STOCKS

News


వెల్‌కమ్‌ టు ఐకియా..

Thursday 9th August 2018
news_main1533791354.png-19065

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: స్వీడన్‌కు చెందిన అంతర్జాతీయ ఫర్నిచర్‌ దిగ్గజం ఐకియా... ఇండియాలో తన తొలి స్టోర్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిసింది. గురువారం ఈ స్టోర్‌ ప్రారంభం కానుంది. హైటెక్‌ సిటీకి చేరువలో మైండ్‌స్పేస్‌కు ఎదురుగా రూ.1,000 కోట్ల వ్యయంతో 4,00,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో దీనిని ఏర్పాటు చేశారు. ఒకేసారి వెయ్యి మంది కూర్చునే సామర్థ్యం ఉన్న రెస్టారెంట్‌ను కూడా ఐకియా ఈ స్టోర్‌లో ఏర్పాటు చేసింది. 7,500 రకాల ఫర్నిచర్‌, ఫర్నిషింగ్‌, వంటింటి సామగ్రిని ఇక్కడ విక్రయిస్తారు. దాదాపు 1,000 రకాల ఉత్పత్తుల ధర రూ.200 లోపే ఉండటం గమనార్హం. ప్రత్యక్షంగా ఈ స్టోర్‌లో 950 మంది పనిచేస్తున్నారు. ఐకియా పాలసీ ప్రకారం వీరిలో సగం మంది మహిళలున్నారని ఐకియా రిటైల్‌ ఇండియా సీఈవో పీటర్‌ బెజెల్‌ బుధవారమిక్కడ మీడియాకు వెల్లడించారు. హైదరాబాద్‌ స్టోర్‌ ద్వారా పరోక్షంగా 1,500 మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు. 
భారత్‌లో 40 నగరాల్లో..
దేశంలో 40 నగరాల్లో ఔట్‌లెట్లను ఏర్పాటు చేయాలన్నది ఐకియా ప్రణాళిక. 2025 నాటికి 25కు పైగా సెంటర్లు ప్రారంభించేందుకు కసరత్తు చేస్తోంది. ఇప్పటి వరకు భారత్‌లో కంపెనీ సుమారు రూ.5,000 కోట్లకు పైగా ఖర్చు చేసింది. ముంబై స్టోర్‌ 2019 వేసవిలో అందుబాటులోకి రానుంది. ఆ తర్వాత బెంగళూరు, గుర్‌గామ్‌లో సైతం ఐకియా కేంద్రాలు రానున్నాయి. అహ్మదాబాద్‌, పుణే, చెన్నై, కోల్‌కత, సూరత్‌లోనూ ఏర్పాటు చేస్తామని ఐకియా గ్రూప్‌ సీఈవో జాస్పర్‌ బ్రాడిన్‌ తెలిపారు. 20 కోట్ల మంది కస్టమర్లను మూడేళ్లలో చేరుకోవాలన్నది సంస్థ లక్ష్యం. 
పన్నులు సరికాదు..
దిగుమతి చేసుకునే ఫర్నీచర్‌పై అధిక పన్నులకు బదులు దేశీయంగా తయారీని ప్రోత్సహించాలని ఐకియా గ్రూప్‌ సీఈవో జాస్పర్‌ బ్రాడిన్‌ సూచించారు. ‘ఎక్కువ పన్నులతో కస్టమర్లకే భారం. దీనివల్ల తయారీ మెరుగుపడదు. ఇక భారత్‌లో స్థలం కొనుగోలు, హక్కుల బదిలీ క్లిష్టమైన ప్రక్రియ. అందుకే ఇక్కడ స్టోర్ల ప్రారంభం ఆలస్యం అయింది. రిటైల్‌ రంగంలో తరచూ మారే విధానపర నిర్ణయాలు ఆందోళన కలిగించే విషయం. పాలసీలు ఆకట్టకునేలా  ఉండాలి. దీర్ఘకాలిక వ్యూహంతోనే ఇక్కడ అడుగుపెట్టాం’ అని వివరించారు.You may be interested

పోస్ట్‌ పేమెంట్స్‌ బ్యాంకు నుంచి రుణాలు

Thursday 9th August 2018

న్యూఢిల్లీ: ఇండియా పోస్ట్‌ పేమెంట్స్‌ బ్యాంకు పలు బ్యాంకులు, ఆర్థిక సంస్థలతో జట్టు కట్టడం ద్వారా రుణాలు, మ్యూచువల్‌ ఫండ్లు, బీమా పాలసీలు తదితర ఆర్థిక ఉత్పత్తులను అందించేందుకు సన్నద్ధమవుతోంది. థర్డ్‌ పార్టీ టై అప్‌ ద్వారా పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు తరఫున రుణాలును ఆఫర్‌ చేయనుంది. అలాగే, బీమా ఉత్పత్తులను అందించేందుకు బజాజ్‌ అలియంజ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్టు అధికార వర్గాలు తెలియజేశాయి. ఈ నెల 21న ప్రధాన మంత్రి

ఆర్‌బీఐ డైరెక్టర్‌గా స్వామినాథన్ గురుమూర్తి

Thursday 9th August 2018

న్యూఢిల్లీ: చార్టర్డ్ అకౌంటెంట్ స్వామినాథన్ గురుమూర్తిని రిజర్వ్ బ్యాంక్ బోర్డులో డైరెక్టరుగా కేంద్ర ప్రభుత్వం నియమించింది. నాలుగేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్‌)లో భాగమైన స్వదేశీ జాగరణ్ మంచ్‌తో ఆయనకు అనుబంధముంది. డీమోనిటైజేషన్‌ను గట్టిగా సమర్ధించిన వారిలో ఆయన కూడా ఒకరు. తమిళ పత్రిక తుగ్లక్‌కు గురుమూర్తి ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. "నా అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తీకరించగలగాలన్న ఉద్దేశంతోనే నేనెప్పుడూ ఏ ప్రైవేట్

Most from this category