STOCKS

News


జావా బుకింగ్స్‌... టాప్‌ -5లో హైదరాబాద్‌

Tuesday 29th January 2019
news_main1548735754.png-23865

మార్చి నుంచి బైక్‌ల డెలివరీ
భాగ్యనగరంలో మూడు షోరూంలు

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: జావా మోటార్‌సైకిళ్ల బుకింగ్స్‌లో హైదరాబాద్‌ టాప్‌-5లో నిలిచింది. దేశంలో దక్షిణాది నుంచే అత్యధిక బుకింగ్‌లు వచ్చినట్లు జావాను ప్రమోట్‌ చేస్తున్న క్లాసిక్‌ లెజెండ్స్‌ కో-ఫౌండర్‌ అనుపమ్‌ థరేజా వెల్లడించారు. హైదరాబాద్‌లో మూడు షోరూంలను ప్రారంభించిన సందర్భంగా సోమవారమిక్కడ ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ఆన్‌లైన్‌ బుకింగ్స్‌ క్లోజ్‌ చేశాం. ఊహించిన దాని కంటే ఎక్కువ బుకింగ్స్‌ నమోదయ్యాయి. బ్రాండ్‌ న్యూ ఇంజన్‌తో మోడళ్లకు రూపకల్పన చేశాం. బీఎస్‌-6 ప్రమాణాలకు అనుగుణంగా ఉంటాయి. లైఫ్‌స్టైల్‌, క్లాసిక్‌ బైక్‌లు ఇవి. ఎవరైనా సులువుగా రైడ్‌ చేయవచ్చు. బైక్‌ల తయారీకై 700 మంది వెండార్ల నుంచి విడిభాగాలను కొనుగోలు చేస్తున్నాం. వీరంతా కొత్త ప్లాంట్లు, యూనిట్లను ఏర్పాటు చేస్తున్నారు. అందుకే డెలివరీలు ఆలస్యం అవుతున్నాయి. తెలంగాణలో 9, ఏపీలో 16 ఔట్‌లెట్లు రానున్నాయి. మొత్తం 86 నగరాల్లో మార్చికల్లా 105 షోరూంలు తెరుచుకుంటాయి. ఇవి ప్రారంభం అయిన తర్వాతే డెలివరీలు ప్రారంభిస్తాం’ అని వివరించారు.



You may be interested

హెచ్‌బీఐఎస్‌ గ్రూపుతో టాటా స్టీల్‌ కీలక ఒప్పందం

Tuesday 29th January 2019

ఆగ్నేయ ఆసియా వ్యాపారాల్లో 70 శాతం వాటా అమ్మకం డీల్‌ విలువ రూ.3,408 కోట్లు న్యూఢిల్లీ: టాటా స్టీల్‌ ఆగ్నేయ ఆసియాలోని తన వ్యాపారాల్లో మెజారిటీ వాటాను చైనాకు చెందిన హెచ్‌బీఐఎస్‌ గ్రూపునకు విక్రయించనుంది. ఇందుకు సంబంధించి హెచ్‌బీఐఎస్‌ గ్రూపు కంపెనీతో టాటా స్టీల్‌ అనుబంధ కంపెనీ టీఎస్ గ్లోబల్‌ హోల్డింగ్స్‌ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా సింగపూర్‌లోని నాట్‌స్టీల్‌ హోల్డింగ్స్‌ పీటీఈ లిమిటెడ్‌, టాటా స్టీల్‌ (థాయిలాండ్‌) పబ్లిక్‌ కంపెనీ

కాలం చెల్లిన వాహనాల మార్పిడిపై రాయితీ

Tuesday 29th January 2019

- కార్లపై రెండుకు మించి పన్ను రేట్లు వద్దు - ఎలక్ట్రిక్‌ వాహనాలకు ప్రత్యేక పన్ను రేటు - ఈ సారైనా బడ్జెట్‌లో వీటికి చోటివ్వాలి - ఆటోమొబైల్‌ పరిశ్రమ డిమాండ్లు న్యూఢిల్లీ: దేశంలో పెరిగిపోతున్న వాహన కాలుష్యం నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం ఒకవైపు ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో ఉండగా... ఈ దిశగా ఆటోమొబైల్‌ పరిశ్రమ పలు కీలక సూచనలు చేసింది. రానున్న మధ్యంతర బడ్జెట్లో వీటికి చోటు కల్పించాలని డిమాండ్‌ చేసింది.

Most from this category