STOCKS

News


ఐడీబీఐ బ్యాంక్‌ అధికారుల సమ్మె!!

Thursday 12th July 2018
news_main1531411300.png-18264

న్యూఢిల్లీ: ఐడీబీఐ బ్యాంక్‌లోని ఒక వర్గం అధికారులు సోమవారం నుంచి ఆరు రోజులపాటు (జూలై 16 నుంచి 21 వరకు) సమ్మె బాట పడతామని హెచ్చరించారు. ఎల్‌ఐసీకి వాటా విక్రయం, వేతన సంబంధిత అంశాలను దీనికి కారణంగా పేర్కొన్నారు. బ్యాంక్‌ ఒక వర్గం అధికారుల నుంచి సమ్మెకు సంబంధించి లేఖ అందిందని ఐడీబీఐ తాజాగా రెగ్యులేటరీకి తెలియజేసింది. కాగా ఐడీబీఐ బ్యాంక్‌ ఉద్యోగులకు వేతన సవరణ అంశం 2012 నవంబర్‌ నుంచి పెండింగ్‌లో ఉంటూ వస్తోన్న విషయం తెలిసిందే. ఉద్యోగుల ఇదే విషయమై గతేడాది సమ్మె చేస్తామని హెచ్చరించారు. అయితే మేనేజ్‌మెంట్‌ హామీ నేపథ్యంలో సమ్మె చేయలేదు. ఆల్‌ ఇండియా ఐడీబీఐ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌.. ఎల్‌ఐసీకి ఐడీబీఐ బ్యాంక్‌లో 51 శాతం వాటా విక్రయాన్ని వ్యతిరేకించింది. ఈ చర్య బ్యాంక్‌ ప్రైవేటీకరణకు దారి తీయవచ్చని అభిప్రాయపడింది. ఇదే విషయాన్ని కేంద్ర మంత్రి అరుణ్‌ జైట్లీకి కూడా తెలియజేసింది. మరోవైపు ఎల్‌ఐసీ-ఐడీబీఐ బ్యాంక్‌ డీల్‌ సెప్టెంబర్‌ చివరి నాటికి పూర్తికావొచ్చని విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రస్తుతం ఎల్‌ఐసీ.. ఐడీబీఐ బ్యాంక్‌ విలువ లెక్కించే పనిలో ఉంది.   



You may be interested

తలసరి ఆదాయంలో వెనుకే ఉన్నాం!

Thursday 12th July 2018

న్యూఢిల్లీ: ప్రపంచంలో ఆరో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ అవతరించడం ఊహించినదేనని, తలసరి ఆదాయ పరంగా ఇప్పటికీ మనం తక్కువ స్థాయిలోనే ఉన్నామని, ఈ విషయంలో చాలా దూరం ప్రయాణించాల్సి ఉందన్నారు నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌ రాజీవ్‌ కుమార్‌. అంతర్జాతీయంగా భారత్‌ చెప్పుకోతగ్గ స్థాయిలో జోక్యం చేసుకునే విధంగా ఉండాలని కుమార్‌ అభిప్రాయపడ్డారు. త్వరలోనే మన దేశం బ్రిటన్‌ను అధిగమించి ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందన్నారు. ‘‘చాలా

68.57కు రూపాయి రికవరీ

Thursday 12th July 2018

ముంబై: డాలర్‌తో పోలిస్తే రూపాయి స్వల్పంగా కోలుకుంది. గురువారం ఫారెక్స్‌ మార్కెట్లో 20 పైసలు బలపడి 68.57కు చేరుకుంది. చమురు ధరలు తగ్గుముఖం పట్టడం, ఈక్విటీ మార్కెట్ల ర్యాలీతో ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి పట్ల సెంటిమెంట్‌ మెరుగుపడింది. వారం వ్యవధిలో రూపాయికి ఇది గరిష్ట స్థాయి. నాలుగు చమురు ఎగుమతి టెర్మినళ్లను తిరిగి తెరుస్తున్నట్టు లిబియా చేసిన ప్రకటన చమురు ధరల పతనానికి దారితీసింది. దీంతో డాలర్‌ అంతర్జాతీయంగా బలంగా

Most from this category