News


ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ మాజీ డైరెక్టర్లపై మనీలాండరింగ్‌ ఆరోపణలు

Wednesday 6th March 2019
news_main1551851190.png-24449

న్యూఢిల్లీ: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ఇన్‌ఫ్రా రుణాల సంస్థ ఐఎల్‌అ౾ండ్‌ఎఫ్‌ఎస్‌ను చక్కదిద్దేందుకు ఏర్పాటైన కొత్త బోర్డు .. తాజాగా ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ ఫైనాన్షియల్ సర్వీసెస్ (ఐఫిన్‌)కి చెందిన 14 మంది మాజీ డైరెక్టర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. మనీలాండరింగ్‌కు సహకరించారని, నిబంధనలకు విరుద్ధంగా రుణాలు మంజూరు చేయడం ద్వారా కంపెనీకి తీవ్ర నష్టాలు తెచ్చిపెట్టారని ఫిబ్రవరి 27న జారీ చేసిన నోటీసుల్లో ఆరోపించింది. విధి నిర్వహణలో నిర్లక్ష్యం, కుట్ర, అనుచిత లబ్ధి పొందడం వంటి ఆరోపణలపై డిపార్ట్‌మెంట్‌పరంగా,నూ చట్టపరంగాను ఎందుకు చర్యలు చేపట్టకూడదో చెప్పాలంటూ ఆదేశించింది. నోటీసులు అందిన వారం రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని సూచించింది. అయితే, ఇప్పటిదాకా 14 మంది నుంచి ఎటువంటి వివరణా రాలేదని, దీంతో కేసులు నమోదు చేయడం సహా తదుపరి చర్యలు తీసుకునేందుకు బోర్డు సిద్ధమవుతోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. గ్రాంట్‌ థార్న్‌టన్ నిర్వహించిన ప్రత్యేక ఆడిట్‌లో రూ. 13,000 కోట్ల మేర ఆర్థిక అవకతవకలు జరిగాయని తేలడంతో కొత్త బోర్డు తాజా నోటీసులు జారీ చేసినట్లు పేర్కొన్నాయి. 24 అనుబంధ సంస్థలు, పరోక్షంగా 135 అనుబంధ సంస్థలు, ఆరు జాయింట్‌ వెంచర్స్‌ మొదలైనవి ఉన్న ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ గ్రూప్‌నకు ప్రస్తుతం రూ. 94,000 కోట్ల మేర రుణభారం ఉంది. పలు రుణాల చెల్లింపుల్లో డిఫాల్ట్ అవడంతో సంక్షోభం వెలుగులోకి వచ్చింది.



You may be interested

జెనీవా ఆటోషోలో ఎలక్ట్రిక్‌ కార్ల సందడి

Wednesday 6th March 2019

ఎలక్ట్రిక్ హైపర్‌ కార్ బటిస్టా  జెనీవా: ఇక్కడ జరుగుతున్న 89వ జెనీవా అంతర్జాతీయ మోటార్ షోలో భారత కంపెనీల ఎలక్ట్రిక్ కార్లు సందడి చేస్తున్నాయి. మహీంద్రా గ్రూప్‌ తన ఎలక్ట్రిక్ హైపర్‌ కార్ బటిస్టాను ఆటోషోలో మంగళవారం ఆవిష్కరించింది. కేవలం రెండు సెకన్లలోనే సున్నా నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగల ఈకారు గరిష్టంగా 350 కి.మీటర్ల వేగంతో ప్రయాణించగలదు. ఫార్మలా రేస్‌ వన్‌ కారు కంటే వేగమైన ఈకారు ఉత్పత్తి

హైదరాబాద్‌లో ఓలెక్ట్రా బస్‌ ప్లాంటు

Wednesday 6th March 2019

హైదరాబాద్‌లో ఓలెక్ట్రా బస్‌ ప్లాంటు 300 ఎకరాలు, రూ.300 కోట్ల పెట్టుబడి ప్లాంటు ద్వారా 7,500 మందికి ఉపాధి శంషాబాద్‌కు ప్రారంభమైన ఈ-బస్‌లు హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: ఎలక్ట్రిక్‌ బస్‌ల తయారీలో ఉన్న ఓలెక్ట్రా గ్రీన్‌టెక్‌ హైదరాబాద్‌ సమీపంలోని శంషాబాద్‌ వద్ద అంతర్జాతీయ స్థాయిలో కొత్త ప్లాంటును ఏర్పాటు చేయనుంది. ఇప్పటికే సంస్థకు జడ్చర్ల వద్ద తయారీ కేంద్రం ఉంది. ప్రతిపాదిత నూతన ప్లాంటు కోసం తెలంగాణ ప్రభుత్వం 300 ఎకరాల స్థలాన్ని మంజూరు చేసింది.

Most from this category