STOCKS

News


రెన్యూవల్‌ ఎనర్జీలో వాటా విక్రయిస్తాం !

Thursday 29th November 2018
news_main1543470374.png-22475

ముంబై:  ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లీజింగ్‌ అండ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌(ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌) గ్రూప్‌ తన రెన్యూవల్‌ ఎనర్జీ వ్యాపారంలో వాటాను విక్రయించనున్నది. ఈ రెన్యూవల్‌ ఎనర్జీ విభాగంలో భాగంగా ఈ గ్రూప్‌ రెండు పవన విద్యుదుత్పత్తి ప్లాంట్లను నిర్వహిస్తోంది. ఈ ప్లాంట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యం 873.5 మెగావాట్లు. ఇవి కాకుండా 104 మెగావాట్ల విద్యుదుత్పత్తిని చేసే ప్లాంట్లు నిర్మాణంలో ఉన్నాయి. ఈ వ్యాపార విభాగంలో తమకున్న వాటాను విక్రయించే ప్రక్రియను ఆరంభించామని ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ తెలిపింది.  పవన విద్యుదుత్పత్తి ప్లాంట్ల ప్రాజెక్ట్‌ డెవలప్‌మెంట్‌, ఎగ్జిక్యూషన్‌కు సంబంధించిన వ్యాపార విభాగంలోని వాటాను కూడా విక్రయించే విషయమై కసరత్తు చేస్తున్నామని  పేర్కొంది. వీటిన్నింటినీ విడివిడిగా గానీ, గంపగుత్తగా గానీ విక్రయించనున్నామని, ఎలా వీలైతే అలా విక్రయించనున్నామని వివరించింది. త్వరలో ఈ రెన్యూవల్‌ ఎనర్జీలో వాటా విక్రయానికి బిడ్‌లను ఆహ్వానిస్తామని పేర్కొంది. రూ.94,200 కోట్ల భారీ రుణభారంతో ఈ గ్రూప్‌ ఇటీవల పలు చెల్లింపుల్లో డీఫాల్ట్‌ అయిన విషయం తెలిసిందే. 



You may be interested

మిశ్రమంగా పసిడి ధర

Thursday 29th November 2018

పసిడి ధర గురువారం మిశ్రమంగా ట్రేడ్‌ అవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో లాభాల్లో ట్రేడ్‌ అవుతుండగా, దేశీయంగా మాత్రం నష్టాల బాట పట్టింది. పావెల్‌ వాఖ్యలతో డాలర్‌ ఇండెక్స్‌ వెనకడుగు వేయడంతో ప్రపంచ మార్కెట్లో పసిడి లాభపడింది. ఇక దేశీయంగా చూసినట్లైతే... రూపాయి ర్యాలీ పసిడి క్షీణతకు కారణమవుతోంది. పావెల్‌ వాఖ్యలతో పసిడి ర్యాలీ:- ఫెడ్‌రిజర్వ్‌ వడ్డీరేట్ల పెంపుపై అంచనాలు సన్నగిల్లడంతో  పసిడికి కలిసొస్తుంది. ఆసియా ట్రేడింగ్‌లో గురువారం ఔన్స్‌ పసిడి ధర 5డాలర్లు

రియల్‌మి 'యు1' స్మార్ట్‌ఫోన్‌

Thursday 29th November 2018

న్యూఢిల్లీ: చైనాకి చెందిన స్మార్ట్‌ఫోన్స్ తయారీ సంస్థ రియల్‌మి తాజాగా 'యు1' పేరుతో మరో కొత్త ఫోన్‌ను బుధవారం భారత మార్కెట్లో ఆవిష్కరించింది. దీని ధరల శ్రేణి రూ. 11,999 నుంచి ప్రారంభమవుతుంది. డిసెంబర్ 5 నుంచి ఈ ఫోన్లు అందుబాటులో ఉంటాయని రియల్‌మి ఇండియా సీఈవో మాధవ్ సేథ్‌ తెలిపారు.  మీడియాటెక్‌ హీలియో పి70 ప్రాసెసర్‌తో ఈ కేటగిరీలో యు1ను అత్యంత శక్తిమంతమైన సెల్ఫీ స్మార్ట్‌ఫోన్‌గా తీర్చిదిద్దినట్లు వివరించారు. యు1లో

Most from this category