STOCKS

News


ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ లాభం 34 శాతం డౌన్‌

Tuesday 15th January 2019
news_main1547535440.png-23597

  • 18 శాతం తగ్గిన ఆదాయం

న్యూఢిల్లీ: ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ కంపెనీ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలానికి 34 శాతం తగ్గింది. గత క్యూ3లో రూ.154 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ3లో రూ.101 కోట్లకు తగ్గిందని ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.494 కోట్ల నుంచి 18 శాతం తగ్గి రూ.405 కోట్లకు చేరిందని పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పలు సమస్యలు తమ వ్యాపారంపై ప్రభావం చూపాయని వివరించింది. స్టాక్‌ మార్కెట్‌ తీవ్రమైన ఒడిదుడుకుల్లో ఉండటం, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీల లిక్విడిటీ కష్టాలు, కంపెనీల ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్లు(ఐపీఓ)లు అంతంత మాత్రంగానే ఉండటం, మార్కెట్‌ నియంత్రణ సంస్థ, సెబీ తీసుకున్న కఠిన నిర్ణయాలు... ఇవన్నీ ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌, తమ వ్యాపారంపై ప్రతికూల ప్రభావం చూపాయని ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ తెలిపింది.



You may be interested

భారీగా పెరిగిన పీఈ, వీసీ పెట్టుబడులు

Tuesday 15th January 2019

2018లో 2.45 లక్షల కోట్ల రాక అంతకుముందు ఏడాదితో పోలిస్తే 35 శాతం వృద్ధి ఉపసంహరణ విలువ రూ.1.82 లక్షల కోట్లు ముంబై: ప్రైవేటు ఈక్విటీ(పీఈ), వెంచర్‌ క్యాపిటల్‌ (వీసీ) పెట్టుబడులు గతేడాది భారీ ఎత్తున వచ్చాయి. 2017లో 26.1 బిలియన్‌ డాలర్లు ఈ రూపంలో రాగా, 2018లో ఏకంగా 35 శాతం అధికంగా 35.1 బిలియన్‌ డాలర్ల (రూ.2,45,700 కోట్లు) మేర పెట్టుబడులు తరలివచ్చాయి. భారీ డీల్స్‌ 2017లో చోటు చేసుకోవడమే ఈ

మళ్లీ మార్కెట్లోకి లాంబ్రెటా!

Tuesday 15th January 2019

2020 ఆటో ఎక్స్‌పోలో ఎలక్ట్రిక్‌ వెర్షన్‌ ఆవిష్కరణ భారత మార్కెట్‌ కోసం సూపర్‌ లాంబ్రెటాపై కసరత్తు ప్రీమియం సెగ్మెంట్‌పై దృష్టి దేశీ ద్విచక్ర వాహనాల మార్కెట్లో ప్రస్తుతం రెట్రో ట్రెండ్‌ నడుస్తోంది. గతంలో ఓ వెలుగు వెలిగి.. కనుమరుగైపోయిన పాత బ్రాండ్స్‌ ఒక్కొక్కటిగా మళ్లీ తిరిగొస్తున్నాయి. ఇటీవలే జావా మోటార్‌ సైకిల్‌ రీఎంట్రీ ఇవ్వగా .. తాజాగా సుమారు మూడు దశాబ్దాల తర్వాత స్కూటర్‌ బ్రాండ్‌ లాంబ్రెటా కూడా పునరాగమనానికి సిద్ధమవుతోంది. లాంబ్రెటా తయారీ

Most from this category