STOCKS

News


ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ డైరెక్టర్‌గా చందా కొచర్‌ !

Friday 31st August 2018
news_main1535694099.png-19823

ముంబై: ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ కంపెనీ డైరెక్టర్‌గా చందా కొచ్చర్‌ నియామకం దాదాపు ఖరారైంది.  ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ డైరెక్టర్‌గా చందా కొచర్‌కు అనుకూలంగా ఐసీఐసీఐ బ్యాంక్‌ ఓటు వేసింది. ఈ బ్రోకరేజ్‌ కంపెనీలో  ఐసీఐసీఐ బ్యాంక్‌కు 80 శాతం వాటా ఉంది. వీడియోకాన్‌ గ్రూప్‌కు ఇచ్చిన రుణాల విషయంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు రావడంతో చందా కొచర్‌ను  సెలవుపై పంపారు. ఆమెపై ఐసీఐసీఐ బ్యాంక్‌ స్వతంత్రంగా దర్యాప్తు జరుపుతోంది. ఈ నేపథ్యంలో ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ డైరెక్టర్‌గా చందా కొచర్‌కు అనుకూలంగా ఓటు వేసినందుకు విమర్శలు చెలరేగుతున్నాయి. సెలవులో ఉన్న ఆమెకు కంటితుడుపు చర్యగా ఈ డైరెక్టర్‌ పదవిని కట్టబెడుతున్నారని ప్రాక్సీ అడ్వైజరీ సంస్థ,  ఇన్‌గవర్న్‌ విమర్శించింది. 


 



You may be interested

రేటింగ్ అప్‌గ్రేడ్ చేయండి

Friday 31st August 2018

న్యూఢిల్లీ: స్థూల ఆర్థిక పరిస్థితులు మెరుగుపడుతున్న నేపథ్యంలో భారత్‌ రేటింగ్‌ను అప్‌గ్రేడ్ చేయాలంటూ అమెరికా రేటింగ్ ఏజెన్సీ ఎస్‌అండ్‌పీని కేంద్రం కోరింది. జీడీపీ-రుణ నిష్పత్తి దీర్ఘకాలికమైన అంశమని, రేటింగ్‌ను తక్షణం పెంచే విషయంలో దీని గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొంది. కరెంటు అకౌంటు లోటు (క్యాడ్‌) పెరుగుతుండటం, రూపాయి మారకం విలువ పతనమవుతండటం తదితర అంశాల నేపథ్యంలో ఎస్‌అండ్‌పీ వర్గాలు గురువారం కేంద్ర ఆర్థిక శాఖతో

పెరగనున్న సహజ వాయువు ధర

Friday 31st August 2018

న్యూఢిల్లీ: దేశీయంగా ఉత్పత్తి చేసే సహజ వాయువు ధరను కేంద్రం ఈ ఏడాది అక్టోబర్‌ నుంచి 14 శాతం పైగా పెంచే అవకాశం౾ ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో సీఎన్‌జీ రేట్లతో పాటు విద్యుత్‌, ఎరువుల ఉత్పత్తి వ్యయాలు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం యూనిట్‌కు (మిలియన్ ప్రామాణిక బ్రిటీష్ యూనిట్ - ఎంబీటీయూ) రేటు 3.06 డాలర్లుగా ఉండగా.. దీన్ని 3.5 డాలర్లకు పెంచవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి.

Most from this category