News


నిబంధనలను అతిక్రమించిన ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ ఫైనాన్స్‌

Saturday 3rd November 2018
news_main1541231730.png-21686

ముంబై: ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ అనుబంధ కంపెనీ ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌... ఆర్‌బీఐ నిబంధనలను తుంగలో తొక్కినట్టు కొత్త బోర్డు పరిశీలనలో వెలుగు చూసింది. కంపెనీ చెల్లించాల్సిన రుణాలు, గ్రూపులోని ఇతర కంపెనీల్లో పెట్టుబడులు 2017-18తో ముగిసిన చివరి మూడు ఆర్థిక సంవత్సరాల్లో ఆర్‌బీఐ అనుమతించిన పరిమితుల కంటే ఎక్కువ ఉ‍న్నట్టు వెల్లడైంది. ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ సంక్షోభం తర్వాత లిక్విడిటీ సమస్య ఏర్పడడంతో, ఎన్‌బీఎఫ్‌సీల కోసం ప్రత్యేకంగా లిక్విడిటీ విండో ప్రారంభించాలని కేంద్రం చేసిన విజ్ఞప్తిని ఆర్‌బీఐ తోసిపుచ్చిన విషయం తెలిసిందే. ఈ సమయంలో నిబంధనల ఉల్లంఘనను ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ కొత్త బోర్డు గుర్తించడం గమనార్హం. ‘‘ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌కు సంబంధించి గత మూడు ఆర్థిక సంవత్సరాల ఆర్థిక నివేదికలు, రికార్డులను ప్రాథమికంగా పరిశీలించిన తర్వాత, చెల్లించాల్సిన రుణాలు, గ్రూపు కంపెనీల పెట్టుబడులు 2015-16లో రూ.5,728 కోట్లు, 2016-17లో రూ.5,127 కోట్లు, 2017-18లో రూ.5,490 కోట్ల మేర ఉన్నట్టు గుర్తించాం’’ అని ఉదయ్‌కోటక్‌ ఆధ్వర్యంలోని నూతన బోర్డు ఎన్‌సీఎల్‌టీకి తెలిపింది. ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం అనుమతించిన దాని కంటే ఇవి చాలా ఎక్కువని పేర్కొంది. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ గ్రూపు రుణ భారం రూ.94,000 కోట్లుగా ఉన్న విషయం తెలిసిందే. ఎన్‌బీఎఫ్‌సీ రంగానికి బ్యాంకులు రూ.4 లక్షల కోట్లకు పైగా రుణాలను ఇవ్వగా, ఇందులో 16 శాతం ఐఎల్‌ఎఫ్‌ఎస్‌కు సంబంధించినదేనని కూడా బోర్డు పరిశీలనతో తెలిసింది.



You may be interested

గ్రాన్యుల్స్ ఇండియా టార్గెట్‌ రూ.170

Saturday 3rd November 2018

కంపెనీ: గ్రాన్యుల్స్ ఇండియా లిమిటెడ్‌ సిఫార్సు: సెంట్రమ్‌ బ్రోకింగ్‌ లిమిటెడ్‌ ప్రస్తుత ధర: రూ.100 (నవంబర్‌ 3, 2018న) టార్గెట్‌ ధర: రూ.170 రెకమండేషన్‌: కొనొచ్చు 52 వారాల గరిష్ట, కనిష్ట ధర రూ.150 /71 గ్రాన్యుల్స్ ఇండియా లిమిటెడ్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జులై-సెప్టెంబర్‌తో ముగిసిన ద్వితీయ త్రైమాసిక(క్యూ2) ఫలితాలు తమ అంచనాలకు అనుగుణంగా ఉన్న నేపథ్యంలో ఈ కంపెనీ షేరుకు బై రేటింగ్‌ ఇచ్చినట్లు సెంట్రమ్‌ వెల్లడించింది. సెంట్రమ్‌ బ్రోకింగ్‌ లిమిటెడ్‌ రూపొందించిన రీసెర్చ్‌ రిపోర్ట్‌ను కింద

కొన్ని ప్రధాన కార్పోరేట్‌ కంపెనీల క్యూ2 ఫలితాలు

Saturday 3rd November 2018

హిందాల్కో లాభం రూ.725 కోట్లు హిందాల్కో నికర లాభం(కన్సాలిడేటెడ్‌) ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌ క్వార్టర్లో 54 శాతం పెరిగి రూ.725 కోట్లకు పెరిగింది. నిర్వహణ సామర్థ్యం బాగాఉండటం, మంచి రియలైజేషన్లు, తక్కువ వడ్డీ వ్యయాల కారణంగా నికర లాభం ఈ స్థాయిలో పెరిగిందని హిందాల్కో తెలిపింది. ఆదాయం 5 శాతం పెరిగి రూ.10,833 కోట్లకు చేరిందని పేర్కొంది. నిర్వహణ ఆదాయం 5 శాతం పెరిగి రూ.1,922 కోట్లకు పెరిగిందని తెలిపింది.

Most from this category