STOCKS

News


25 ​‍ప్రాజెక్ట్‌లను అమ్మేస్తాం

Thursday 30th August 2018
news_main1535606404.png-19787

ముంబై: మౌలిక రంగ కంపెనీ ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ కంపెనీ త్వరలో రైట్స్‌ ఇష్యూకి రాబోతోంది. అలాగే  ఆస్తులను విక్రయించి రూ.30,000 కోట్ల మేర రుణ భారం తగ్గించుకోవాలని కూడా యోచిస్తోంది.  ఈ రెండు ప్రతిపాదనలకు డైరెక్టర్ల బోర్డ్‌ ఆమోదం తెలిపినట్లు ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ తెలిపింది. ఒక్కో షేర్‌ రూ.150 చొప్పున 30 కోట్ల ఈక్విటీ షేర్లను రైట్స్‌ ఇష్యూ ద్వారా జారీ చేసి రూ.4,500 కోట్లు సమీకరిస్తామని తెలిపింది. ఈ రైట్స్‌ ఇష్యూ ఈ ఏడాది అక్టోబర్‌ 30 నాటికి పూర్తవుతుందని అంచనా. 
గ్రూప్‌ కంపెనీల్లో రూ.5,000 కోట్ల పెట్టుబడులు
అలాగే గ్రూప్‌ కంపెనీల్లో రూ.5,000 కోట్ల మేర పెట్టుబడులు పెట్టాలని కూడా నిర్ణయించామని ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ పేర్కొంది. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌, ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ ఎనర్జీ, ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ ఎన్వైరాన్‌మెంట్‌, ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ ఎడ్యుకేషన్‌ కంపెనీల్లో  ఈ పెట్టుబడులు పెడతామని తెలియజేసింది. విక్రయానికి 25 ప్రాజెక్ట్‌లను గుర్తించామని, ఈ ప్రాజెక్ట్‌ల విక్రయం కారణంగా తమ రుణభారం రూ.30,000 కోట్ల మేర తగ్గుతుందని పేర్కొంది. విక్రయించదలచిన 25 ప్రాజెక్ట్‌లకు గాను 14 ప్రాజెక్ట్‌లకు ఆఫర్లు వచ్చాయని, ఏడాదిన్నర కాలంలో ఈ 24 ప్రాజెక్ట్‌ల విక్రయం పూర్తవుతుందని వివరించింది. మౌలిక రంగ ప్రాజెక్ట్‌ల్లో రూ.1,89,000 కోట్లు ఇన్వె‍స్ట్‌ చేశామని తెలిపింది. ఉపరితల రవాణా, ఇంధన, పట్టణ ఇన్‌ఫ్రా, ఆర్థిక సేవల రంగాల్లో ఈ పెట్టుబడులు పెట్టామని పేర్కొంది. ఈ పెట్టుబడుల కారణంగా 3 కోట్ల పనిదినాలను, 60 లక్షల ఉద్యోగాలను సృష్టించామని వివరించింది. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లీజింగ్‌ అండ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ (ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌) కంపెనీలో బీమా దిగ్గజం ఎల్‌ఐసీకి 25 శాతం వాటా ఉండగా, హెచ్‌డీఎఫ్‌సీకి 9 శాతం వాటా ఉంది. ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ బెయిలవుట్‌కు హెచ్‌డీఎఫ్‌సీ అంగీకరించని నేపథ్యంలో రైట్స్‌ ఇష్యూ, ఆస్తుల విక్రయం ప్రతిపాదనలను కంపెనీ ముందుకు తెచ్చిందని సమాచారం.



You may be interested

విదేశీ రూట్లలో విస్తార సర్వీసులు

Thursday 30th August 2018

న్యూఢిల్లీ: విమానయాన సంస్థ విస్తార అక్టోబర్‌ నుంచి విదేశీ రూట్లలో విమాన సర్వీసులు ప్రారంభించనుంది. ముందుగా న్యూఢిల్లీ నుంచి కొలంబో (శ్రీలంక), ఫుకెట్‌ (థాయ్‌ల్యాండ్‌) ప్రాంతాలకు సర్వీసులు ప్రారంభించే అవకాశం ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇందుకు అవసరమైన అనుమతులు పొందడం, అంతర్జాతీయ కార్యకలాపాల ప్రణాళికలు ఖరారు చేసుకోవడానికి సంబంధించిన ప్రక్రియ మొదలుపెట్టినట్లు వివరించాయి. అన్నింటికన్నా ముందుగా దుబాయ్‌కు సర్వీసులు ప్రారంభించాలనుకున్నప్పటికీ .. ఇప్పటికే రెండు దేశాల ద్వైపాక్షిక కోటా

సెప్టెంబర్‌ 1 నుంచి పోస్టల్‌ బ్యాంకు సేవలు

Thursday 30th August 2018

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా తపాలా శాఖకు చెందిన ఇండియా పోస్ట్‌ పేమెంట్స్‌ బ్యాంకు (ఐపీపీబీ) సేవలు సెప్టెంబర్‌ 1న ఆరంభం కాబోతున్నాయి. ప్రధాని మోదీ చేతుల మీదుగా ఇవి ప్రారంభమవుతాయి. ‘‘ప్రారంభమైన రోజు నుంచే దేశవ్యాప్తంగా 650 శాఖలు, 3,250 సేవల పాయింట్లు అందుబాటులోకి వస్తాయి’’ అని కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రి మనోజ్‌సిన్హా బుధవారం ఢిల్లీలో మీడియాకు తెలిపారు. డిసెంబర్‌ నాటికి మొత్తం 1.55 లక్షల పోస్టాఫీసులను ఐపీపీబీతో అనుసంధానించడం పూర్తవుతుందని,

Most from this category