STOCKS

News


ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ని రక్షిస్తాం: ఎల్‌ఐసీ

Tuesday 25th September 2018
news_main1537870212.png-20560

ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ డిఫాల్ట్‌ కాకుండా ఆదుకుంటామని ఎల్ఐసీ హామీనిచ్చింది. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌లో వాటా పెంచుకోవడం సహా అన్ని అవకాశాలు అందుబాటులో ఉన్నాయని, మార్కెట్‌లో ఆందోళనలకు కారణమైన సమస్యను పరిష్కరించేందుకు అవసరమైన చర్యలన్నీ తీసుకుంటామని ఎల్‌ఐసీ భరోసానిచ్చింది. కాగా ఎల్‌ఐసీకి ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌లో 25 శాతానికిపైగా వాటాలున్నాయి. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌న పతనం కానివ్వమని ఎల్‌ఐసీ చైర్మన్‌ వీకే శర్మ తెలిపారు. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ ఆగస్ట్‌ నుంచి చెల్లింపుల్లో డిఫాల్ట్‌ అవుతూ వస్తోంది. దీంతో గ్రూప్‌ ఎండీ, సీఈవో రాజీనామా చేశారు. ‘ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ అన్‌లిస్టెడ్‌ కంపెనీ. ఏఏఏ రేటింగ్‌ ఎన్‌బీఎఫ్‌సీ. డిఫాల్ట్‌ అయ్యింది. సంస్థపై ఏస్థాయిలో ఒత్తిడి ఉందో అంచనా వేయలేకపోతున్నాం’ అని యూబీఎస్‌ ఒక నివేదికలో పేర్కొంది.  
ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ దీర్ఘకాలిక ఇన్‌ఫ్రా అసెట్స్‌పై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించింది. ఇవి గత 3- 4 ఏళ్లుగా పలు సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. అందువల్ల కంపెనీకి నిధుల రాక బలహీనంగా మారింది. దీంతో ప్రతికూల పరిస్థితులు తలెత్తాయి.  



You may be interested

పతనం ఆగింది-లాభాల ముగింపు

Tuesday 25th September 2018

నిఫ్టీ 11000 పాయింట్ల పైకి నిప్టీ ముంబై:- కొద్దిరోజులుగా షేరు, బాండ్ల మార్కెట్లను అతలాకుతలం చేస్తున్న ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ను పరిరక్షిస్తామని, డిఫాల్ట్‌ కానివ్వమని, మరిన్ని పెట్టుబడులు పడతామంటూ ప్రభుత్వ రంగ ఎల్‌ఐసీ చేసిన ప్రకటనతో మంగళవారం మార్కెట్‌ ఊరటపొందింది. ఐదు రోజుల నష్టాలకు బ్రేక్‌ పడింది. ఎల్‌ఐసీ ప్రకటన అనంతరం చివరి గంటలో వేల్యూ కొనుగోళ్లతో ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ తిరిగి 11,000 పాయింట్ల పైకి ఎగబాకింది. గత ఐదు రోజుల

ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ సంఘటన షాకింగ్‌

Tuesday 25th September 2018

ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ సంఘటన షాకింగ్‌ లాంటిదన్నారు మీర్‌ అసెట్‌ గ్లోబల్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ హెడ్‌ (ఫిక్స్‌డ్‌ ఇన్‌కమ్‌) మహేంద్రా జాజో. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ సంక్షోభం వల్ల ఇన్వెస్టర్లు వారి పోర్ట్‌ఫోలియోలోని ఇన్వెస్ట్‌మెంట్లను తిరిగి మరోసారి అంచనా వేసుకుంటున్నారని తెలిపారు. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ ఘటనను ఎవ్వరూ అంచనా వేసి ఉండరని పేర్కొన్నారు. ఇది ఒక షాకింగ్‌ లాంటిదన్నారు. సంస్థ రుణ భారంలో ఎక్కువ భాగం బ్యాంకింగ్‌ రంగానిదేనని తెలిపారు. మ్యూచువల్‌ ఫండ్స్‌కు కూడా కొంత వాటా ఉందని

Most from this category