News


చందా కొచర్, ధూత్ నివాసాల్లో ఈడీ సోదాలు

Saturday 2nd March 2019
news_main1551502109.png-24397

- వీడియోకాన్‌కు ఐసీఐసీఐ బ్యాంక్ రుణాల కేసులో దర్యాప్తు

న్యూఢిల్లీ: వీడియోకాన్ గ్రూప్‌నకు ఐసీఐసీఐ బ్యాంకు రూ. 1,875 కోట్ల రుణాలిచ్చిన కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు వేగవంతం చేసింది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈవో చందా కొచర్‌తో పాటు వీడియోకాన్ ప్రమోటర్‌ వేణుగోపాల్ ధూత్ నివాసాల్లో శుక్రవారం ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. దక్షిణ ముంబైలోని కొచర్ నివాసంలో, ఔరంగాబాద్‌లోని ధూత్ నివాసంలో ఈడీ తనిఖీలు నిర్వహించింది. సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా మనీలాండరింగ్‌ కేసు నమోదు చేసిన ఈడీ.. కొచర్ నివాసంలో సోదాలు చేయడం ఇదే తొలిసారి. సీబీఐ ఇప్పటికే ముంబైలోని నాలుగు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించింది. 


    ప్రైవేట్ కంపెనీలకు మంజూరు చేసిన రుణాల విషయంలో చందా కొచర్‌పై ఐసీఐసీఐ బ్యాంక్‌ను మోసగించడం, క్రిమినల్ కుట్ర ఆరోపణలు ఉన్నాయి. కన్సార్షియంలో భాగంగా వీడియోకాన్ గ్రూప్‌నకు ఐసీఐసీఐ బ్యాంక్‌ ఇచ్చిన రుణాల్లో అవకతవకలేమైనా జరిగాయా అన్న కోణంలో జరిగిన ప్రాథమిక విచారణ (పీఈ) అనంతరం చందా కొచర్‌, ఆమె భర్త దీపక్ కొచర్‌, వీడియోకాన్ గ్రూప్ అధికార్లపై ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. దీనిపై ఐసీఐసీఐ బ్యాంక్ ఏర్పాటు చేసిన జస్టిస్ బీఎన్‌ శ్రీకృష్ణ కమిటీ కూడా వీడియోకాన్‌ గ్రూప్‌నకు రుణాల మంజూరీలో చందా కొచర్‌ బ్యాంక్ నిబంధనలను ఉల్లంఘించారని తేల్చింది. వీడియోకాన్ గ్రూప్‌నకు ఐసీఐసీఐ బ్యాంక్‌ రుణాల మంజూరీలో చందా కొచర్ పాత్ర కూడా ఉండటం, ఆ తర్వాత ఆమె భర్త దీపక్‌కి చెందిన న్యూపవర్ రెన్యూవబుల్స్‌లో ధూత్‌ పెట్టుబడులు పెట్టినట్లు వెల్లడవటంతో ఈ వివాదం వెలుగులోకి వచ్చింది. వీడియోకాన్ గ్రూప్‌కి ఇచ్చిన రుణాలు మొండిబాకీలుగా మారాయి. 
 



You may be interested

యస్ బ్యాంక్ ఎండీగా రవ్‌నీత్ గిల్‌కు బాధ్యతలు

Saturday 2nd March 2019

మూడేళ్ల పాటు పదవీకాలం ముంబై: ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం యస్‌ బ్యాంక్ ఎండీ, సీఈవోగా రవ్‌నీత్ గిల్ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. బ్యాంక్ సహ-వ్యవస్థాపకుడు రాణా కపూర్‌ స్థానంలో ఆయన నియమితులైన సంగతి తెలిసిందే. గిల్‌ పదవీకాలం మూడేళ్లు ఉంటుంది. ఇప్పటిదాకా జర్మనీ బ్యాంకింగ్‌ దిగ్గజం డాయిష్ బ్యాంక్ భారత విభాగానికి గిల్ సారథ్యం వహించారు. నిర్దిష్ట కారణాలు బహిరంగంగా వెల్లడించనప్పటికీ .. రాణా కపూర్ పదవీ కాలాన్ని పొడిగించడానికి

సెబీ సంస్కరణల జోష్‌

Saturday 2nd March 2019

రూ.కోటి లావాదేవీలపై బ్రోకర్ల చార్జీ ఇకపై రూ.10 ప్రస్తుతం ఇది రూ.15 అగ్రి కమోడిటీలపై రూ.15 నుంచి రూపాయికి తగ్గింపు లిస్టింగ్‌ ఫీజులకూ కోత స్టార్టప్‌లో పెట్టుబడులకు చేయూత పెట్టుబడుల నిబంధనలు సరళతరం కమోడిటీస్‌లోకి మ్యూచువల్‌ ఫండ్స్‌, పీఎంఎస్‌లు ఓపెన్‌ ఆఫర్‌ నుంచి బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు మినహాయింపు సెబీ బోర్డు నిర్ణయాలు న్యూఢిల్లీ: దేశీయ ఈక్విటీ, క్యాపిటల్‌ మార్కెట్లను మరింత బలోపేతం, విస్తృతం చేసే దిశగా సెక్యూరిటీస్‌ ఎక్సేంజ్‌ బోర్డు (సెబీ) శుక్రవారం నిర్ణయాలు తీసుకుంది. ట్రేడింగ్‌ చార్జీల భారాన్ని తగ్గించడం

Most from this category