కొత్త ఏడాది నుంచి ‘ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంకు’
By Sakshi

క్యాపిటల్ ఫస్ట్, ఐడీఎఫ్సీ బ్యాంకుల విలీనానంతరం ఏర్పడే ‘ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంకు’ వచ్చే జనవరి నుంచి కార్యకలాపాలకు సిద్ధమవుతోంది. అన్ని కీలక అనుమతులు వచ్చేశాయని, ఒక్క ఎన్సీఎల్టీ ఆమోదం కోసం చూస్తున్నామని, నెలలోపు అది కూడా రావచ్చని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు తెలిపాయి. రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ వద్ద పేరు మార్పునకు దరఖాస్తు చేయనున్నట్టు పేర్కొన్నాయి. విలీనం తర్వాత కొత్త బ్యాంకు కార్యకలాపాలు జనవరి నుంచి ఆరంభం అవుతాయని అంచనా వేస్తున్నట్టు చెప్పాయి. వాటాదారులు, రుణదాతలు ఇప్పటికే ఈ రెండు సంస్థల విలీనానికి ఓటేశారు. ‘ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంకు లిమిటెడ్’గా పేరు మార్పునకు ఆర్బీఐ నుంచి అక్టోబర్ 25నే అనుమతి కూడా లభించింది. ఉద్యోగుల విలీనం, టెక్నాలజీ, పునర్వ్యవస్థీకరణ ప్రక్రియలు కొనసాగుతున్నట్టు ఆ వర్గాలు తెలిపాయి. క్యాపిటల్ ఫస్ట్ విలీనం తర్వాత ఇప్పటికే ఆ సంస్థ కార్యకలాపాలు నిర్వహించే చోటుకు ఐడీఎఫ్సీ బ్యాంకు సేవలను తీసుకెళ్లడం వ్యూహంలో భాగం. క్యాపిటల్ ఫస్ట్ రిటైల్ నెట్‌వర్క్‌కు, ఐడీఎఫ్సీ హోల్‌సేల్ బ్యాంకింగ్ జోడించడం వల్ల కార్యకలాపాల విస్తరణకు మంచి అవకాశాలు లభిస్తాయని బ్యాంకు వర్గాలు భావిస్తున్నాయి. క్యాపిటల్ ఫస్ట్‌కు రూ.30,000 కోట్ల లోన్ బుక్ ఉంది. మొండి బకాయిలు తక్కువగా ఉండడం, రుణ సదుపాయాలు అంతగా అందుబాటులో లేని ప్రాంతాల్లోనూ క్యాపిటల్ ఫస్ట్ సేవలు విస్తరించడం సానుకూలతలు. అలాగే, ఐడీఎఫ్సీ వద్ద ఎన్నో బ్యాంకింగ్ ఉత్పత్తులు ఉన్నాయి. విలీనంలో భాగంగా ఐడీఎఫ్సీ బ్యాంకులో క్యాపిటల్ ఫస్ట్తోపాటు దాని అనుబంధ సంస్థలైన క్యాపిటల్ ఫస్ట్ హోమ్ ఫైనాన్స్, క్యాపిటల్ ఫస్ట్ సెక్యూరిటీస్ వచ్చి చేరతాయి. ఇప్పటి వరకు క్యాపిటల్ ఫస్ట్‌కు ఎండీ, చైర్మన్‌గా ఉన్న వి. వైద్యనాథన్ కొత్త బ్యాంకుకు ఎండీ, సీఈవోగా వ్యవహరిస్తారు. ఇప్పటి వరకు ఐడీఎఫ్సీ బ్యాంకుకు సీఈవో, ఎండీగా ఉన్న రాజీవ్‌లాల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ బాధ్యతల్లోకి మారిపోతారు.
You may be interested
నిజానికి మీకెంత బీమా అవసరం?
Thursday 15th November 2018రూ.కోటి రూపాయల లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజీ ఎక్కువలో ఎక్కువ? అన్నది చాలా మంది అభిప్రాయం. ఎందుకంటే రూ.కోటి అన్నది చాలా మంది వార్షిక వేతనానికి ఎన్నో రెట్లు అధికం. ఆర్జించే వ్యక్తికి ప్రాణాపాయం ఎదురైతే అతనిపై ఆధారపడిన వారిని ఆదుకునేందుకు తగినంత బీమా కవరేజీ ఉండడం ప్రతి ఒక్కరికీ అవసరం. అతను లేదా ఆమె లేకపోయినా వారిని నమ్ముకుని ఉన్న కుటుంబ అవసరాలు, లక్ష్యాలకు ఆర్థిక అవరోధాలు ఎదురు కాకుండా
ఉజ్జీవన్ ఫైనాన్షియల్ 10 శాతం అప్
Thursday 15th November 2018ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సర రెండో త్రైమాసిక ఫలితాలు ఆశాజనకంగా ఉన్న నేపథ్యంలో ఉజ్జీవన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ షేరు గురువారం ఇంట్రాడేలో 10 శాతం మేర లాభాలను నమోదుచేసింది. ఉదయం సెషన్లో 9.6 శాతం లాభపడి రూ.238.6 వద్దకు చేరుకుంది. మార్కెట్ ముగింపు సమయానికి ఎన్ఎస్ఈలో 8 శాతం లాభపడి రూ.234.90 వద్ద ముగిసింది. క్యూ2లో కంపెనీ నికర లాభం రూ.44.3 కోట్లుకు చేరుకుందని బుధవారం మార్కెట్ ట్రేడింగ్ ముగిసిన