STOCKS

News


ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ రూ. 21 కోట్ల డిఫాల్ట్‌

Thursday 4th October 2018
news_main1538626968.png-20842

ముంబై: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ గ్రూప్‌లో భాగమైన ఐఎల్అ౾ండ్‌ఎఫ్‌ఎస్‌ ట్రాన్స్‌పోర్టేషన్ నెట్‌వర్క్‌ (ఐటీఎన్‌ఎల్‌) దాదాపు రూ. 21 కోట్లు డిఫాల్ట్‌ అయింది. మూడు నాన్‌ కన్వర్టబుల్ డిబెంచర్స్‌ (ఎన్‌సీడీ)పై వడ్డీ చెల్లింపులు జరపలేకపోయినట్లు సంస్థ తెలిపింది. జూన్‌ 30 నుంచి సెప్టెంబర్ 29 మధ్యలో వీటిని చెల్లించాల్సి ఉన్నట్లు స్టాక్‌ ఎక్స్చేంజీలకు తెలియజేసింది. 19 సిరీస్ బీ కింద రూ. 10.58 కోట్లు, 19ఎం సిరీస్ ఏపై రూ. 6.95 కోట్లు, సిరీస్ 3పై రూ. 3.24 కోట్లు కట్టాల్సి ఉంది. ‍అయితే, వడ్డీ డిఫాల్ట్ అయినప్పటికీ బుధవారం ఐటీఎన్‌ఎల్ షేరు బీఎస్‌ఈలో 20 శాతం పెరిగి రూ.32.15 వద్ద క్లోజయ్యింది. దాదాపు రూ. 91,000 కోట్ల రుణభారం ఉన్న ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ ఇప్పటిదాకా పలు రుణాల చెల్లింపుల్లో డిఫాల్ట్ అయిన సంగతి తెలిసిందే. 

రైట్స్‌ ఇష్యూకు సెంట్రల్‌ బ్యాంక్‌ దూరం ! 

ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ ప్రతిపాదిత రూ.4,500 కోట్ల రైట్స్‌ ఇష్యూలో సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా పాల్గొనకపోవచ్చని సమాచారం. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ కంపెనీ రైట్స్‌ ఇష్యూ ద్వారా రూ.4,500 కోట్లు సమీకరించాలని ప్రతిపాదిస్తున్న విషయం తెలిసిందే. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌లో సెంట్రల్‌ బ్యాంక్‌కు 7.67 శాతం వాటా ఉంది. ఈ వాటా ప్రకారం రైట్స్‌ ఇష్యూలో పాల్గొనాలంటే ఈ బ్యాంక్‌కు రూ.345 కోట్లు అవసరమవుతాయి. సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఇప్పటికే భారీ మొండి బకాయిలతో కుదేలై ఉంది. మూలధన నిధుల కోసం ప్రభుత్వం వైపు చూస్తోంది. మూలధన నిబంధనల ప్రకారం గత ఆర్థిక సంవత్సరానికే ఈ బ్యాంక్‌కు ప్రభుత్వం నుంచి రూ.323 కోట్లు నిధులు రావలసి ఉంది. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను మరిన్ని నిధులు అవసరమవుతాయి. 

ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ గ్రూప్‌  నిధుల కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతోంది. రుణాలు, వడ్డీ చెల్లింపుల్లో విఫలమైంది. ఈ గ్రూప్‌ రుణ భారం రూ.91,000 కోట్లుగా ఉంటుందని అంచనా. ఈ గ్రూప్‌కు తక్షణం రూ.3,000 కోట్లు అవసరం. దీనికి గాను రూ.4,500 కోట్ల మేర రైట్స్‌ ఇష్యూ ద్వారా సమీకరించాలని యోచిస్తోంది.

