STOCKS

News


డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ ఎలాంటి డొల్ల కంపెనీలను సృష్టించలేదు

Thursday 7th March 2019
news_main1551939301.png-24468

  • క్లీన్‌ చిట్‌ ఇచ్చిన స్వతంత్ర చార్టర్డ్‌ అకౌంట్‌ సంస్థ 

ముంబై: దివాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ (డీహెచ్‌ఎఫ్‌ఎల్‌) కంపెనీ నిధుల మళ్లింపు కోసం ఎలాంటి డొల్ల కంపెనీలను ఏర్పాటు చేయలేదని స్వతంత్ర చార్టర్డ్‌అకౌంట్‌ సంస్థ దర్యాప్తులో తేలింది. అయితే రుణాలు మంజూరు చేయడంలో మాత్రం నిబంధనల ప్రకారం వ్యవహరించలేకపోయిందంటూ ఈ సంస్థ తేల్చిందని డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ స్టాక్‌ ఎక్స్చేంజ్‌లకు నివేదించింది. 


డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ ప్రమోటర్లు డొల్ల కంపెనీల ద్వారా రూ.31,000 కోట్ల మేర నిధులను మళ్లించారంటూ ఈ ఏడాది జనవరిలో ఆన్‌లైన్‌ న్యూస్‌ పోర్టల్‌ కోబ్రాపోస్ట్‌ వెల్లడించిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన నిజానిజాలను నిగ్గు తేల్చడానికి స్వతంత్ర సీఏ సంస్థ, టి.పి. ఓస్వాల్‌ అండ్‌ అసోసియేట్స్‌ ఎల్‌ఎల్‌పీ ను డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ నియమించింది. 

నిధులను మళ్లించడానికి డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ డొల్ల కంపెనీలను సృష్టించిందనడానికి ఎలాంటి ఆధారాలు లేవని ఈ ఆడిట్‌లో తేలిందని డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ పేర్కొంది. అలాగే రుణాల మంజూరు విషయంలో రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయనడానికి కూడా ఎలాంటి ఆధారాలు లేవని సదరు సంస్థ పేర్కొందని డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ వెల్లడించింది. 



You may be interested

స్టార్టప్‌ల పన్ను మినహాయింపుపై సీబీడీటీ నోటిఫికేషన్‌

Thursday 7th March 2019

స్టార్టప్‌ల పన్ను మినహాయింపుపై సీబీడీటీ నోటిఫికేషన్‌ న్యూఢిల్లీ: స్టార్టప్‌ల్లో పెట్టే రూ.25 కోట్ల పెట్టుబడులకు ఏంజెల్‌ ట్యాక్స్‌ మినహాయింపునకు సంబంధించి సవరించిన నిబంధనలను కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి నోటిఫై చేసింది. స్టార్టప్‌లకు సంబంధించి సవరించిన నిబంధనలను పారిశ్రామిక ప్రోత్సాహక, అంతర్గత వాణిజ్య విభాగం (డీపీఐఐటీ) ఫిబ్రవరి 19 నుంచి అమల్లోకి తెచ్చినట్టు పేర్కొంది. ఏంజెల్‌ ట్యాక్స్‌ మినహాయింపును పెంచాలని స్టార్టప్‌లు ఎప్పటి నుంచో డిమాండ్‌ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రూ.25

పనీపాటా లేని కుర్రకారు ఇక్కడే ఎక్కువ

Thursday 7th March 2019

- భారత్‌పై ఐఎమ్‌ఎఫ్‌ సీనియర్‌ ఆర్థిక వేత్త వ్యాఖ్య న్యూఢిల్లీ: యువత ఎలాంటి పనీ లేకుండా ఖాళీగా ఉండటం భారత్‌లోనే అధికమని ఐఎమ్‌ఎఫ్‌ సీనియర్‌ ఆర్థిక వేత్త జాన్‌ బ్లూడోర్న్‌ పేర్కొన్నారు. అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాలతో పోలిస్తే భారత్‌లోనే అధిక యువ జనం పనీపాటా లేకుండా ఉంటారని, ఏ పనీ లేకుండా ఖాళీగా ఉండే వారి సంఖ్య ఇక్కడ 30 శాతంగా ఉందని వివరించారు. బ్రూకింగ్స్‌ ఇండియా నిర్వహించిన సదస్సులో

Most from this category