STOCKS

News


జేపీ అసోసియేట్స్‌పై దివాలా పిటీషన్‌ !

Tuesday 11th September 2018
news_main1536642824.png-20160

న్యూఢిల్లీ: జైప్రకాశ్‌ అసోసియేట్స్‌కు వ్యతిరేకంగా ఐసీఐసీఐ బ్యాంక్‌ దివాలా పిటీషన్‌ దాఖలు చేసింది. నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యునల్‌(ఎన్‌సీఎల్‌టీ)అలహాబాద్‌ బెంచ్‌లో ఈ దివాలా పిటీషన్‌ను ఐసీఐసీఐ బ్యాంక్‌ దాఖలు చేసింది. దివాలా  నోటీసును మూడు రోజుల్లో జేపీ అసోసియేట్స్‌కు పంపించాలని ఐసీఐసీఐ బ్యాంక్‌ను ఎన్‌సీఎల్‌టీ అలహబాద్‌ బెంచ్‌ ఆదేశించింది. మరోవైపు ఈ నెల 17లోపు దీనికి సమాధానం ఇవ్వాలని జేపీ అసోసియేట్స్‌ను కూడా ఆదేశించింది. ఐసీఐసీఐ బ్యాంక్‌ అభ్యర్థనను మన్నించి జైప్రకాశ్‌ అసోసియేట్స్‌కు వ్యతిరేకంగా దివాలా ప్రక్రియను ఎన్‌సీఎల్‌టీ అనుమతిస్తే, దివాలా ప్రక్రియకు గురైన రెండో కంపెనీగా జేపీ అసోసియేట్స్‌ నిలుస్తుంది. ఇప్పటికే జేపీ ఇన్‌ఫ్రాటెక్‌ పై దివాలా ప్రక్రియ నడుస్తోంది. కాగా జేపీ గ్రూప్‌ రుణ భారం రూ.70,000 కోట్లుగా ఉంటుందని అంచనా. సిమెంట్‌, ఇతర వ్యాపారాల విక్రయం ద్వారా ఈ రుణ భారం రూ.30,000 కోట్లకు తగ్గిందని అంచనా. 



You may be interested

నీషల్‌మోదీని రప్పించేందుకు సీబీఐ యత్నాలు

Tuesday 11th September 2018

న్యూఢిల్లీ: నీరవ్‌మోదీ సోదరుడు నీషల్‌ మోదీని భారత్‌కు రప్పించే విషయంలో సీబీఐ తన ప్రయత్నాలు ఆరంభించినట్టు అధికార వర్గాలు తెలిపారు. ఇందుకు సంబంధించి సీబీఐ కేంద్ర హోంశాఖకు అభ్యర్థన పంపినట్టు పేర్కొన్నాయి. సీబీఐ వినతిని కేంద్ర హోంశాఖ బెల్జియంకు పంపనుంది. నీషల్‌ మోదీ బెల్జియంలోనే తలదాచుకున్నట్టు అధికార వర్గాలు పేర్కొన్నాయి. బెల్జియం పౌరసత్వం కలిగిన నీషల్‌మోదీపై ఇంటర్‌పోల్ రెడ్‌కార్నర్‌ నోటీసులు కూడా జారీ అయ్యాయి. బెల్జియంతో మన దేశానికి నిందితుల/నేరస్థుల

రూపాయి కోసం ఆర్‌బీఐతో కేంద్రం సంప్రదింపులు

Tuesday 11th September 2018

న్యూఢిల్లీ: డాలర్‌తో రూపాయి అదే పనిగా పడిపోతుండడంతో కేంద్రం తన వంతు ప్రయత్నాలు ఆరంభించింది. ఆర్‌బీఐ జోక్యం ద్వారా రూపాయి క్షీణతకు చెక్‌ పెట్టేందుకు కేంద్ర ఆర్థిక శాఖ సంప్రదింపులు జరుపుతున్నట్టు ఓ అధికారి తెలిపారు. కేంద్రం సూచనల ఫలితమేమో కానీ, ఆర్‌బీఐ ఇప్పటికే రంగంలోకి దిగి డాలర్ల అమ్మకాలు మొదలు పెట్టింది. దీంతో విదేశీ మారకం నిల్వలు ఆగస్ట్‌ చివరికి 400.10 బిలియన్‌ డాలర్లకు పరిమితమైనట్టు ఆర్‌బీఐ నివేదిక

Most from this category