STOCKS

News


మ్యాక్స్‌ బూపాతో చేయి కలిపిన ఐడీబీఐ బ్యాంకు

Tuesday 11th June 2019
news_main1560229327.png-26222

హైదరాబాద్‌: ఐడీబీఐ బ్యాంకు, మ్యాక్స్‌ బూపా కార్పొరేట్‌ ఏజెన్సీ ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా ఐడీబీఐ ఖాతాదారులకు సమగ్ర ఆరోగ్య బీమా ఉత్పత్తులను మ్యాక్స్‌ బూపా ఆఫర్‌ చేస్తుంది. ఐడీబీఐ బ్యాంకుకు దేశవ్యాప్తంగా 1,800 శాఖలతోపాటు 2 కోట్ల ఖాతాదారులున్నారు. ఐడీబీఐ బ్యాంకు ఎండీ, సీఈవో రాకేశ్‌ శర్మ మాట్లాడుతూ... ఖాతాదారుల అవసరాలను గుర్తించడంతోపాటు వారికి అనువైన ఆర్థిక ఉత్పత్తులను అందిస్తుంటామని, ఇందులో భాగమే మ్యాక్స్‌ బూపాతో ఒప్పందమని పేర్కొన్నారు. ఈ ఒప్పందం వల్ల తమ కస్టమర్లకు డిజిటల్‌ రూపంలో హెల్త్‌ ఇన్సూరెన్స్‌ పాలసీను అందించడం వీలవుతుందన్నారు. 



You may be interested

బ్యాంకులపై ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ ధిక్కరణ పిటిషన్‌

Tuesday 11th June 2019

దాఖలు చేసే అవకాశం న్యూఢిల్లీ: తాతాల్కిక నిషేధ సమయంలో కంపెనీ ఎస్క్రో ఖాతాలో ఉన్న రూ.800 కోట్లను అక్రమంగా ఉపసంహరించుకున్నందుకు 11 బ్యాంకులు, ఫైనాన్షియల్‌ సంస్థలకు వ్యతిరేకంగా ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ ఎన్‌సీఎల్‌టీ ముందు ధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేస్తోంది. రూ.800 కోట్లను ఖాళీ చేసేసిన సంస్థల్లో ఎస్‌బీఐ, బ్యాంకు ఆఫ్‌ బరోడా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, యస్‌ బ్యాంకు, పీఎన్‌బీ, ఇండియన్‌ బ్యాంకు, ఫెడరల్‌ బ్యాంకు, బిర్లా సన్‌లైఫ్‌ ఏఎంసీ, ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్‌

అలాగైతే ‘షాక్‌’ తప్పదు

Tuesday 11th June 2019

‘ఎలక్ట్రిక్‌’ను బలవంతంగా రుద్దకూడదు వినియోగదారుల సహకారం అవసరం చార్జింగ్‌ వంటి మౌలిక సదుపాయాలుండాలి వాహన పరిశ్రమ స్పందన న్యూఢిల్లీ: దేశంలో ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగానికి సంబంధించి తగిన ప్రణాళికను రూపొందించాలని ప్రభుత్వానికి సియామ్‌ (సొసైటీ ఆఫ్‌ ఇండియన్‌ ఆటోమొబైల్‌ మాన్యుఫాక్చరర్స్‌) సూచించింది. ఈ ప్రణాళిక అదరాబాదరగా కాకుండా, వాస్తవిక పరిస్థితులను ప్రతిబింబించేలా ఉండాలని పేర్కొంది.  ఐసీఈ అమ్మకాలపై నిషేధం... టూ, త్రీ వీలర్లలో ఉపయోగించే ఇంటర్నల్‌ కంబశ్చన్‌ ఇంజిన్‌ల (ఐసీఈ) అమ్మకాలను 2025 కల్లా నిషేధించాలని ప్రభుత్వం యోచిస్తోందన్న

Most from this category