STOCKS

News


ఎల్‌ఐసీతో విలీనానికి ఐడీబీఐ బ్యాంక్‌కు అనుమతులు

Thursday 9th August 2018
news_main1533792610.png-19081

ముంబై: ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్‌ఐసీతో డీల్‌కి సంబంధించి కేంద్రం నుంచి ఆమోదముద్ర లభించినట్లు ఐడీబీఐ బ్యాంక్‌ వెల్లడించింది. రుణ సంక్షోభంలో ఉన్న ఐడీబీఐ బ్యాంకులో ఎల్‌ఐసీ 51 శాతం వాటా కొనుగోలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఎల్‌ఐసీ ప్రతిపాదనకు కేంద్రం ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తాజాగా తమ సంస్థలో ప్రభుత్వ వాటాను 50 శాతం లోపునకు తగ్గించుకునేందుకు, యాజమాన్య అధికారాలు వదులుకునేందుకు కేంద్రం సంసిద్ధత వ్యక్తం చేసినట్లు స్టాక్ ఎక్స్చేంజీలకు ఐడీబీఐ బ్యాంకు తెలిపింది. ఈ డీల్ ప్రిఫరెన్షియల్ ఇష్యూ/ఈక్విటీ ఓపెన్ ఆఫర్‌ రూపంలో ఉంటుందని పేర్కొంది. లావాదేవీ అనంతరం ఎల్‌ఐసీకి ఐడీబీఐ బ్యాంకు అనుబంధ సంస్థగా మారుతుంది. ప్రస్తుతం ఐడీబీఐ బ్యాంకులో ఎల్‌ఐసీకి 7.98 శాతం వాటా ఉంది. బుధవారం బీఎస్‌ఈలో ఐడీబీఐ బ్యాంకు షేరు ధర పెద్దగా మార్పులు లేకుండా రూ. 61.95 వద్ద ముగిసింది. 



You may be interested

గత నాలుగేళ్లలో రూ.80 వేలకు తలసరి ఆదాయం!

Thursday 9th August 2018

న్యూఢిల్లీ: భారత్‌ సగటు తలసరి ఆదాయం గడచిన నాలుగేళ్లలో రూ.80 వేలకు చేరింది. గణాంకాల శాఖ సహాయమంత్రి విజయ్‌ గోయెల్‌ లోక్‌సభకు ఇచ్చిన ఒక లిఖిత పూర్వక సమావేశంలో ఈ విషయాన్ని తెలిపారు.  ఆయన తెలిపిన సమాచారం ప్రకారం- 2014-15 నుంచి 2017-18 మధ్య కాలంలో దేశంలో సగటు తలసరి ఆదాయం రూ.79,882. 2001-12 నుంచి 2014-15 మధ్య కాలంలో తలసరి ఆదాయం రూ.67,594.  నాలుగేళ్లలో వేర్వేరుగా... ఆర్థిక సంవత్సరం    వృద్ధి (శాతం)  

సిప్లా లాభం రూ.451 కోట్లు

Thursday 9th August 2018

న్యూఢిల్లీ: ఫార్మా దిగ్గజం సిప్లా నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో 10 శాతం పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ1లో రూ.409 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ1లో రూ.451 కోట్లకు పెరిగిందని సిప్లా తెలియజేసింది. అమెరికాలో అమ్మకాలు అంతంత మాత్రంగానే ఉన్నప్పటికీ, భారత్‌, దక్షిణాఫ్రికాల్లో అమ్మకాలు జోరుగా ఉండటంతో ఈ క్యూ1లో ఈ స్థాయి నికర లాభం సాధించామని  సిప్లా ఎమ్‌డీ,

Most from this category