STOCKS

News


జాగ్వార్‌ దేశీ ఎఫ్‌-పేస్‌

Tuesday 30th October 2018
Markets_main1540878246.png-21576

  • ధర రూ.63.17 లక్షలు

న్యూఢిల్లీ: టాటా మోటార్స్ అనుబంధ సంస్థ జాగ్వార్ అండ్ ల్యాండ్ రోవ‌ర్ (జేఎల్‌ఆర్‌)... మేకిన్‌ ఇండియా పాలసీలో భాగంగా దేశీయంగా ఉత్పత్తి చేసిన జాగ్వార్ ‘ఎఫ్‌–పేస్‌’ ఎస్‌యూవీని సోమవారం మార్కెట్‌లో ప్రవేశపెట్టింది. రెండు-లీటర్ల టర్బో చార్జ్ ఇంజినియం పెట్రోల్ ఇంజిన్‌ను కలిగిన ఈ కారు ధర రూ.63.17 లక్షలు. పార్క్ అసిస్ట్, లేన్ కీప్‌ అసిస్ట్, కాబిన్ ఎయిర్ ఐయోనైజేషన్, డ్రైవర్ కండీషన్‌ మానిటరింగ్‌ వంటి అధునాతన ఫీచర్లు ఈ కారులో ఉన్నట్లు కంపెనీ తెలియజేసింది. తాజా ఎస్‌యూవీ విడుదల ద్వారా భారత మార్కెట్‌లో జాగ్వార్‌ మరింత మెరుగుపడిందని సంస్థ ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ రోహిత్‌ సూరి వ్యాఖ్యానించారు. ఇక దేశవ్యాప్తంగా 27 అవుట్‌లెట్ల ద్వారా ఎక్స్‌ఈ, ఎక్స్‌ఎఫ్‌, ఎఫ్‌-పేస్‌, ఎక్స్‌జే, ఎఫ్‌-టైప్‌ రేంజ్‌ జాగ్వార్లను సంస్థ విక్రయిస్తోంది.



You may be interested

ఇన్వెస్ట్‌మెంట్‌ మనోళ్లకు మహా ఇష్టం

Tuesday 30th October 2018

- ఆసియాలో అధిక చైతన్యం భారత్‌లోనే - వెల్లడించిన స్టాండర్డ్‌ చార్టర్డ్‌ అధ్యయనం - దీర్ఘకాలిక లక్ష్యాల కోసం పొదుపు బాట - పిల్లల చదువులే మొదటి ప్రాధాన్యం - సామాజిక చైనత్యం కూడా ఎక్కువే ఆసియాలో పెట్టుబడుల విషయంలో అధిక చైతన్యం కలిగింది భారత దేశమేనని ‘స్టాండర్డ్‌ చార్టర్డ్‌’ సంస్థ నిర్వహించిన అధ్యయనం తేల్చింది. ఎమర్జింగ్‌ అఫ్లూయంట్‌ స్డడీ 2018’ పేరుతో ఈ సంస్థ ఆసియా, ఆఫ్రికా, మిడిల్‌ఈస్ట్‌ ప్రాంతాల్లో సంపన్న వినియోగదారులు 11,000 మంది

ఎయిర్‌ ఇండియాపై ఎతిహాద్‌ ఆసక్తి

Tuesday 30th October 2018

ఎయిర్‌ ఇండియాపై ఎతిహాద్‌ ఆసక్తి భారత్‌లో భాగస్వాముల కోసం అన్వేషణ అనిల్‌ అంబానీ గ్రూపుతో చర్చలు న్యూఢిల్లీ: గల్ఫ్‌కు చెందిన అతిపెద్ద విమానయాన సంస్థ ఎతిహాద్‌, భారత్‌కు చెందిన ఎయిర్‌ ఇండియా పట్ల ఆసక్తి కనబరుస్తోంది. భారత్‌లో ప్రముఖ కార్పొరేట్‌ గ్రూపు భాగస్వామ్యంతో ఎయిర్‌ ఇండియాలో 76 శాతం వాటా కొనుగోలు చేయాలన్నది ఎతిహాద్‌ ఆలోచన. ఇందుకు సంబంధించి అనిల్‌ అంబానీ గ్రూపునకు ప్రతిపాదన పంపినట్టు తెలియవచ్చింది. ఎయిర్‌ ఇండియాలో 76 శాతం వాటాల

Most from this category