STOCKS

News


బ్యాంకులపై ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ ధిక్కరణ పిటిషన్‌

Tuesday 11th June 2019
news_main1560229499.png-26223

దాఖలు చేసే అవకాశం న్యూఢిల్లీ: తాతాల్కిక నిషేధ సమయంలో కంపెనీ ఎస్క్రో ఖాతాలో ఉన్న రూ.800 కోట్లను అక్రమంగా ఉపసంహరించుకున్నందుకు 11 బ్యాంకులు, ఫైనాన్షియల్‌ సంస్థలకు వ్యతిరేకంగా ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ ఎన్‌సీఎల్‌టీ ముందు ధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేస్తోంది. రూ.800 కోట్లను ఖాళీ చేసేసిన సంస్థల్లో ఎస్‌బీఐ, బ్యాంకు ఆఫ్‌ బరోడా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, యస్‌ బ్యాంకు, పీఎన్‌బీ, ఇండియన్‌ బ్యాంకు, ఫెడరల్‌ బ్యాంకు, బిర్లా సన్‌లైఫ్‌ ఏఎంసీ, ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్‌ తదితర సం‍స్థలున్నాయి. ఎన్‌సీఎల్‌టీ ముందు రుణ పరిష్కారాన్ని కోరుతున్న సమయంలో బ్యాంకులు డబ్బులను డ్రా చేసుకున్నట్టు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎన్‌సీఎల్‌టీ, తన అనుమతి లేకుండా బ్యాంకులు ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ గ్రూపునకు చెందిన ఏ ఖాతాను కానీ ఎన్‌పీఏగా గుర్తించరాదని, అలాగే, బకాయిల వసూలుకు చర్యలు చేపట్టరాదని ఆదేశించడం గమనార్హం. మారటోరియం సమయంలో ఎన్‌సీఎల్‌టీ ఆదేశాలకు వ్యతిరేకంగా డబ్బులను డ్రా చేసుకున్నందున ధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేయనున్నట్టు ఆ వర్గాలు తెలిపాయి. You may be interested

స్వల్పంగా పెరిగిన పసిడి

Tuesday 11th June 2019

ఈక్విటీ మార్కెట్లు ర్యాలీ చేస్తున్నప్పటికీ.., పసిడి ధర మంగళవారం లాభపడింది. ఆసియా ట్రేడింగ్‌లో ఔన్స్‌ పసిడి ధర 4 డాలర్లు పెరిగి 1,333.75 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఫెడ్‌ రిజర్వ్‌ వడ్డీరేట్ల కోత విధింపు అంచనాలు పసిడి ర్యాలీకి తోడ్పాటును అందిస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మెక్సికో దిగుమతులపై అమెరికా పన్ను విధింపు విరమించుకోవడంతో పాటు డాలర్‌ ఇండెక్స్‌ కనిష్టస్థాయిల నుంచి రివకరి కావడంతో రాత్రి అమెరికా మార్కెట్లో 16

మ్యాక్స్‌ బూపాతో చేయి కలిపిన ఐడీబీఐ బ్యాంకు

Tuesday 11th June 2019

హైదరాబాద్‌: ఐడీబీఐ బ్యాంకు, మ్యాక్స్‌ బూపా కార్పొరేట్‌ ఏజెన్సీ ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా ఐడీబీఐ ఖాతాదారులకు సమగ్ర ఆరోగ్య బీమా ఉత్పత్తులను మ్యాక్స్‌ బూపా ఆఫర్‌ చేస్తుంది. ఐడీబీఐ బ్యాంకుకు దేశవ్యాప్తంగా 1,800 శాఖలతోపాటు 2 కోట్ల ఖాతాదారులున్నారు. ఐడీబీఐ బ్యాంకు ఎండీ, సీఈవో రాకేశ్‌ శర్మ మాట్లాడుతూ... ఖాతాదారుల అవసరాలను గుర్తించడంతోపాటు వారికి అనువైన ఆర్థిక ఉత్పత్తులను అందిస్తుంటామని, ఇందులో భాగమే మ్యాక్స్‌ బూపాతో ఒప్పందమని

Most from this category