STOCKS

News


ఇచ్చిన అప్పులో 10- 15 శాతం ఆవిరి?!

Wednesday 3rd October 2018
news_main1538546874.png-20816

ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌కు బ్యాంకులిచ్చిన రుణాలపై అంచనా
రుణభారంతో సతమతమవుతున్న ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌కు ఎస్‌బీఐ, బీఓఐ, పీఎన్‌బీ తదితర బ్యాంకులన్నీ కలిపి దాదాపు 35వేల కోట్ల రూపాయల మేర అప్పులిచ్చిఉన్నాయి. వీటిలో అత్యధికంగా బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 2,388 కోట్ల రూపాయల మేర కంపెనీకి రుణాలిచ్చింది. తాజాగా ప్రభుత్వం కంపెనీ పరిస్థితి చక్కదిద్దేందుకు మేనేజ్‌మెంట్‌లో పలు కీలక మార్పులు చేసింది. ఈ మార్పుల కారణంగా తమ రుణాలు వసూలయ్యే ఛాన్సులు కాస్త మెరుగుపడ్డాయని బ్యాంకులు భావిస్తున్నాయి. అయితే ఇచ్చిన రుణాల్లో 10- 15 శాతం మేర ఆవిరికావడం తప్పదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. కంపెనీ ప్రాజెక్టులు కొనుగోలు చేసేందుకు వచ్చే బయ్యర్లు కఠినంగా బేరాలాడడం ఖాయమని అందువల్ల బ్యాంకులు తామిచ్చిన రుణ మొత్తాల్లో కొంత మేర నష్టపోవడం తప్పదని అంచనా వేస్తున్నారు. కొత్త మేనేజ్‌మెంట్‌ నేతృత్వంలో కంపెనీ రుణాలను పునర్‌వ్యవస్థీకరించడం, ఆస్తులను విక్రయించి సొమ్ము చేసుకోవడం జరుగుతుంది. ఇవన్నీ జరిగేందుకు మరింత కాలం పడుతుందని, అందువల్ల బ్యాంకులకు రుణాల వసూలవడంలో జాప్యం తప్పదని నిపుణుల అంచనా. ఈ జాప్యం కారణంగా బ్యాంకులిచ్చిన రుణాలపై వడ్డీలు ఇతరత్రా ఖర్చులు లెక్కిస్తే వచ్చే సొమ్ము ఇచ్చిన రుణం కన్నా 10- 15 శాతం తక్కువగా ఉండొచ్చని ఎర్నెస్ట్‌ యంగ్‌ ప్రతినిధి అబిజర్‌ దివాన్‌జీ అభిప్రాయపడ్డారు. కంపెనీ కొత్త బోర్డు ఈ నెల 8న తొలిసారి సమావేశం కానుంది. ప్రభుత్వ జోక్యం కారణంగా స్వల్పనష్టం వచ్చినా మొత్తానికి ఈ సంక్షోభం నుంచి బయటపడతామని కొందరు బ్యాంకర్లు చెప్పినట్లు ఎకనమిక్‌ టైమ్స్‌ తెలిపింది. ఇప్పుడే హెయిర్‌కట్స్‌( ఇచ్చిన అప్పులో ఆవిరయ్యే మొత్తాలు) గురించి మాట్లాడలేమని, ప్రభుత్వ జోక్యం ఉన్నందున ఇలాంటివి ఉండకపోవచ్చని కొందరు బ్యాంకర్లు చెప్పారు. ప్రభుత్వం పరిస్థితితిని చేతుల్లోకి తీసుకున్నాక రుణానికి ఢోకా ఉండదని, స్వల్పకాలం పాటు లిక్విడిటీ ఇబ్బందులు మాత్రమే ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ దన్ను ఉన్న విత్త సంస్థలు కంపెనీలోకి నిధులను ఇన్‌ఫ్యూజ్‌ చేయడం తదితర మార్గాల ద్వారా ఈ సమస్యను చక్కదిద్దవచ్చని అంచనా వేస్తున్నారు. మరోవైపు ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌కు చెందిన ప్రాజెక్టులపై పలువురు కొనుగోలుదార్లు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. అందువల్ల రుణాలు వెనక్కి రావడం తధ్యమని ఆశతో బ్యాంకులున్నాయి.You may be interested

ఐఎల్‌ ఎఫ్‌ఎస్‌ ‍గ్రూప్‌ షేర్లు రికవరీ..!

Wednesday 3rd October 2018

దివాళా దశకు చేరిన ఐఎల్ఎఫ్ఎస్ సంస్థను గాడిలో పెట్టేందుకు కేంద్రం చర్యలు తీసుకోవడంతో ఆ గ్రూప్‌ కంపెనీల షేర్లు బుధవారం రికవరీ బాట పట్టాయి. ఐల్‌ఎల్అండ్‌ ఎఫ్‌ఎస్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ మేనేజర్స్‌, ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ ట్రాన్స్‌పోర్టేషన్స్‌ నెట్‌వర్క్స్‌, ఐఎల్‌అండ్ఎఫ్‌ఎస్‌ ఇంజనీరింగ్స్‌ షేర్లు ఇంట్రాడే 10-20శాతం లాభపడ్డాయి. తీవ్ర చెల్లింపుల సంక్షోభంలో చిక్కుకున్న ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ మేనేజ్‌మెంట్‌ను ప్రభుత్వం స్వాధీనం చేసుకోంది. పాత బోర్డును రద్దు చేస్తూ కొత్త బోర్డును ఏర్పాటు చేసింది. ఆరుగురు సభ్యులతో

వారం గరిష్టం వద్ద పసిడి

Wednesday 3rd October 2018

ముంబై:- ఇటలీ బడ్జెట్‌ సంక్షోభంతో బుధవారం పసిడి ధర పరుగులు పెడుతోంది. అసియా మార్కెట్లో ఔన్స్‌ పసిడి వారం రోజుల గరిష్ట వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి.  ఈ ఏడాది ఇటలీలో అధికారంలోకి వచ్చిన సంకీర్ణ ప్రభుత్వం ఈయూ(యూరోపియన్‌ యూనియన్‌) ఆర్థిక నియమాళిని ఉల్లంఘిస్తూ భారీ​బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. ఈయూ ఇటలీ ఆర్థిక విధానాలను మార్చుకోవాల్సిందిగా హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు రక్షణాత్మకంగా పసిడి ఫ్యూచర్ల కొనుగోళ్లకు మొగ్గుచూపడంతో గతరాత్రి అమెరికా

Most from this category