News


ఐసీఐసీఐ డిపాజిట్‌ రేట్లు పావు శాతం పెంపు

Thursday 15th November 2018
news_main1542258681.png-22028

ముంబై: ఐసీఐసీఐ బ్యాంకు డిపాజిట్లపై వడ్డీ రేట్లను పావు శాతం పెంచింది. ఆర్‌బీఐ రెండు సార్లు కీలక రేట్లను పెంచడం, ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ సంక్షోభం తర్వాత మార్కెట్లో నిధుల లభ్యత తగ్గడం వంటి పరిస్థితుల నేపథ్యంలో డిపాజిట్లను ఆకర్షించడానికి బ్యాంకు ఈ నిర్ణయం తీసుకుంది. ఆర్థిక మార్కెట్లలో అధిక అస్థిరత నెలకొనడంతో ఫిక్స్‌డ్‌ డిపాజిట్లలో ఇన్వెస్ట్‌ చేయాలన్న ఆసక్తి కస్టమర్లలో తిరిగి ఆరంభమైందని ఐసీఐసీఐ రిటైల్‌ రుణాల విభాగం అధిపతి ప్రణవ్‌మిశ్రా చెప్పారు. రెండేళ్లకు పైగా, మూడేళ్లలోపు కాల వ్యవధి కలిగిన రూ.కోటి లోపు డిపాజిట్లపై బ్యాంకు ఇక నుంచి 7.5 శాతం వడ్డీ రేటు ఇస్తుంది. 46-60 రోజులు, 61-90 రోజులు, 91-120 రోజులు, 121-184 రోజుల డిపాజిట్లపైనా వడ్డీ రేట్లను పావుశాతం పెంచింది. ఏడాది నుంచి 389 రోజుల డిపాజిట్‌పై మాత్రం వడ్డీ రేటును 0.15 శాతం పెంచింది. అలాగే, 390 రోజుల నుంచి రెండేళ్ల వరకు కాల డిపాజిట్లపై వడ్డీ రేటును 0.10 శాతం పెంచింది. గురువారం నుంచి పెరిగిన రేట్లు అమల్లోకి వస్తాయని తెలిపింది.



You may be interested

ఐడీబీఐ బ్యాంక్‌ నష్టాలు రూ.3,602 కోట్లు

Thursday 15th November 2018

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఐడీబీఐ బ్యాంక్‌కు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో భారీగా నష్టాలొచ్చాయి. గత ఆర్థిక సంవత్సరం క్యూ2లో రూ.198 కోట్లుగా ఉన్న నికర నష్టాలు ఈ క్యూ2లో రూ.3,602 కోట్లకు పెరిగాయి. మొండి బకాయిలు బాగా పెరగడం, వడ్డీ ఆదాయం తక్కువగా ఉండటంతో నికర నష్టాలు ఈ స్థాయికి చేరాయని ఐడీబీఐ బ్యాంక్‌ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.8,302 కోట్ల నుంచి రూ.6,162 కోట్లకు

ఫ్యూచర్‌ రిటైల్‌ లాభం రూ.175 కోట్లు

Thursday 15th November 2018

న్యూఢిల్లీ: బిగ్‌ బజార్‌, ఎఫ్‌బీబీ, ఈజీడే, హెరిటేజ్‌ తదితర దుకాణాలను నిర్వహించే కిశోర్‌ బియానీకి చెందిన ఫ్యూచర్‌ రిటైల్‌ సెప్టెంబర్‌ త్రైమాసికంలో రూ.175.1 కోట్ల స్టాండలోన్‌ లాభాన్ని ప్రకటించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.153 కోట్ల లాభంతో పోలిస్తే 14 శాతానికి పైగా పెరిగింది. మొత్తం ఆదాయం సైతం రూ.4,506 కోట్ల నుంచి రూ.4,928 కోట్లకు వృద్ధి చెందింది. ఫ్యూచర్‌ రిటైల్‌కు దేశవ్యాప్తంగా 373 పట్టణాల్లో పలు

Most from this category