STOCKS

News


ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ రుణ ఖాతా మనుగడలోనే ఉంది: బీవోబీ

Wednesday 10th October 2018
news_main1539148630.png-21004

 ముంబై: ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ సంస్థ రుణ ఖాతా తమ వద్ద కొనసాగుతూనే ఉందని బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (బీవోబీ) స్పష్టం చేసింది. ఎన్‌బీఎఫ్‌సీ కంపెనీలకు, హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలకు రుణాలు మం‍జూరు ఇకపైనా కొనసాగుతుందని తెలిపింది. ‘‘ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌కు రుణాలిచ్చి ఉన్నాం. ప్రస్తుతానికి ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ సహా ఇతర అన్ని ఎన్‌బీఎఫ్‌సీ ఖాతాలు పనిచేస్తూనే ఉన్నాయి. రేపు ఎలా ఉంటాయన్న దానిపై రేపే మాట్లాడగలం తప్ప ఇప్పుడేమీ చెప్పలేం’’ అని బీవోబీ చీఫ్‌ పీఎస్‌ జయకుమార్‌ తెలిపారు. బ్యాంకు ఎక్స్‌పోజర్‌ మిశ్రమంగా ఉంటుందని, ఏదైనా సమస్య ఏర్పడితే ఎదుర్కొనేందుకు తగినంత నిధులు కూడా ఉన్నాయని స్పష్టం చేశారు. రూ.91,000 కోట్ల రుణ భారంతో ఉన్న ఐల్‌ఎఫ్‌ఎస్‌ గ్రూపు ఇటీవల పలు రుణ చెల్లింపుల్లో డిఫాల్ట్‌ అయిన విషయం తెలిసిందే. ఈ సంక్షోభం తర్వాత ఎన్‌బీఎఫ్‌సీలు, హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలకు బ్యాంకులు రుణాలను నిలిపివేసినట్టు వార్తలు వచ్చాయి. వీటిపై స్పందించిన జయకుమార్‌... ఎన్‌బీఎఫ్‌సీలు, హెచ్‌ఎఫ్‌సీలకు రుణాల మంజూరు కొనసాగుతుందని, వీటికి సంబంధించి విశ్వాస సంక్షోభమేమీ లేదని చెప్పారు.



You may be interested

‘నగదు రవాణా’లో మోసాలు తగ్గుతాయి

Wednesday 10th October 2018

న్యూఢిల్లీ: ఆర్‌బీఐ నూతన నిబంధనలు నగదు రవాణా రంగానికి మేలు చేస్తాయని సంబంధిత పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. బ్యాంకింగ్‌ రంగానికి సంబంధించి నిత్యం రూ.15,000 కోట్ల నగదు రవాణా చేసే ఈ రంగంలో భద్రత పెరగడంతోపాటు, మరిన్ని ఉద్యోగాలు కూడా వస్తాయని క్యాష్‌ లాజిస్టిక్స్‌ అసోసియేషన్‌ అభిప్రాయపడింది. ఆర్‌బీఐ మార్గదర్శకాలు ఈ రంగంలో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణమైన విధానాలు తీసుకొచ్చేలా చేస్తాయని, ప్రజాధనానికి భద్రత ఇనుమడిస్తుందని పేర్కొంది. స్వల్ప కాలంలో

‘శాంత్రో’ బుకింగ్స్‌ ప్రారంభం

Wednesday 10th October 2018

చెన్నై: అతి త్వరలోనే ‘హ్యుందాయ్‌ శాంత్రో’ మళ్లీ మార్కెట్‌లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతోంది. అక్టోబరు 23న న్యూఢిల్లీలో సరికొత్త శాంత్రోను ప్రపంచానికి పరిచయం చేస్తున్నట్లు ప్రకటించిన హ్యుందాయ్‌ మోటార్స్‌ ఇండియా (హెచ్‌ఎంఐఎల్‌)... భారత్‌లో ఇది ఈ నెల తరువాత అందుబాటులోకి వస్తుందని వెల్లడించింది. అక్టోబర్‌ 10 (బుధవారం) నుంచి 22 వరకు ఆన్‌లైన్‌ ప్రీ-బుకింగ్స్‌ కొనసాగనుండగా.. ప్రారంభ ఆఫర్‌ కింద తొలి 50,000 మంది కస్టమర్లకు రూ.11,100కే కారును బుక్‌

Most from this category