STOCKS

News


భారత్‌ వృద్ధి బాట పటిష్టం!

Friday 10th August 2018
news_main1533897361.png-19139

న్యూయార్క్‌: భారత్‌ వృద్ధి తీరు పటిష్టంగా ఉందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) పేర్కొంది. 2018-2019లో వృద్ధి 7.3 శాతమని అంచనావేయగా, 2019-2020 ఈ రేటు 7.5 శాతంగా విశ్లేషించింది. పెట్టుబడులు స్థిరరీతిన పెరుగుతుండడం, ప్రైవేటు వినియోగంలో వృద్ధి దీనికి కారణమని ఐఎంఎఫ్‌ తన తాజా నివేదికలో అంచనా వేసింది. నివేదికలో ముఖ్యాంశాలను చూస్తే...

♦ సమీప భవిష్యత్‌తో భారత్‌ స్థూల ఆర్థిక పరిస్థితుల అవుట్‌లుక్‌ బాగుంది. 
♦ ద్రవ్యోల్బణం 2018-19లో 5.2 శాతంగా ఉంటుంది. డిమాండ్‌ పరిస్థితులు పటిష్టంగా ఉండడం, రూపాయి విలువ క్షీణత, చమురు ధరలు, హౌసింగ్‌ రెంట్‌ అలెవెన్స్‌ల పెరుగుదల, వ్యవసాయ ఉత్పత్తుల కనీస మద్దతు ధరల పెంపు దీనికి కారణం. 
♦ 2018-19కి సంబంధించి స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో కరెంట్‌ అకౌంట్‌ లోటు 2.6 శాతంగా ఉంటుంది. చమురు ధరల పెరుగుదల, దిగుమతులకు డిమాండ్‌ దీనికి కారణం. 
♦ భారత్‌ ఫైనాన్షియల్‌ రంగంలో సంస్కరణలు కొనసాగుతున్నాయి. ద్రవ్యలోటు, కరెంట్‌ అకౌంట్‌ లోటు కట్టడికి తగిన చర్యలు ఉన్నాయి. బ్యాంకింగ్‌ రుణ వృద్ధి మెరుగుపడుతోంది. బ్యాంకింగ్‌ మొండిబకాయిల సమస్య పరిష్కార దిశలో చర్యలు ఉన్నాయి. 
♦ రానున్న కొద్ది దశాబ్దాల్లో అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో భారత్‌ కీలకపాత్ర పోషించనుందని ఐఎంఎఫ్‌ మిషన్‌ చీఫ్‌ (ఇండియా) రానిల్‌ సెల్‌గాడో పేర్కొన్నారు. ఈ విషయంలో గత చైనా పాత్రను ఇకపై భారత్‌ పోషించే వీలుందని అన్నారు. 
♦ 2016 ద్వితీయార్ధంలో డీమోనిటైజేషన్‌, ఆ తర్వాత జీఎస్‌టీ అమలుపరమైన షాక్‌ల నుంచి భారత ఎకానమీ కోలుకుంటోంది. మెరుగైన స్థూలఆర్థిక విధానాలు, ఇటీవలి కాలంలో అమలు చేసిన కొన్ని కీలక సంస్కరణల ఊతంతో భారత్‌ ప్రయోజనం పొందుతోంది
♦ ఇటీవలి రేట్ల పెంపు సరైనదే. రాబోయే రోజుల్లోనూ పాలసీని క్రమంగా కఠినతరం చేయాల్సిన అవసరం ఉంది. 



You may be interested

అపరాధ భావన తొలిచేస్తోంది..

Friday 10th August 2018

ముంబై: షేరు పతనం కారణంగా ఇన్వెస్టర్లకు భారీ నష్టాలు చవిచూడాల్సి వస్తుండటంపై జెట్‌ ఎయిర్‌వేస్ వ్యవస్థాపక చైర్మన్ నరేష్ గోయల్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితి తనకు 'సంకటంగా మారిందని, అపరాధ భావన' కలిగిస్తోందని  ఆయన వ్యాఖ్యానించారు. కంపెనీ వార్షిక సర్వ సభ్య సమావేశంలో షేర్‌హోల్డర్లను ఉద్దేశించి ప్రసంగించిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. "చాలా మంది షేర్‌హోల్డర్లు నష్టపోయారు. ఏదో అపరాధం చేసిన భావన తొలిచేస్తోంది.

పేటీఎం చేతికి 'బ్యాలెన్స్ టెక్నాలజీ'

Friday 10th August 2018

న్యూఢిల్లీ: డిజిటల్ పేమెంట్స్ సంస్థ పేటీఎం తాజాగా బెంగళూరుకు చెందిన సేవింగ్స్ మేనేజ్‌మెంట్ స్టార్టప్ సంస్థ బ్యాలెన్స్ టెక్నాలజీని కొనుగోలు చేసింది. దీనికోసం ఎంత వెచ్చించిందీ పేటీఎం వెల్లడించనప్పటికీ.. డీల్ విలువ సుమారు 2 మిలియన్ డాలర్లు ఉండవచ్చని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. తమ యూజర్లు, వ్యాపార సంస్థల మధ్య ఇంటర్‌ఫేస్‌ను మెరుగుపర్చేందుకు ఈ కొనుగోలు ఉపయోగపడగలదని పేటీఎ౾ం మాతృ సంస్థ వన్‌97 కమ్యూనికేషన్స్ సీఎఫ్‌వో మధుర్ దేవరా తెలిపారు.

Most from this category