News


ముంబైలో మోషన్‌ క్యాప్చర్‌ ల్యాబ్‌

Saturday 17th November 2018
news_main1542432145.png-22115

ముంబై: ఫేమస్‌ స్టూడియోస్‌, బ్రిటన్‌కు చెందిన సెంట్రాయిడ్‌తో కలసి ముంబైలోని మహాలక్ష్మి ప్రాంతంలో గల తన స్టూడియోలో దేశంలోనే తొలి మోషన్‌ క్యాప్చర్‌ ల్యాబ్‌ను ఏర్పాటు చేసింది. ఇది దేశంలోనే తొలి ఎండ్‌ టు ఎండ్‌ మోషన్‌ క్యాప్చర్‌ ల్యాబ్‌ అని కంపెనీ ప్రకటించింది. సినిమా నిర్మాణం, యానిమేషన్‌, గేమింగ్‌కు ఇది అత్యాధునిక టెక్నాలజీలతో కూడిన సేవలను అందించనుంది. షూటింగ్‌ నుంచి పోస్ట్‌ ప్రొడక్షన్‌ వరకు నటీ, నటులకు సహకారం అందిస్తుందని సంస్థ తెలిపింది. 
 

 

 



You may be interested

కొత్త ఫార్మా మార్కెట్‌... చైనా!

Saturday 17th November 2018

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: ఔషధ రంగంలో కీలక ముడి పదార్థాల కోసం చైనా మార్కెట్‌పై ఆధారపడుతున్న భారత కంపెనీలు... దాన్ని ఎగుమతి మార్కెట్‌గానూ చూస్తున్నాయి. అమెరికాలో అవకాశాలు తగ్గుతున్న నేపథ్యంలో... భారత ఫార్మా కంపెనీలకు కొత్త ఎగుమతుల మార్కెట్‌గా చైనా అవతరిస్తోంది. ఇటీవలి ఇరు దేశాధినేతల సమావేశం దీనికి మరింత ఊతమిచ్చినట్లు ఫార్మా సంస్థలు భావిస్తున్నాయి. చైనాలో నెలకొన్న ప్రస్తుత వాతావరణాన్ని వ్యాపార అవకాశంగా మలిచేందుకు ఫార్మాస్యూటికల్స్‌ ఎక్స్‌పోర్ట్‌ ప్రమోషన్‌

డీఎస్‌పీ నుంచి హెల్త్‌కేర్‌ ఫండ్‌

Saturday 17th November 2018

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థ డీఎస్‌పీ బ్లాక్‌రాక్‌ తాజాగా హెల్త్‌కేర్‌కి సంబంధించి కొత్త ఫండ్‌ ఆఫర్‌ను ఆరంభించింది.  నవంబర్‌ 12న ప్రారంభమైన ఈ ఫండ్‌ ఆఫర్‌ వ్యవధి నవంబర్‌ 26 దాకా ఉంటుంది. ఈ ఫండ్‌ సుమారు రూ.500 కోట్ల దాకా పెట్టుబడులు (ఏయూఎం) సమీకరించే అవకాశం ఉందని ఫండ్‌ మేనేజర్‌ ఆదిత్య ఖేమ్కా శుక్రవారమిక్కడ విలేకరులకు తెలిపారు. ఈ ఫండ్‌ సుమారు 20–25 హెల్త్‌కేర్, ఫార్మా

Most from this category