News


స్టెర్లింగ్ బయోటెక్ కేసులో బ్యాంకులకు చుక్కెదురు

Saturday 11th May 2019
news_main1557555496.png-25678

  • సంస్థ విక్రయానికి ఎన్‌సీఎల్‌టీ ఆదేశాలు-

ముంబై: భారీగా రుణాలు బాకీపడిన స్టెర్లింగ్ బయోటెక్ కేసులో బ్యాంకులకు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ)లో చుక్కెదురైంది. పరారీలో ఉన్న ప్రమోటర్లు సందేసరా సోదరులతో వన్‌ టైమ్ సెటిల్మెంట్‌కు, సంస్థ దివాలా ప్రక్రియను ఉపసంహరించేందుకు అనుమతించాలని ఆంధ్రాబ్యాంకు సారథ్యంలోని బ్యాంకులు వేసిన విజ్ఞప్తిని ఎన్‌సీఎల్‌టీ తిరస్కరించింది. స్టెర్లింగ్ బయోటెక్ విక్రయానికి ఆదేశించింది. గడువులోగా పరిష్కార ప్రణాళిక రాకపోవడంతో తమ ముందు మరో మార్గం లేకుండా పోయిందని న్యాయమూర్తులు వీపీ సింగ్‌, రవికుమార్ దొరైసామీలతో కూడుకున్న ఎన్‌సీఎల్‌టీ బెంచ్‌ పేర్కొంది. వన్‌ టైమ్ సెటిల్మెంట్‌ కోసం ప్రమోటర్లు జమ చేసిన నిధులను.. దరఖాస్తుదారుకు విడుదల చేయరాదంటూ సూచించింది. స్టెర్లింగ్ బయోటెక్ సంస్థ రూ. 7,500 కోట్ల దాకా బాకీ పడగా వన్‌ టైమ్ సెటిల్మెంట్ కింద రూ. 3,945 కోట్లు చెల్లిస్తామంటూ ప్రమోటర్లు సందేసరా సోదరులు ఆఫర్‌ చేశారు. ఈ ప్రతిపాదనను బ్యాంకులు ఆమోదించాయి. అయితే, డిఫాల్ట్‌లతో పాటు ప్రమోటర్లపై మోసం ఆరోపణలు కూడా ఉండటంతో సీబీఐ, ఈడీ వంటి ఏజెన్సీలు దర్యాప్తు చేస్తున్నాయి. సుమారు రూ. 4,700 కోట్ల విలువ చేసే అసెట్స్‌ను అటాచ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. స్టెర్లింగ్ గ్రూప్ మొత్తం మీద రూ. 15,600 కోట్లు బాకీపడింది. ఇందులో స్టెర్లింగ్ బయోటెక్ రుణాలు రూ. 7500 కోట్లు కాగా స్టెర్లింగ్ ఎస్‌ఈజెడ్‌ రూ. 8,100 కోట్లు బాకీపడ్డాయి. 



You may be interested

సింగపూర్‌ సంస్థతో థామస్‌ కుక్ ఒప్పందం

Saturday 11th May 2019

న్యూఢిల్లీ: సింగపూర్‌కు చెందిన సెంటోసా డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌తో మూడేళ్ల వ్యూహాత్మక ఒప్పందం కుదుర్చుకున్నట్లు ట్రావెల్ సేవల సంస్థ థామస్ కుక్ తెలిపింది. మరింత మంది భారతీయ పర్యాటకులను సింగపూర్‌ సందర్శనకు తీసుకెళ్లేందుకు ఇది తోడ్పడుతుందని పేర్కొంది. మరోవైపు, డెస్టినేషన్ వెడ్డింగ్‌ విభాగంలో కూడా ప్రవేశించనున్నట్లు సంస్థ వెల్లడించింది. మరికొద్ది నెలల్లో ఈ విభాగాన్ని ప్రారంభించనున్నట్లు, ఇందుకోసం ప్రత్యేక టీమ్‌ను ఏర్పాటు చేసినట్లు థామస్‌ కుక్ ఇండియా సీఈవో మహేష్ అయ్యర్‌

చిక్కుల్లో టాటాస్టీల్‌-థిస్సెంక్రప్‌ విలీనం

Saturday 11th May 2019

ఈసీ ఆమోదం కష్టమేనన్న టాటాస్టీల్‌ ముంబై: టాటా స్టీల్‌ తన యూరోప్‌ కార్యకలాపాలను థిస్సెంక్రప్‌తో విలీనం చేయాలన్న ప్రతిపాదన చిక్కుల్లో పడినట్టు కంపెనీ శుక్రవారం ప్రకటించింది. యూరోపియన్‌ కమిషన్‌ ఆందోళనలను తగ్గించే విధంగా ప్యాకేజీపై మళ్లీ కృషి చేసే పరిస్థితి లేదని పేర్కొంది. నష్టాల్లో ఉన్న కోరస్‌ కార్యకలాపాలను టాటా స్టీల్‌, జర్మనీకి చెందిన థిస్సెంక్రప్‌తో విలీనం చేసి చెరిసగం వాటాలతో జాయింట్‌ వెంచర్‌ ఏర్పాటుకు గతేడాది ఒప్పందం చేసుకున్నాయి. ఇందుకు

Most from this category