STOCKS

News


ఐడీఎఫ్‌సీ బ్యాంక్‌ నష్టాలు రూ.370 కోట్లు

Thursday 25th October 2018
news_main1540446248.png-21473

న్యూఢిల్లీ: ప్రైవేట్‌ రంగ ఐడీఎఫ్‌సీ బ్యాంక్‌కు ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో రూ.370 కోట్ల నికర నష్టాలు వచ్చాయి. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో రూ.234 కోట్ల నికర లాభం వచ్చిందని ఐడీఎఫ్‌సీ బ్యాంక్‌ తెలిపింది. మొండి బకాయిలు తగ్గినా, కేటాయింపులు పెరగడంతో ఈ క్యూ2లో భారీగా నష్టాలు వచ్చాయని వివరించింది. 
తగ్గిన మొండి బకాయిలు...
గత క్యూ2లో రూ.2,365 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ2లో రూ.2,453 కోట్లకు పెరిగిందని ఐడీఎఫ్‌సీ బ్యాంక్‌ తెలిపింది. రుణ నాణ్యత మెరుగుపడిందని పేర్కొంది. గత క్యూ2లో 3.92 శాతంగా ఉన్న స్థూల మొండి బకాయిలు 1.63 శాతానికి తగ్గాయని తెలిపింది. అలాగే నికర మొండి బకాయిలు 1.61 శాతం నుంచి 0.59 శాతానికి తగ్గాయని వివరించింది. అంకెల పరంగా చూస్తే, స్థూల మొండి బకాయిలు రూ.2,002 కోట్ల నుంచి రూ.895 కోట్లకు, నికర మొండి బకాయిలు  రూ.805 కోట్ల నుంచి రూ.321 కోట్లకు తగ్గాయని తెలిపింది. మొండి బకాయిలు తగ్గినా,  కేటాయింపులు మాత్రం రూ.601 కోట్లకు పెంచామని పేర్కొంది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో ఐడీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్‌ 2.3 శాతం లాభంతో రూ.35.20 వద్ద ముగిసింది. 



You may be interested

అనలిస్టుల టాప్‌ ట్రేడింగ్‌ ఐడియాలు

Thursday 25th October 2018

స్వల్పకాలానికి ప్రముఖ అనలిస్టులు కొన్ని స్టాక్‌ సిఫార్సులు అందిస్తున్నారు. అశ్విన్‌గుజ్రాల్‌ రికమండేషన్లు: 1. హెచ్‌డీఎఫ్‌సీ: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 1765. స్టాప్‌లాస్‌ రూ. 1730 2. బజాజ్‌ ఫైనాన్స్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 2340. స్టాప్‌లాస్‌ రూ. 2295.  3. ఎంఅండ్‌ఎం ఫిన్‌సర్వ్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 420. స్టాప్‌లాస్‌ రూ. 395. 4. బజాజ్‌ ఆటో: అమ్మొచ్చు. టార్గెట్‌ రూ. 2380. స్టాప్‌లాస్‌ రూ. 2500. 5. అంబుజా సిమెంట్‌: అమ్మొచ్చు. టార్గెట్‌ రూ. 188. స్టాప్‌లాస్‌

‘దిద్దుబాటు చర్యల’ మార్గదర్శకాల్లో మార్పులు!

Thursday 25th October 2018

న్యూఢిల్లీ: ఆర్థికంగా బలహీనంగా ఉన్న బ్యాంకులను చక్కదిద్దడానికి ఉద్దేశించిన ‘దిద్దుబాటు చర్యల’ (పీసీఏ) మార్గదర్శకాల్లో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) కొన్ని మార్పులు చేసే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం... ఇప్పటి వరకూ తీసుకున్న చర్యలు, వాటి ఫలితాలను సమీక్షించిన అనంతరం, బ్యాంకింగ్‌ విస్తృత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ చర్యలు ఉంటాయి. కొద్ది వారాల్లో ఇందుకు సంబంధించి

Most from this category