చేసింది. ఈ వాటాల కోసం రూ.34.80 కోట్లు ఖర్చు చేసింది. జెనెసిస్‌ కలర్స్‌లో రిలయన్స్‌ రిటైల్‌ వెంచర్స్‌ లిమిటెడ్‌ అనుబంధ

వాణిజ్య యుద్ధం, రూపాయి కదలికలపై దృష్టి

Monday 10th September 2018

స్థూల గణాంకాల వెల్లడి ఈ వారంలో సూచీల దిశానిర్థేశం చేయనున్నట్లు మార్కెట్‌ పండితులు భావిస్తున్నారు. పారిశ్రామికోత్పత్తి, ద్రవ్యోల్బణ గణాంకాల వెల్లడి, అమెరికా-చైనా దేశాల మధ్య కొనసాగుతున్న వాణిజ్య యుద్ధ పరిణామాలు సూచీలకు కీలకంకానున్నాయని డెల్టా గ్లోబల్‌ పాట్నర్స్‌ ప్రిన్సిపల్‌ పాట్నర్‌ దేవేంద్ర నెవ్గి వివరించారు. ఈ సమాచారం ఆధారంగానే అక్టోబరులో సమావేశంకానున్న ఆర్‌బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) పాలసీ సమీక్షను వెల్లడించనుందన్నారు. వడ్డీ రేట్ల ప్రకటనకు కీలకంగా

Most from this category