STOCKS

News


జూలై నాటికి రూ.12,000 కోట్లకు పరిష్కారం

Thursday 9th May 2019
news_main1557382607.png-25636

  • జూలై నాటికి రూ.12,000 కోట్లకు పరిష్కారం
  • ‘ఐఎల్‌ఎఫ్‌ఎస్‌’ రుణాలపై కేంద్రం వివరణ

న్యూఢిల్లీ: ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ గ్రూపులో ఆర్థికంగా సానుకూలంగా ఉన్న 55 కంపెనీలకు (గ్రీన్‌ కంపెనీలు) సంబంధించి 12,000 కోట్ల మేర రుణాలకు జూలై నాటికి పరిష్కారం లభించనుంది. పరిష్కార ప్రక్రియ సజావుగానే కొనసాగుతున్నట్టు కార్పొరేట్‌ వ్యవహారాల కార్యదర్శి ఇంజేటి శ్రీనివాస్‌ తెలియజేశారు. చాలా వరకు గ్రీన్‌ కంపెనీలు సానుకూల ఈక్విటీతో ఉన్నాయన్నారు. అంటే రుణాలు చెల్లించాక కూడా వాటాదారులకు ఎంతో కొంత తమ వాటాలపై లభిస్తుందన్నారు. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ గ్రూపునకు రూ.94,000 కోట్ల మేర రుణం భారం  ఉంటుందని అంచనా. రుణాలకు చెల్లింపులు చేయలేని పరిస్థితుల్లో ఉన్న గ్రూపు బోర్డును కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ గతేడాది అక్టోబర్‌లో రద్దు చేసింది. కంపెనీ వ్యవహారాల పర్యవేక్షణకు ఎన్‌సీఎల్‌టీయే ప్రత్యేక బోర్డును నియమించింది. పరిష్కార ప్రయత్నాల్లో భాగంగా గ్రూపు కంపెనీలను... గ్రీన్‌, అంబర్‌, రెడ్‌ అనే మూడు రకాలుగా వర్గీకరించారు. గ్రీన్‌ విభాగంలో 55 కంపెనీలున్నాయి. వీటికి సంబంధించిన రుణాలు రూ.12,000 కోట్లు. వీటిల్లోనూ పెద్దవైన 10 కంపెనీల రుణాలను తీర్చివేయడంపై బోర్డు దృష్టి సారించింది. తద్వారా రూ.12 వేల కోట్లలో 90 శాతానికి పరిష్కారం జూలై నాటికి లభించగలదని శ్రీనివాస్‌ తెలిపారు. అంబర్‌ విభాగంలోని కంపెనీలకు సంబంధించి రూ.20 వేల కోట్ల రుణాలున్నాయి. ఇవి సెక్యూర్డ్‌ రుణాల వరకు చెల్లింపులు చేయగల సామర్థ్యం కలిగినవి. 



You may be interested

ఐబీసీ ద్వారా బ్యాంకులకు రూ.80,000 కోట్లు

Thursday 9th May 2019

2019-20 ఆర్థిక సంవత్సరంపై ఇక్రా అంచనా న్యూఢిల్లీ: బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019-20)లో ఇన్‌సాల్వెన్సీ అండ్‌ బ్యాంక్రప్టసీ కోడ్‌ (ఐబీసీ) కింద మొండి బకాయిలకు పరిష్కారం రూపేణా రూ.80,000 కోట్లు వసూలవుతాయని రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో ఇలా వసూలైన మొత్తం రూ.66,000 కోట్లతో పోలిస్తే పెరగనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెండు పెద్ద ఖాతాలైన ఎస్సార్‌ స్టీల్‌, భూషణ్‌ స్టీల్‌

స్థిరంగా పసిడి

Thursday 9th May 2019

ప్రపంచమార్కెట్లో పసిడి ధర గురువారం స్థిరంగా ట్రేడ్‌ అవుతోంది. ఆసియా ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో ఔన్స్‌ పసిడి ధర 1.50డాలరు స్వల్పలాభంతో 1,282.85 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. మరోవైపు ప్రభుత్వ బాండ్లు, జపాన్‌ యెన్‌కు డిమాండ్‌ పెరగడంతో పాటు కీలకమైన సాంకేతిక నిరోధస్థాయి పసిడి ర్యాలీకి అడ్డుకట్టు వేస్తున్నాయి. అమెరికా - చైనాల మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశం ఉంది. ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో నెలకొన్న అస్థిరత

Most from this category