STOCKS

News


భారత డిఫెన్స్‌లో చెక్‌ రిపబ్లిక్‌ పెట్టుబడులు..!

Saturday 8th September 2018
news_main1536380943.png-20077

ప్రాగ్యూ: భారత రక్షణ తయారీ రంగంలో చెక్‌ రిపబ్లిక్‌ భారీ జాయింట్‌ వెంచర్ల ఏర్పాటుకు అవకాశం ఉందని రాష్ట్రపతి రామ్‌ నాథ్‌ కోవింద్‌ చెప్పారు. మూడు రోజుల యూరప్‌ పర్యటన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. భారత డిఫెన్స్‌లో చెక్‌ రిపబ్లిక్‌ పెట్టుబడులు పెట్టేందుకు సుముఖంగా ఉందని వెల్లడించారు. ‘అధునాతన టెక్నాలజీ అందించడం, రక్షణ రంగ తయారీని బలపరిచడం వంటి అంశాలలో భారత్‌తో కలిసి పనిచేసేందుకు ఆదేశం ఆసక్తి చూపుతోంది. భవిష్యత్‌ తరానికి అవసరమైన డిఫెన్స్‌ అవసరాలను చెక్‌ రిపబ్లిక్‌ అందించనుంది. మరోవైపు యూరోపియన్‌ ఆటో దిగ్గజ కంపెనీలైన స్కోడా, ఫోక్స్‌వ్యాగన్‌లు మేక్‌ ఇన్‌ ఇండియాలో భాగంగా ఒక బిలియన్‌ (రూ.7,187 కోట్లు) పెట్టుబడులను ప్రకటించాయి.’ అని రాష్ట్రపతి వ్యాఖ్యానించారు. పెట్టుబడుల ప్రోత్సాహం, టెక్నాలజీ భాగస్వామ్యం, వాణిజ్య బలోపేతాని ఈ పర్యటన వల్ల మరింత బలం చేకూరిందని చెక్‌ రిపబ్లిక్‌ రాష్ట్రపతి మిలోస్ జెమాన్ అన్నారు. ఈ సందర్భంగా సైన్స్‌ టెక్నాలజీ, వీసా మినహాయింపు వంటి ఐదు అవగాహన ఒప్పందాలపై సంతకాలు ఇరు దేశాలు సంతకాలు చేశాయి.



You may be interested

2022 నాటికి రూ.7,00,000 కోట్లు

Saturday 8th September 2018

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: భారత్‌లో ఈ-కామర్స్‌ వ్యాపారం 2022 నాటికి రూ.7,00,000 కోట్లకు చేరుతుందని నాస్కాం-పీడబ్ల్యుసీ నివేదిక చెబుతోంది. ‘ప్రపంచ నాయకత్వం దిశగా భారత ఈ-కామర్స్‌’ పేరుతో రూపొందించిన ఈ నివేదిక ప్రకారం... ‘‘ప్రస్తుతం దేశంలో ఈ-కామర్స్‌ మార్కెట్‌ పరిమాణం రూ.2,45,000 కోట్లు. వచ్చే అయిదేళ్లు పరిశ్రమ ఏటా 25 శాతం వృద్ధి చెందుతుంది. ఈ-టైల్‌, ఈ-ట్రావెల్‌ వాటా 90 శాతం పైగా ఉంటుంది. ఆన్‌లైన్‌ ఫైనాన్సియల్‌ సర్వీసులు వేగంగా

వచ్చే నెల నుంచి సుజుకీ ఈవీ పరీక్షలు

Saturday 8th September 2018

2020లో తొలి ఎలక్ట్రిక్‌ వాహనం విడుదల భారత్‌లో ఎలక్ట్రిక్‌ వాహనాల విడుదలపై జపాన్‌కు చెందిన సుజుకీ మోటార్‌ కార్పొరేషన్‌ తన ప్రణాళికలను ‘మూవ్‌’ సదస్సు సందర్భంగా ప్రకటించింది. వచ్చే నెల నుంచి భారత్‌లో ఎలక్ట్రిక్‌ వాహనాలకు రహదారి పరీక్షలు నిర్వహించనున్నట్టు సుజుకి మోటార్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ ఒసాము సుజుకి తెలిపారు. భద్రత, ఇక్కడి వాతావరణం, రద్దీ పరిస్థితులకు అనుగుణంగా సులభంగా వినియోగించుకునేలా ఎలక్ట్రిక్‌ వాహనాలను తయారు చేయడం కోసమే ఈ

Most from this category