STOCKS

News


మూడింతలైన ఐడీబీఐ బ్యాంక్‌ నష్టాలు

Tuesday 5th February 2019
news_main1549347122.png-24020

  • ఈ క్యూ3లో రూ.4,185 కోట్ల నష్టాలు
  • 19 శాతం తగ్గిన నికర వడ్డీ ఆదాయం
  • పెరిగిన మొండి రికవరీలు

న్యూఢిల్లీ: ఐడీబీఐ బ్యాంక్‌ నష్టాలు ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో మూడు రెట్లు పెరిగాయి. గత క్యూ3లో  రూ.1,524 కోట్లుగా ఉన్న నికర నష్టాలు ఈ క్యూ3లో రూ.4,185 కోట్లకు పెరిగాయని ఐడీబీఐ బ్యాంక్‌ తెలిపింది. కేటాయింపులు అధికంగా ఉండడం, నికర వడ్డీ ఆదాయం తక్కువగా ఉండటం, నిర్వహణ ఆదాయం కూడా తక్కువగా ఉండటంతో ఈ స్థాయిలో నికర నష్టాలు వచ్చాయని వెల్లడించింది. మొత్తం ఆదాయం రూ.7,125 కోట్ల నుంచి రూ.6,191 కోట్లకు తగ్గిందని పేర్కొంది. నికర వడ్డీ ఆదాయం 19 శాతం క్షీణించి రూ.1,357 కోట్లకు తగ్గగా, ఇతర ఆదాయం 47 శాతం క్షీణించి రూ.698 కోట్లకు పరిమితమైందని, నిర్వహణ లాభం 62 శాతం తగ్గి రూ.725 కోట్లకు చేరిందని వివరించింది.
మిశ్రమంగా రుణ నాణ్యత
బ్యాంక్‌ రుణ నాణ్యత మిశ్రమంగా నమోదైంది. గత క్యూ3లో 24.72 శాతంగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ క్యూ3లో 29.67 శాతానికి పెరిగాయి. నికర మొండి బకాయిలు మాత్రం 16.02 శాతం నుంచి 14.01 శాతానికి తగ్గాయి. మొండి బకాయిలకు కేటాయింపులు పెంచామని, గత క్యూ3లో రూ.3,650 కోట్లుగా ఉన్న ఈ కేటాయింపులు ఈ క్యూ3లో రూ.5,075 కోట్లకు పెరిగాయని పేర్కొంది. తాజా మొండి బకాయిలు మాత్రం ఏడు క్వార్టర్ల కనిష్ట స్థాయికి, రూ.2,211 కోట్లకు తగ్గాయని తెలిపింది. మొండి బకాయిల రికవరీ మెరుగుపడుతోందని, గత క్యూ3లో రూ.537 కోట్లుగా ఉన్న రికవరీలు ఈ క్యూ3లో రూ.3,440 కోట్లకు పెరిగాయని వివరించింది.
ఎల్‌ఐసీ నుంచి రూ.21,624 కోట్ల నిధులు..
బ్యాంకు పగ్గాలు కేంద్రం నుంచి ఎల్‌ఐసీ చేతుల్లోకి వచ్చినట్లు ఐడీబీఐ బ్యాంక్‌ తెలిపింది. తమ బ్యాంక్‌లో 51 శాతం వాటాను ఎల్‌ఐసీ కొనుగోలు చేసిందని, ఈ వాటా కొనుగోలు గత నెల 21న పూర్తయిందని పేర్కొంది.ఎల్‌ఐసీ నుంచి మొత్తం మీద రూ.21,624 కోట్ల పెట్టుబడులు వచ్చాయని వివరించింది. ఈ నిధులతో తమ టైర్‌-వన్‌ మూలధనం 6.62 శాతం నుంచి 9.32 శాతానికి పెరిగిందని బ్యాంక్‌ వెల్లడించింది.



You may be interested

వ్యూహాత్మక భాగస్వామి కోసం చూస్తున్నాం

Tuesday 5th February 2019

  -డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ ప్రకటన -ఐదు రోజుల పతనం అనంతరం కోలుకున్న షేరు ముంబై: కోబ్రోపోస్ట్‌ కథనంలో కుదేలైన డీహెచ్‌ఎఫ్‌ఎల్‌... వ్యూహాత్మక భాగస్వామి కోసం చూస్తోంది. పటిష్టమైన వ్యూహాత్మక భాగస్వామి కోసం చూస్తున్నామని డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ సీఎమ్‌డీ కపిల్‌ వాధ్వాన్‌ పేర్కొన్నారు. తాజాగా మరిన్ని పెట్టుబడులు పెట్టే, తమ వ్యాపారాలపై ముసురుకున్న ఆందోళనలను పొగొట్టే బలమైన భాగస్వామిని అన్వేషిస్తున్నామని విశ్లేషకులతో జరిపిన కాన్ఫరెన్స్‌ కాల్‌లో ఆయన వివరించారు. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ లిక్విడిటీ సమస్యతో గత ఏడాది సెప్టెంబర్‌ నుంచి

రెనో క్విడ్‌ @ రూ.2.67 లక్షలు

Tuesday 5th February 2019

న్యూఢిల్లీ: ఫ్రెంచ్‌ ఆటో దిగ్గజం రెనో..  తన ఎంట్రీ లెవల్‌ కారు ‘క్విడ్’ను మరిన్ని భద్రతా ఫీచర్లతో సోమవారం భారత మార్కెట్లో  ప్రవేశపెట్టింది. ఈ నూతన వేరియంట్‌ ధరల శ్రేణి రూ.2.67 లక్షల నుంచి రూ.4.63 లక్షలుగా ప్రకటించింది. కొత్త క్విడ్‌.. 0.8 లీటర్, 1 లీటరు పెట్రోల్ ఇంజిన్లలో మాన్యువల్, ఆటోమేటెడ్ ట్రాన్స్‌మిషన్ ఆప‍్షన్లలో అందుబాటులోకి వచ్చింది. పాదచారుల భద్రత, యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబీఎస్), ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్‌

Most from this category