ఐడీబీఐ బ్యాంక్ రుణాలపై వడ్డీ రేట్ల పెంపు
By Sakshi

ముంబై: ప్రభుత్వ రంగ ఐడీబీఐ బ్యాంకు రుణాలపై వడ్డీ రేట్లను 5-10 బేసిస్ పాయింట్ల మేర పెంచింది. జూలై 12 నుంచి కొత్త రేట్లు అమలవుతాయని బ్యాంకు ఒక ప్రకటనలో పేర్కొంది. దీని ప్రకారం.. ఏడాది వ్యవధి రుణాలపై మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ ఆధారిత రుణ రేటు (ఎంసీఎల్ఆర్) పది బేసిస్ పాయింట్లు పెరిగి 8.65 శాతం నుంచి 8.75 శాతానికి చేరింది. ఆరు నెలల ఎంసీఎల్ఆర్ అయిదు బేసిస్ పాయింట్లు పెరిగి 8.45 శాతం నుంచి 8.50 శాతంగా ఉంటుంది. మూడు నెలలు, మూడేళ్ల వ్యవధి రుణాలపై వడ్డీ రేట్లు యథాతథంగా 8.35 శాతం, 8.80 శాతంగానే ఉంటాయని బ్యాంకు తెలిపింది. బేస్ రేటును 9.5 శాతం నుంచి 9.6 శాతానికి పెంచినట్లు పేర్కొంది.
You may be interested
ఎంసీఎక్స్ ట్రేడింగ్‌లో స్వల్ప అంతరాయం
Wednesday 11th July 2018న్యూఢిల్లీ: ప్రముఖ కమోడిటీ ఎక్స్చేంజ్, ఎమ్‌సీఎక్స్‌లో ఉదయం ట్రేడింగ్ దాదాపు గంట పాటు నిలిచిపోయింది. సాంకేతిక కారణాల వల్ల ట్రేడింగ్ నిలిచిపోయిందని, దీనికి గల కారణాలపై విచారణ నిర్వహిస్తున్నామని ఎంసీఎక్స్ తెలిపింది. ఉదయం గం.11.46 ని. సమయానికి ట్రేడింగ్ సిస్టమ్‌లో సాంకేతిక సమస్య ఎదురైందని ఎమ్‌సీఎక్స్ తెలిపింది. దీంతో ట్రేడింగ్ సిస్టమ్‌ను మళ్లీ ప్రారంభించామని, సభ్యులు కూడా రీ-లాగిన్ అయ్యారని వివరించింది. 12.40 నుంచి 12.55 వరకూ ఒక ప్రత్యేక సెషన్లో
విజయవాడలో ఉబర్ ఈట్స్
Wednesday 11th July 2018హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫుడ్ డెలివరీ కంపెనీ ఉబర్ ఈట్స్ విజయవాడలో సేవలను ప్రారంభించింది. ప్యారడైజ్, క్రీమ్‌స్టోన్, డ్రన్కీన్ మంకీ, సెవెన్ డేస్, సదరన్ స్పైస్ వంటి స్థానిక రెస్టారెంట్లతో ఉబర్ ఈట్స్ ఒప్పందం చేసుకుంది. ఉబర్ రైడ్స్ కంటే ముందు ఉబర్ ఈట్స్ సేవలను ప్రారంభించిన తొలి నగరం విజయవాడేనని ఉబర్ ఈట్స్ హెడ్ భావిక్ రాథోడ్ ఒక ప్రకటనలో తెలిపారు. తొలి ఐదు ఆర్డర్లకు 50 శాతం