STOCKS

News


ఆస్తుల అమ్మక ప్రక్రియను ఆరంభించిన ఐఎల్‌ఎఫ్‌ఎస్‌

Tuesday 13th November 2018
news_main1542084448.png-21918

న్యూఢిల్లీ: భారీ రుణ సంక్షోభంలో చిక్కుకున్న ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ గ్రూపు,  ఆస్తుల అమ్మక ప్రక్రియను ఆరంభించింది. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ సెక్యూరిటీ సర్వీసెస్‌, ఐఎస్‌ఎస్‌ఎల్‌ సెటిల్‌మెంట్‌ అండ్‌ ట్రాన్సాక్షన్‌ సర్వీసెస్‌లో తనకున్న వాటాలను విక్రయించే ప్రక్రియను మొదలు పెట్టింది. ఆర్ప్‌వుడ్‌ క్యాపిటల్‌, జేఎం ఫైనాన్షియల్‌ సంస్థలను సలహాదారులగా నియమించుకుంది. ఈ మేరకు తాజా ప్రగతిపై కార్పొరేట్‌ వ్యవహారాల శాఖకు ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ నివేదికను సమర్పించింది. గ్రూపు సమస్యల పరిష్కారానికి ప్రతిపాదించిన వాటిల్లో ఆస్తుల విక్రయం ద్వారా నిధుల సమీకరణ కూడా ఒకటి. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ గ్రూపు సంస్థలన్నీ కలిపి రూ.94,215 కోట్ల రుణ భారాన్ని కలిగి ఉన్న విషయం గమనార్హం.



You may be interested

ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌కు రూ.6.4 కోట్ల నష్టం

Tuesday 13th November 2018

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: సెప్టెంబరు త్రైమాసికం స్టాండలోన్‌ ఫలితాల్లో ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌ (గతంలో గోల్డ్‌స్టోన్‌ ఇన్‌ఫ్రాటెక్‌) రూ.6.4 కోట్ల నష్టం చవిచూసింది. కిందటేడాది ఇదే కాలంలో కంపెనీ రూ.1.4 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. టర్నోవరు రూ.47 కోట్ల నుంచి రూ.71 కోట్లకు ఎగసింది. సోమవారం బీఎస్‌ఈలో కంపెనీ షేరు ధర క్రితంతో పోలిస్తే 2.87 శాతం పెరిగి రూ.251.25 వద్ద స్థిరపడింది.

లాభాల్లో ఆయిల్‌ రంగ షేర్లు

Tuesday 13th November 2018

ముంబై: ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీల షేర్లు మంగళవారం లాభాల్లో కొనసాగుతున్నాయి. ట్రేడింగ్‌ ప్రారంభంలో 4 శాతం వరకు ర్యాలీ చేశాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్‌ బ్రెంట్‌ ధర 69.47 డాలర్లకు తగ్గిపోవడం, డబ్ల్యూటీఐ క్రూడ్‌ 60 డాలర్ల దిగువకు పడిపోయిన నేపథ్యంలో ఈ రంగ షేర్లు జోరుమీద కొనసాగుతున్నాయి. ముడిచమురు ధరలు వరుసగా 11వ రోజు కూడా తగ్గుదలను నమోదుచేయడంతో హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్‌) షేరు ధర

Most from this category