STOCKS

News


'ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ ఇన్వెస్ట్‌మెంట్' డైరెక్టర్ రాజీనామా

Saturday 20th October 2018
news_main1540009722.png-21301

న్యూఢిల్లీ: రుణాల డిఫాల్ట్‌ల నేపథ్యంలో ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ గ్రూప్ కంపెనీల్లో రాజీనామాల పర్వం కొనసాగుతోంది. తాజాగా ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్స్ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వైభవ్ కపూర్ శుక్రవారం తన పదవికి రాజీనామా చేశారు. స్టాక్ ఎక్స్చేంజీలకు ఈ సమాచారం తెలియజేసిన కంపెనీ.. ఆయన రాజీనామాకు కారణాలను మాత్రం వెల్లడించలేదు. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ గ్రూప్‌ రుణభారం దాదాపు రూ. 90,000 కోట్ల పైగా ఉంది. గ్రూప్ ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న నేపథ్యంలో ఇప్పటికే ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ ఫైనాన్షియల్ సర్వీసెస్ స్వతంత్ర డైరెక్టర్లు రేణు చల్లు, సురీందర్ సింగ్ కోహ్లి, శుభలక్ష్మి పన్సే, ఉదయ్ వేద్ రాజీనామా చేశారు. అటు ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ ఇంజినీరింగ్ అండ్ కన్‌స్ట్రక్షన్ కంపెనీ ఎండీ మురళీ ధర్ ఖట్టర్ కూడా వైదొలిగారు.



You may be interested

ఆల్ట్రాటెక్‌ సిమెంట్‌కు వ్యయాల సెగ

Saturday 20th October 2018

న్యూఢిల్లీ: ఆదిత్య బిర్లా గ్రూప్‌కు చెందిన ఆల్ట్రాటెక్‌ సిమెంట్‌ కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో రూ.376 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో రూ.424 కోట్ల నికర లాభం వచ్చిందని కంపెనీ తెలిపింది. ఇంధన, రవాణా వ్యయాలు పెరగడం. బలహీనమైన నిర్వహణ పనితీరు  వల్ల నికర లాభం తగ్గిందని వివరించింది. మొత్తం ఆదాయం గత క్యూ2లో రూ.7,004 కోట్లుగా ఉండగా,

తగ్గిన ‘చమురు’ సెగ - పెరిగిన రూపాయి విలువ

Saturday 20th October 2018

న్యూఢిల్లీ: అంతర్జాతీయ మార్కెట్‌లో గరిష్ట స్థాయిల నుంచి తగ్గిన క్రూడ్‌ ధర రూపాయి విలువకు కలిసివస్తోంది. ఇంటర్‌బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్‌లో రూపాయి విలువ శుక్రవారం 29 పైసలు బలపడింది. 73.32 వద్ద ముగిసింది. ఈ నెల 9వ తేదీన చరిత్రాత్మక కనిష్ట స్థాయి 74.39 వద్ద ముగిసింది. అయితే అటు తర్వాత 10,11,12 తేదీల్లో వరుసగా 18, 09, 55 పైసలు చొప్పున మొత్తం 82 పైసలు బలపడింది.  సోమవారం

Most from this category