STOCKS

News


వెల్త్‌ అడ్వైజర్స్‌ను కొనుగోలు చేస్తున్న ఐఐఎఫ్‌ఎల్‌

Wednesday 17th October 2018
news_main1539750151.png-21223

ముంబై: చెన్నై కేంద్రంగా పెట్టుబడి సలహా, సేవలు అందించే ‘వెల్త్‌ అడ్వైజర్స్‌’ను ఐఐఎఫ్‌ఎల్‌ వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ కొనుగోలు చేయనుంది. ఇందుకు రూ.235 కోట్లు వెచ్చించనున్నట్టు కంపెనీ ప్రకటించింది. ఈ కొనుగోలుతో దక్షిణాదిన విస్తరించేందుకు ఐఐఎఫ్‌ఎల్‌ వెల్త్‌ మేనేజ్‌మెంట్‌కు వీలు కలుగుతుంది. ‘‘ఈ కొనుగోలు ద్వారా విక్రయాలు, ఇతర విభాగాల్లో ప్రతిభావంతులైన సిబ్బంది మాకు అందుబాటులోకి వస్తారు. దీనికి తోడు మా ఉమ్మడి కృషితో హై నెట్‌ వర్త్‌ (అధిక విలువ కలిగిన) ఇన్వెస్టర్లు,  అల్ట్రా హైనెట్‌వర్త్‌ ఇన్వెస్టర్లను చేరుకునేందుకు అవకాశం కలుగుతుంది’’ అని ఐఐఎఫ్‌ఎల్‌ వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ వ్యవస్థాపకుడు, ఎండీ, సీఈవో కరణ్‌ భగత్‌ తెలిపారు. పలు నియంత్రణ సంస్థల అనుమతులపై ఈ లావాదేవీ ఆధారపడి ఉంటుందని కంపెనీ తెలిపింది. చెన్నైకు చెందిన వెల్త్‌ అడ్వైజర్స్‌ సంస్థ స్థానిక మార్కెట్‌తోపాటు బెంగళూరు, కోయంబత్తూర్‌, ముంబై, పుణె నగరాల్లో సేవలు అందిస్తోంది. ఈ కొనుగోలు వల్ల ఐఐఎఫ్‌ఎల్‌ వెల్త్‌ మేనేజ్‌మెంట్‌కు నూతన విభాగాల్లో కొత్త క్లయింట్లు, ప్రతిభతో కూడిన నిర్వహణ, సేల్స్‌ బృందాలు, స్థిరమైన ఆదాయం వస్తాయని వెల్త్‌ అడ్వైజర్స్‌ వ్యవస్థాపక డైరెక్టర్‌ ప్రమోద్‌కుమార్‌ తెలిపారు. 



You may be interested

కేబుల్ సంస్థల్లో వాటాలపై రిలయన్స్ దృష్టి

Wednesday 17th October 2018

న్యూఢిల్లీ: కేబుల్ టీవీ, హై స్పీడ్‌ బ్రాడ్‌బ్యాండ్ సేవలను పెద్ద యెత్తున విస్తరించే క్రమంలో రిలయన్స్ ఇండస్ట్రీస్‌.. ఇప్పటికే ఆయా రంగాల్లో ఉన్న కంపెనీల్లో వాటాలు కొనుగోలు చేయడంపై దృష్టి పెట్టింది. డెన్‌ నెట్‌వర్క్స్‌, హాథ్‌వే కేబుల్‌ అండ్‌ డేటాకామ్ సంస్థల్లో గణనీయ వాటాలు కొనే దిశగా చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇవి తుది దశల్లో ఉన్నాయని, బుధవారం ఈ డీల్స్‌పై ప్రకటన వెలువడొచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. "హాథ్‌వే

అత్యుత్తమ కంపెనీ... ‘ఎల్‌ అండ్‌ టీ’

Wednesday 17th October 2018

ముంబై: ప్రపంచవ్యాప్తంగా ఉన్న 2,000 ‘బెస్ట్‌ గ్లోబల్‌ ఎంప్లాయర్స్‌’ కంపెనీల జాబితాను ఫోర్బ్స్‌ రూపొందించగా... దేశీ మౌలిక రంగ దిగ్గజం లార్సెన్ టూబ్రో (ఎల్ అండ్ టీ) ఈ జాబితాలో 22వ స్థానంలో నిలిచింది. 2018 ఏడాదికి రూపొందించిన జాబితాలో మొత్తం 4,30,000 కంపెనీలను పరిశీలించిన ఫోర్బ్స్.. వీటిలో అత్యంత ఉత్తమమైన ఎంప్లాయర్స్‌గా 2వేల కంపెనీలను ఎంపికచేసింది. ఈ జాబితాలో వందలోపు ర్యాంకులను పొందిన భారత కంపెనీలలో ఎల్ అండ్

Most from this category