STOCKS

News


23 శాతం తగ్గిన ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ నికర లాభం

Thursday 25th April 2019
news_main1556152418.png-25330

రెట్టింపైన ఆదాయం   ఒక్కో షేర్‌కు రూ.1.55 డివిడెండ్‌ 

న్యూఢిల్లీ: ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం జనవరి–మార్చి క్వార్టర్లో 23 శాతం తగ్గింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.340 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.261 కోట్లకు తగ్గిందని ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ తెలిపింది.

మొత్తం ఆదాయం మాత్రం రూ.7,137 కోట్ల నుంచి రెట్టింపునకు పైగా పెరిగి రూ.16,054 కోట్లకు పెరిగిందని పేర్కొంది. రూ. 10 ముఖ విలువ గల ఒక్కో షేర్‌కు రూ.1.55 డివిడెండ్‌ను ఇవ్వనున్నామని తెలిపింది.  ఈ ఏడాది మార్చి నాటికి కంపెనీ ఎంబెడెడ్‌ వేల్యూ(ఈవీ) 15 శాతం పెరిగి రూ.21,623 కోట్లకు చేరిందని కంపెనీ తెలిపింది.You may be interested

క్రూడ్‌ మంట... డాలర్ల వెలుగు!

Thursday 25th April 2019

రూపాయి 24 పైసలు బలహీనం 69.86 వద్ద ముగింపు ముంబై: అంతర్జాతీయంగా పెరుగుతున్న ముడి చమురు ధరలు, దేశీయంగా అమెరికా డాలర్లకు పెరిగిన డిమాండ్‌.. ఈ రెండూ రూపాయిని బలహీనపరచాయి. ఇంటర్‌ బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్‌లో రూపాయి 24 పైసలు బలహీనపడి డాలర్‌తో పోలిస్తే 69.86 వద్ద ముగిసింది. దిగుమతిదారుల నుంచి డాలర్లకు భారీ డిమాండ్‌ ఏర్పడటంతో ఒక దశలో రూపాయి నాలుగు నెలల కనిష్టస్థాయి 69.97ను కూడా చూసింది. అమెరికాలో గృహ కొనుగోళ్లు

హెక్సావేర్‌ టెక్నాలజీస్‌ లాభం రూ.138 కోట్లు

Thursday 25th April 2019

ఒక్కో షేర్‌కు రూ.2.50 డివిడెండ్‌   న్యూఢిల్లీ: మిడ్‌– సైజ్‌ ఐటీ సేవల కంపెనీ హెక్స్‌వేర్‌టెక్నాలజీస్‌ ఈ ఏడాది జనవరి– మార్చి క్వార్టర్లో రూ.138 కోట్ల నికర లాభం సాధించింది. గత ఏడాది ఇదే క్వార్టర్‌లో రూ.134 కోట్ల నికర లాభం వచ్చిందని, 3 శాతం వృద్ధి సాధించామని హెక్సావేర్‌ టెక్నాలజీస్‌ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.1,049 కోట్ల నుంచి 21 శాతం వృద్ధితో రూ.1,264 కోట్లకు పెరిగిందని కంపెనీ చైర్మన్‌ అతుల్‌

Most from this category