STOCKS

News


ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ డిబెంచర్ల రేటింగ్ డౌన్‌గ్రేడ్‌

Monday 10th September 2018
news_main1536557276.png-20121

న్యూఢిల్లీ:  ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్సింగ్ సంస్థ ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ రుణాలు, డిబెంచర్ల రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్ చేసినట్లు రేటింగ్ ఏజెన్సీ ఇక్రా వెల్లడించింది. భారీ స్థాయిలో రుణాల చెల్లింపులు జరపాల్సి ఉండటం, నిధులపరమైన ఒత్తిళ్లు నెలకొనడంతో డిఫాల్టు రిస్కులు ఉండటమే ఇందుకు కారణంగా పేర్కొంది. రూ. 5,225 కోట్ల నాన్ కన్వర్టబుల్ డిబెంచర్ ప్రోగ్రామ్ దీర్ఘకాలిక రేటింగ్‌ను, రూ. 350 కోట్ల టర్మ్ రుణాల రేటింగ్‌ను 'ఎఎప్లస్‌' నుంచి 'బిబి' స్థాయికి తగ్గించినట్లు ఇక్రా తెలిపింది. ‍‍అలాగే రూ. 2,500 కోట్ల కమర్షియల్ పేపర్ల రేటింగ్‌ను కూడా 'ఎ4'  నుంచి 'ఎ1ప్లస్'  స్థాయికి తగ్గించినట్లు వివరించింది. ప్రమోటర్ గ్రూప్ నుంచి రూ. 8,000 కోట్లు సమీకరించే ప్రక్రియలో ఉన్నప్పటికీ.. ఇవి సమయానికి అందితేనే సంస్థ ఆర్థిక పరిస్థితి మెరుగుపడగలదని, దీనిపైనే రేటింగ్‌ను సవరించడం ఆధారపడి ఉంటుందని ఇక్రా తెలిపింది. 



You may be interested

ఎఫ్‌పీఐల కేవైసీ నిబంధనల్లో  మార్పులు !

Monday 10th September 2018

న్యూఢిల్లీ:  కొత్త కేవైసీ నిబంధనలకు సంబంధించి విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లకు (ఎఫ్‌పీఐలు)ఊరటనిచ్చే నిర్ణయాన్ని మార్కెట్‌ నియంత్రణ సంస్థ, సెబీ  శనివారం తీసుకుంది.  ఈ కొత్త కేవైసీ నిబంధనలపై ఆర్‌బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్‌ హెచ్‌. ఆర్‌. ఖాన్‌ అధ్యక్షతన గల అత్యున్నత స్థాయి సంఘం పలు వివాదాస్పద విషయాలపై చాలా మార్పులను సూచించింది. ఈ సిఫార్సుల ప్రకారం ఎన్నారైలు, ఓసీఐలు (ఓవర్సీస్‌ సిటిజన్స్‌ ఆఫ్‌ ఇండియా), ఆర్‌ఐలు (రెసిడెంట్‌ ఇండియన్స్‌)

2020 నాటికి రూ.20 లక్షల కోట్లకు

Monday 10th September 2018

న్యూఢిల్లీ: దేశీయ బీమా రంగం 2019-20 సంవత్సరానికి 280 బిలియన్‌ డాలర్ల (రూ.20 లక్షల కోట్లు) స్థాయికి చేరుతుందని, కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక ఆయుష్మాన్‌ భారత్‌ పథకం, ఖర్చు చేసే ఆదాయం పెరగడం, బీమాపై అవగాహన పెరగడం వృద్ధికి కారణాలుగా అసోచామ​-ఏపీఏస్‌ అధ్యయనం పేర్కొంది. ‘‘బీమా విస్తరణ దేశంలో 2001 నాటికి 2.71 శాతంగా ఉంటే, 2017 నాటికి 3.7 శాతానికి పెరిగింది. 2011-12లో బీమా సంస్థల స్థూల ప్రీమియం

Most from this category