నేడు బోర్డు సమావేశం ..
ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌లో పరిస్థితులను చక్కదిద్దే ప్రణాళికను రూపొందించేందుకు కొత్తగా ఏర్పాటైన బోర్డు గురువారం సమావేశం కానుంది. సంస్థ ఆర్థిక పరిస్థితులను మదింపు చేయడంతో పాటు తగు పునర్‌వ్యవస్థీకరణ ప్రణాళికపై బోర్డు 15 రోజుల్లో కేంద్రానికి నివేదిక ఇవ్వాల్సి ఉంటుందని కేంద్ర ఆర్థిక శాఖ అధికారి తెలిపారు. కంపెనీ పాత బోర్డును రద్దు చేసి ప్రముఖ బ్యాంకరు ఉదయ్ కొటక్ సారథ్యంలో ఆరుగురు సభ్యులతో కేంద్రం కొత్త బోర్డును ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు, గ్రూప్‌తో పాటు 160 అనుబంధ సంస్థల కార్యకలాపాలపై కూడా విచారణ జరపాలంటూ సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్‌ (ఎస్‌ఎఫ్‌ఐవో)ను కూడా ప్రభుత్వం ఆదేశించింది. మరోవైపు, ఐఎల్‌అ౾ండ్ఎఫ్ఎస్ అంశాన్ని మరింత లోతుగా పరిశీలించేందుకు కాంగ్రెస్ నేత వీరప్ప మొయిలీ సారథ్యంలో పార్లమెంటరీ స్థాయీ సంఘం (ఆర్థిక) అక్టోబర్ 30న సమావేశం కానుంది. కంపెనీలో వాటాదారులైన ఎల్‌ఐసీ, ఎస్‌బీఐ ప్రతినిధులతో పాటు ప్రస్తుత మేనేజ్‌మెంట్‌ను కూడా సమావేశానికి హాజరు కావాలని సూచించినట్లు మొయిలీ తెలిపారు. పార్లమెంటరీ కమిటీ రెండు నెలల్లోగా నివేదికను సమర్పించాల్సి ఉంటుందని ఆయన వివరించారు. You may be interested

టెల్కోల ఆదాయం 10% డౌన్‌

Thursday 4th October 2018

న్యూఢిల్లీ: టెలికం సర్వీసుల ద్వారా ఆపరేటర్ల స్థూల ఆదాయం (జీఆర్) ఈ ఏడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో 10 శాతం తగ్గుదలతో రూ.58,401 కోట్లకు క్షీణించింది. సర్దుబాటు స్థూల ఆదాయం (ఏజీఆర్‌) 8.11 శాతం తగ్గి రూ.36,552 కోట్లుగా నమోదైనట్లు టెలికం రెగ్యులేటర్‌ ట్రాయ్‌ తన తాజా నివేదికలో పేర్కొంది. త్రైమాసికం పరంగా జీఆర్ 6.10 శాతం, ఏజీఆర్‌ 2.40 శాతం తగ్గినట్లు వెల్లడించింది. ఏజీఆర్‌లో ప్రధాన భాగమైన సర్వీసుల విక్రయ

స్మార్ట్‌ఫోన్‌ అమ్మకాల్లో ‘శాంసంగ్‌’ టాప్‌

Thursday 4th October 2018

న్యూఢిల్లీ: ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌ విభాగ అమ్మకాల్లో దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ మొదటి స్థానంలో నిలిచింది. ప్రీమియం సెగ్మెంట్‌ ఆగస్టు విక్రయాల్లో ఈ సంస్థ విలువ పరంగా 60 శాతం మార్కెట్‌ వాటాను, సంఖ్య పరంగా 62.5 శాతం వాటాను సొంతం చేసుకున్నట్లు.. జర్మనీకి చెందిన మార్కెట్‌ పరిశోధన సంస్థ జీఎఫ్‌కే నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. మార్కెట్‌ వాటా ఆగస్టులో ఒక్కసారిగా పెరగడానికి ప్రధాన కారణం ‘శాంసంగ్‌ నోట్‌

Most from this category