STOCKS

News


ఎల్‌ఐసీ వాటా కొనుగోలుకు ఆమోదం

Saturday 1st September 2018
news_main1535779869.png-19860

 న్యూఢిల్లీ: ఐడీబీఐ బ్యాంక్‌లో అదనంగా ఏడు శాతం వాటాను కొనుగోలు చేయాలన్న ఎల్‌ఐసీ ప్రతిపాదనకు ఐడీబీఐ బ్యాంక్‌ డైరెక్టర్ల బోర్డ్‌ ఆమోదం తెలిపింది. ఎల్‌ఐసీకి ప్రిఫరెన్షియల్‌ ప్రాతిపదికన  ఈక్విటీ షేర్ల జారీకి వాటాదారుల ఆమోదాన్ని పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా కోరతామని ఐడీబీఐ బ్యాంక్‌ తెలిపింది. ప్రస్తుతం ఐడీబీఐ బ్యాంక్‌లో ఎల్‌ఐసీకి 7.98 శాతం వాటా ఉంది. తాజాగా ఈ వాటాను మరో 7 శాతానికి పెంచుకుంటోంది. ఐడీబీఐ బ్యాంక్‌లో 51 శాతం వాటా కొనుగోలుకు ఇదొక మెట్టని నిపుణులు భావిస్తున్నారు. ఐడీబీఐ బ్యాంక్‌లో 51 శాతం వాటాను ఎల్‌ఐసీ కొనుగోలు చేయనున్నది. ఈ వాటా కొనుగోలుకు ఐఆర్‌డీఏఐ ఆమోదం కూడా లభించింది. ఎల్‌ఐసీ వాటా కొనుగోలు వల్ల ఇప్పటికే భారీ నష్టాలతో కుదేలైన ఐడీబీఐ బ్యాంక్‌కు ఊరట లభిస్తుంది. 



You may be interested

నేడే పోస్టల్‌ బ్యాంక్‌ ప్రారంభం

Saturday 1st September 2018

న్యూఢిల్లీ: ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్‌ (ఐపీపీబీ)ను శనివారం ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ప్రారంభించనున్నారు. న్యూఢిల్లీలోని తాల్కటోరా స్టేడియంలో బ్యాంక్‌ ప్రారంభోత్సవం జరగనుండగా.. ఏకకాలంలో 650 శాఖలు, 3250 కేంద్రాల వద్ద పేమెంట్స్‌ బ్యాంకు సేవలు ప్రారంభం అవుతాయని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. కేంద్ర ప్రభుత్వ లక్ష్యమైన సమ్మిళిత వృద్ధిలో ఈ బ్యాంక్‌ పాత్ర కీలకం కానుందని పేర్కొంది. సామాన్యులకు అతి చేరువలో ఉన్న ఈ బ్యాంక్‌.. విశ్వసనీయమైన

ఆధార్‌పై బ్యాంకులకు అదనపు గడువు

Saturday 1st September 2018

న్యూఢిల్లీ: ఖాతాదారుల ఆధార్‌ నమోదు విషయంలో బ్యాంకులకు వెసులుబాటు లభించింది. గడువును నవంబర్‌ 1 వరకు పొడిగిస్తూ యూఐడీఏఐ బ్యాంకులకు సమాచారం ఇచ్చింది. ఎంపిక చేసిన ప్రతి శాఖలో జూలై 1 నుంచి ప్రతి రోజు కనీసం ఎనిమిది ఆధార్‌ నమోదులు లేదా అప్‌డేషన్‌ చేసేలా చూడాలని బ్యాంకులను యూఐడీఏఐ ఈ ఏడాది జూన్‌లో కోరింది. అక్టోబర్‌ నుంచి ప్రతీ రోజూ 12 నమోదులు, 2019 జనవరి నుంచి రోజూ

Most from this category