STOCKS

News


ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ సీఓఓగా శివరామన్‌

Tuesday 4th December 2018
news_main1543905256.png-22613


ముంబై: రుణ భారంతో కుదేలైన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లీజింగ్ అండ్‌ ఫైనాన్స్‌  (ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌) గ్రూప్‌ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌(సీఓఓ)గా ఎన్‌.శివరామన్‌ నియమితులయ్యారు. శివరామన్‌ రోజువారీ కార్యకలాపాలు చూస్తారని, గ్రూప్‌ ఆస్తుల విక్రయ ప్రయత్నాలను పర్యవేక్షిస్తారని ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ తెలిపింది. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ గ్రూప్‌ వైస్‌ చైర్మన్‌, ఎమ్‌డీ అయిన వినీత్‌ నయ్యర్‌కు ఆయన తన కార్యకలాపాలను నివేదిస్తారని వివరించింది. శివరామన్‌ గతంలో ఎల్‌ అండ్‌ టీ గ్రూప్‌లో పనిచేశారు. ఇటీవల వరకూ ఎల్‌ అండ్‌ టీ ఫైనాన్స్‌ హోల్డింగ్స్‌కు ప్రెసిడెంట్‌గానూ, పూర్తి కాలపు డైరెక్టర్‌ గానూ పనిచేశారు.మరోవైపు ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ సెక్యూరిటీస్‌ సర్వీసెస్‌, ఐఎస్‌ఎస్‌ఎల్‌ సెటిల్మెంట్‌ అండ్‌ ట్రాన్సాక్షన్‌ సర్వీసెస్‌ కంపెనీల్లో వాటాను ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ విక్రయానికి పెట్టింది. ఈ సం‍స్థల్లో వాటా కొనుగోళ్ల కోసం డజనుకు పైగా కంపెనీలు ఆసక్తి వ్యక్తం చేశాయి. రెన్యూవల్‌ ఎనర్జీ వ్యాపార విభాగంలో కూడా వాటాను ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ విక్రయించనున్నది. ఈ ఏడాది అక్టోబర్‌ 8 నాటికి ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ గ్రూప్‌ రుణ భారం రూ.94,216 కోట్లుగా ఉంది.



You may be interested

సెప్టెంబర్‌లో త్రైమాసికంలో కట్టలు తప్పనున్న క్యాడ్‌

Tuesday 4th December 2018

3 శాతానికి చేరుతుందని అంచనా న్యూఢిల్లీ: కరెంట్‌ అకౌంట్‌ లోటు (క్యాడ్‌) మూడవ త్రైమాసికంలో కట్టుతప్పే అవకాశం ఉందని క్రెడిట్‌ రేటింగ్‌ ఏజెన్సీ- ఇక్రా తన తాజా నివేదికలో అంచనా వేసింది. జూలై- సెప్టెంబర్‌ కాలంలో వచ్చిన స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) విలువలో క్యాడ్‌ 3 శాతానికి పెరిగే అవకాశం ఉందని ఇక్రా పేర్కొంది. ఏప్రిల్‌-జూన్‌ నెలలో క్యాడ్‌ 2.4 శాతంగా నమోదయ్యింది. మూడవ త్రైమాసికంలో అధికంగా ఉన్న క్రూడ్‌ ధరలు,

నవంబర్‌లో తయారీరంగం మెరుపులు

Tuesday 4th December 2018

- 11 నెలల గరిష్టస్థాయి న్యూఢిల్లీ: తయారీ రంగం నవంబర్‌లో 11 నెలల గరిష్ట స్థాయిని నమోదుచేసుకుంది. నికాయ్‌ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్‌ పర్చేజింగ్‌ మేనేజర్స్‌ ఇండెక్స్‌ ఈ నెల్లో 54 కు చేరింది. అక్టోబర్‌ నెలలో ఇది 53.1. పటిష్ట డిమాండ్‌ పరిస్థితులు, కొత్త ఆర్డర్లు బాగుండడం వంటి అంశాలు తయారీ రంగం ఉత్పిత్తి పెరగడానికి కారణాలని నికాయ్‌ ఇండియా నెలవారీ సర్వే తెలిపింది. దాదాపు ఏడాది కాలంలో ఇంతస్థాయిలో పురోగతి

Most from this category