STOCKS

News


ఐడీఎఫ్‌సీ బ్యాంక్‌ పేరు మారుతోంది

Saturday 1st December 2018
news_main1543643742.png-22545

న్యూఢిల్లీ: ఐడీఎఫ్‌సీ బ్యాంక్‌ పేరు మారనుంది. తన పేరును ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌గా మార్చుకోవడానికి వాటాదారుల ఆమోదాన్ని ఈ బ్యాంక్‌ కోరనుంది. ఈ పేరు మార్పు ప్రతిపాదనకు ఐడీఎఫ్‌సీ బ్యాంక్‌ వాటాదారులు డిసెంబరు 4 నుంచి జనవరి 2 మధ్య ఓటేయవచ్చు. 
క్యాపిటల్‌ ఫస్ట్‌, క్యాపిటల్‌ ఫస్ట్‌ హోమ్‌ ఫైనాన్స్‌, క్యాపిటల్‌ ఫస్ట్‌ సెక్యూరిటీస్‌ సంస్థలు ఐడీఎఫ్‌సీ బ్యాంక్‌లో విలీనం కానుండటంతో బ్యాంకు ఈ పేరు మార్పు ప్రతిపాదనను చేసింది. ఈ విలీనానికి ఇప్పటికే నేషనల్‌ హౌసింగ్‌ బ్యాంక్‌, సీసీఐ, బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ, ఆర్‌బీఐ, ఈ కంపెనీల వాటాదారులు, రుణ దాతలు ఆమోదం తెలిపారు. క్యాపిటల్‌ ఫస్ట్‌, ఐడీబీఐ బ్యాంక్‌ల విలీనం కారణంగా రూ.88,000 కోట్ల విలువైన సంస్థ ఏర్పడనుంది. ఈ డీల్‌ మొత్తం షేర్ల పరంగానే జరగనుంది. ఈ విలీనానికి షేర్‌ స్వాప్‌ నిష్పత్తిని 139: 10గా కంపెనీ నిర్ణయించింది. అంటే ప్రతి పది క్యాపిటల్‌ ఫస్ట్‌ షేర్లకు గాను 139 ఐడీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్లను ఐడీఎఫ్‌సీ బ్యాంక్‌ జారీ చేస్తుంది. ఈ వార్తల నేపథ్యంలో ఈ రెండు షేర్లు స్వల్ప లాభాల్లో ముగిశాయి. బీఎస్‌ఈలో ఐడీఎఫ్‌సీ బ్యాంక్‌ 0.1 శాతం లాభంతో రూ.38.4 వద్ద, క్యాపిటల్‌ ఫస్ట్‌ షేర్‌ 0.22 శాతం లాభంతో రూ.525 వద్ద ముగిశాయి. 



You may be interested

జేఎల్‌ఆర్‌లో ఉద్యోగాల కోత

Saturday 1st December 2018

న్యూఢిల్లీ: దేశీ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటర్స్‌లో భాగమైన జాగ్వార్ ల్యాండ్‌ రోవర్‌ (జేఎల్‌ఆర్‌) .. ఉత్పత్తి కార్యకలాపాల క్రమబద్ధీకరణపై దృష్టి పెట్టింది. దీంతో సెంట్రల్ ఇంగ్లండ్‌లోని వోల్వర్‌హాంప్టన్‌ ప్లాంటులో సుమారు 250 మంది తాత్కాలిక ఉద్యోగులను తొలగించనుంది. డిసెంబర్‌లో రెండు వారాల పాటు ఈ ప్లాంటులో ఉత్పత్తిని నిలిపివేయనున్నట్లు కూడా జేఎల్‌ఆర్‌ తెలిపింది. దీంతో 500 మంది ఉద్యోగులు రోజువారీ విధులకు హాజరు కానక్కర్లేదని, అయితే ఈ వ్యవధిలో

అక్రమార్కులకు వ్యతిరేకంగానే నోట్లరద్దు

Saturday 1st December 2018

న్యూఢిల్లీ: నోట్ల రద్దు (డీమోనిటైజేషన్‌) నిర్ణయం అవినీతిపై పోరాటంలో భాగంగా తీసుకున్నదే కానీ, మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్‌ సుబ్రమణ్యం చెప్పినట్టు ఉన్నత వర్గాలకు వ్యతిరేకంగా కాదని నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌ రాజీవ్‌కుమార్‌ స్పష్టం చేశారు. ‘మోదీ- జైట్లీ ఆర్థిక విధానంతో సవాళ్లు’ పేరిట సుబ్రమణ్యం తాజాగా రాసిన పుస్తకంలో డీమోనిటైజేషన్‌ను దారుణమైన నిర్ణయంగా అభివర్ణించిన విషయం తెలిసిందే. ఈ పుస్తకం త్వరలోనే విడుదల కానుంది. సీఐఐ

Most from this category