STOCKS

News


ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ది లిక్విడిటీ సమస్య

Monday 17th September 2018
news_main1537180557.png-20330

మార్కెట్‌ నిపుణుడు ధీరేంద్ర కుమార్‌
రుణ భారం కారణంగా తలనొప్పులు ఎదుర్కొంటున్న ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌పై మార్కెట్‌ నిపుణుడు ధీరేంద్ర కుమార్‌ విశ్వాసం వ్యక్తం చేశారు. కంపెనీది లిక్విడిటీ సమస్య కానీ ఆస్తులు లేకపోవడం సమస్య కాదన్నారు. కంపెనీలో ప్రముఖ వాటాదారులన్నీ పీఎస్‌యూ కంపెనీలని అందువల్ల కంపెనీ పరిస్థితిపై భారీగా భయపడాల్సిన అవసరం ఉండకపోవచ్చని అభిప్రాయపడ్డారు. అలాగని కంపెనీలో అసలు సమస్యేలేదని కాదని, కానీ అది తీర్చగలిగే సమస్యేనని అన్నారు. కంపెనీలో పెట్టుబడి పెట్టిన ఎంఎఫ్‌లు ఇబ్బంది పడేందుకు ఇన్వెస్టర్ల మనస్థత్వమే కారణమన్నారు. ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్లు వెంటనే ఉపసంహరించుకునే వీలుందని, కానీ కంపెనీలో పెట్టుబడి పెట్టిన ఫండ్స్‌కు ఆ అవకాశం లేదని చెప్పారు. అందువల్ల ఫండ్స్‌కు తాత్కాలిక తలనొప్పులు వస్తాయన్నారు. ఇలాంటి సమస్యలు ఎదురయినప్పుడు ఫండ్స్‌ నుంచి నిధులు ఉపసంహరించుకునేందుకు ఇన్వెస్టర్లు క్యూ కడతారని అందువల్ల అసలు సమస్య మరింత పెద్దదిగా కనిపిస్తుందని వివరించారు. అయితే కాలగమనంలో ఈ సమస్య సద్దుమణిగేదేనని, ఎవరి సొమ్ము ఎక్కడికీ పోదని అంచనా వేశారు. ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్లు మెచ్యూర్టి వరకు వేచిఉంటే ఇంత గందరగోళం ఉండకపోయేదన్నారు. పలు బడా ఇన్‌ఫ్రా ప్రాజెక్టులకు ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ రుణాలిచ్చిందని, అవన్నీ నిధులు లేక ఆగిపోవడంతో కంపెనీకి సమస్య ఆరంభమైందని చెప్పారు. అయితే ఈ సమస్యను పరిష్కరించవచ్చన్నారు. నిజానికి ఈ సమస్య ఎదురయ్యేందుకు బహిర్గత కారణాలు అనేకం ఉంటాయని, అవన్నీ అంతిమంగా కంపెనీపై భారంగా మారాయని చెప్పారు. లిక్విడిటీ సమస్య తీరితే కంపెనీ ఇక్కట్లు చాలావరకు తొలగిపోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. You may be interested

బేర్స్‌ గుప్పిట్లో సూచీల విలవిల

Monday 17th September 2018

సెన్సెక్స్‌ 500 పాయింట్లు లాస్‌ 11400 దిగువకు నిఫ్టీ ముంబై:- మార్కెట్‌ను మరోసారి బేర్స్‌ హడలెత్తించారు. సూచీల రెండు రోజుల లాభాలకు చెక్‌ పెడుతూ ట్రేడింగ్‌ ప్రారంభం నుంచే బేర్స్‌ హల్‌చల్‌ చేశాయి. వాణిజ్య యుద్ధ భయాలు తెరపైకి రావడం, రూపాయి పతనం మళ్లీ మొదలవడం, ఆర్థిక వ్యవస్థను చక్కబెట్టేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు బెడిసి కొట్టడం, మార్కెట్‌ నుంచి తరలిపోతున్న విదేశీ నిధులు, సాంకేతిక కారణాలు మార్కెట్లో బేర్స్‌ పట్టును సాధించడానికి

కొనేందుకు ఇదే సరైన సమయం..

Monday 17th September 2018

రూపాయి సరైన విలువ 73. ఆందోళన చెండాల్సిన పరిస్థితులు ఏమీ లేవు. అయితే మార్కెట్లు స్వల్పకాలిక కరెక‌్షన్లకు గురికావొచ్చని ఇండియా జెన్‌ ఫండ్‌ డైరెక్టర్‌, చీఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఆఫీసర్‌ మనీష్‌ సొంతాలియా తెలిపారు. ఆయన ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు వెల్లడించారు. ఫండమెంటల్స్‌ బాగున్నాయని తెలిపారు. స్వల్పకాలిక సెంటిమెంట్స్‌ వల్ల సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయని పేర్కొన్నారు. అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి సరైన మారక విలువ

Most from this category